general manager
-
దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జి జీఎంగా అరుణ్‌కుమార్ జైన్
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జి జనరల్ మేనేజర్‌గా అరుణ్‌కుమార్ జైన్ బాధ్యతలు చేపట్టారు. జోన్ జీఎం గజానన్ మాల్యా ఇటీవలే పదవీ విరమణ పొందడంతో తాత్కాలికంగా నైరుతి రైల్వే జీఎం సంజీవ్ కిశోర్ రెండు నెలలుగా అదనపు బాధ్యతలతో జీఎంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఏజీఎం అరుణ్‌కుమార్ జైన్‌కు జీఎం స్థాయి హోదా కల్పిస్తూ రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అరుణ్‌కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇండియన్ రైల్వేస్ సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీర్స్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ 1986 బ్యాచ్‌కు చెందిన అధికారి. గతంలో జోన్ ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికామ్ ఇంజినీర్‌గా, హైదరాబాద్ డివిజన్ డివిజినల్ రైల్వే మేనేజర్‌గా పనిచేశారు. ఇతర జోన్లలో కూడా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. -
దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జి జీఎంగా సంజీవ్ కిశోర్
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ఇన్ చార్జి జనరల్ మేనేజర్ (జీఎం)గా నైరుతి రైల్వే జీఎం సంజీవ్ కిశోర్ శనివారం బా ధ్యతలు స్వీకరించారు. మూడేళ్లపాటు జీఎంగా పనిచేసిన గజానన్ మాల్యా శుక్రవారం పదవీ విరమణ పొందటంతో పూర్తిస్థాయి జీఎం నియామకం జరిగే వరకు సంజీవ్‌కిశోర్ అద నపు బాధ్యతలు నిర్వహించనున్నారు. రైల్వేలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన.. పలు దేశాల్లో శిక్షణ తీసుకున్నారు. రైల్వే ఉన్నతి, విదేశాలకు ఇక్కడి పరికరాల ఎగుమతిలో కీలకంగా వ్యవహరించటం, విదేశాలతో ఒప్పందాల్లో చురుగ్గా వ్యవహరించటం వంటి పలు సేవలకు సంజీవ్ 2003లో రైల్వే జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. -
జనరల్ మేనేజర్‌పై పగబట్టిన మేనేజర్
సాక్షి, సిటీబ్యూరో: పిల్లల చదువు కోసం విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు బదిలీ కోరాడు ఓ మేనేజర్....దీనికి జనరల్ మేనేజర్ అంగీకరించకపోవడంతో ఉద్యోగం వదిలేశాడు...ఆ జీఎం ఉద్యోగం పొగోట్టాలని కుట్ర చేసి తానే ఇరుక్కున్నాడు..సంస్థ ఫిర్యాదు మేరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు...నకిలీ ఈ–మెయిల్ సృష్టించడం ద్వారా సైబర్ నేరానికి పాల్పడిన ఆ మాజీ ఉద్యోగిని పట్టుకున్నారు. ఇతన్ని నిందితుడిగా పరిగణిస్తూ సీఆర్పీసీ 41 (ఏ) కింద నోటీసులు జారీ చేశారు. బేగంపేట కేంద్రంగా పని చేసే వసంత్ కెమికల్స్ సంస్థకు నగరంలోని జీడిమెట్లతో పాటువిశాఖపట్నంలో తయారీ యూనిట్స్ ఉన్నాయి. ఈ సంస్థ దేశంతో పాటు విదేశాల్లోని అనేక పరిశ్రమలకు రసాయనాలు సరఫరా చేస్తుంటుంది. వసంత్ కెమికల్స్‌కు చెందిన విశాఖపట్నం యూనిట్‌కు సత్యనారాయణ జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఇదే యూనిట్లో అనకాపల్లికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి క్వాలిటీ కంట్రోల్ మేనేజర్‌గా పని చేసే వారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసిన శ్రీనివాస్ కొన్నాళ్ళుగా వసంత్ కెమికల్స్‌లోని విధులు నిర్వర్తిస్తున్నారు. (తాతల ఆస్తి అంటూ.. అర్ధరాత్రి వీరంగం) శ్రీనివాస్‌రెడ్డి తన పిల్లల చదువు నిమిత్తం తనను హైదరాబాద్‌కు బదిలీ చేయాలంటూ పలుమార్లు సత్యనారాయణను కోరారు. అయితే అనివార్య, పరిపాలన కారణాల నేపథ్యంలో ఇది సాధ్యం కాలేదు. దీంతో గత ఏడాది డిసెంబర్ 31న శ్రీనివాస్‌రెడ్డి వసంత్ కెమికల్స్‌లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే తనను బదిలీ చేయకపోవడానికి, రాజీనామా చేయడానికి జీఎం సత్యనారాయణే కారణమనే భావనలో ఉన్న శ్రీనివాస్‌రెడ్డి ఆయనపై కక్షకట్టారు. ఎలాగైనా ఆయన ఉద్యోగం కూడా పోగొట్టాలనే కుట్రపన్ని సత్యనారాయణ పేరుతో ఓ నకిలీ ఈ–మెయిల్ ఐడీ సృష్టించారు. దీన్ని వినియోగించి వసంత్ కెమికల్స్ నుంచి నిత్యం రసాయనాలు ఖరీదు చేసే విదేశీ పరిశ్రమకు మెయిల్ పంపారు. తాము తయారు చేస్తున్న ఉత్పత్తులు ఆశించిన ఫలితాలు ఇవ్వట్లేదని, ఇకపై వాటిని ఖరీదు చేయవద్దంటూ అందులో ఆరోపించాడు. దీన్ని అందుకున్న విదేశీ సంస్థ విశ్వసనీయతను సందేహించింది. (బాలునిపై అమానుషం ) అనుమానాలు నివృత్తి చేసుకోవాలనే ఉద్దేశంతో వసంత్ కెమికల్స్‌ను సంప్రదించింది. దీని యాజమాన్యం సత్యనారాయణ నుంచి వివరణ కోరడంతో అది ఆయన పేరుతో సృష్టించిన నకిలీ ఈ–మెయిల్‌గా తేలింది. దీంతో వసంత్ కెమికల్స్ యాజమాన్యం గత వారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్‌రావు సాంకేతిక ఆధారాలపై దృష్టి పెట్టారు. సదరు ఈ–మెయిల్ సృష్టించడానికి, మెయిల్ పంపడానికి వినియోగించిన ఐపీ అడ్రస్‌ల ఆధారంగా శ్రీనివాస్‌రెడ్డి నిందితుడిగా తేల్చారు. ఆయన్ను పట్టుకున్న దర్యాప్తు అధికారులు నిందితుడిగా పరిగణిస్తూ నోటీసులు జారీ చేశారు. ఈ నేరానికి సంబంధించి పక్కా ఆధారాలు సేకరించడం ద్వారా దర్యాప్తు పూర్తి న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చదవండి :ఘోరం: చిన్నారిని బలి తీసుకున్న చిరుత -
దక్షిణ మధ్య రైల్వే జీఎంగా గజానన్ మాల్యా
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌గా గజానన్ మాల్యా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. రైల్వే రంగంలో వివిధ హోదాల్లో ఆయన కీలకమైన విధులు నిర్వర్తించారు. ఇండియన్ రైల్వే సర్వీస్‌లో మెకానికల్ ఇంజనీర్స్ పూర్తి చేసిన గజానన్ మాల్యా 1979 స్పెషల్ క్లాస్ రైల్వే అప్రంటీస్ బ్యాచ్ అధికారి. ఈ క్రమంలోనే ఆయన జబల్పూర్లోని ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంస్థకు డైరెక్టర్‌గా పని చేశారు. అనంతరం దక్షిణమధ్య రైల్వేలో సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పని చేశారు. రాంచీ డివిజనల్ రైల్వే మేనేజర్, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చీఫ్ ప్రాజెక్టు మేనేజర్, రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్‌లో సీనియర్ ప్రొఫెసర్, సదరన్ రైల్వేలో చీఫ్ మెకానికల్ ఇంజనీర్‌గా గజానన్ మాల్యా విధులు నిర్వర్తించారు. దేశ, విదేశాల్లో రైల్వే రంగానికి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. -
బీఎస్ఎన్ఎల్ ఉచిత సిమ్ మేళా
కడప వైఎస్ఆర్ సర్కిల్: బీఎస్ఎన్ఎల్ ఉచిత సిమ్ మేళాను గురు, శుక్ర వారాల్లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ వై.శివశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 40 కేంద్రాల్లో, కడప నగరంలో 16 సెంటర్లలో మేళాను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సిమ్ కావాల్సిన వారు పాస్‌పోర్ట్ సైజు ఫోటో, ఆధార్‌కార్డు జిరాక్స్ తీసుకుని రావాలని అన్నారు. అమూల్య నేస్తం, స్టూడెంట్ ప్లాన్ల కింద సిమ్‌లను ఉచితంగా అందజేస్తామని వివరించారు. జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
వినియోగదారులకు మెరుగైన సేవలే లక్ష్యం
బీఎస్ఎన్ఎల్ జిల్లా ప్రిన్సిపల్ జనరల్ మేనేజరు రవిబాబు ఉదయగిరి: జిల్లాలోని బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్నామని బీఎస్ఎన్ఎల్ జిల్లా ప్రిన్సిపల్ జనరల్ మేనేజరు రవిబాబు పేర్కొన్నారు. ఉదయగిరి బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం వినియోగదారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి పరిధిలో 9 ఎక్స్ఛేంజ్ కార్యాలయాలతో పాటు 16 టవర్లు ఉన్నాయన్నారు. త్వరలో ఉదయగిరి మండలం దాసరపల్లి, బండగానిపల్లి, వరికుంటపాడు మండలం విరువూరులో టవర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రైవేటు కంపెనీలకు దీటుగా బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించిందన్నారు. కేవలం రూ.49కే ల్యాండ్‌లైన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. రూ.249, రూ.470, రూ.1149 ప్యాకేజీల్లో బ్రాడ్‌బ్యాండ్‌తో పాటు అన్లిమిటెడ్ డేటా, ఉచిత ఫోన్‌కాల్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులు తమ సమస్యలను పీజీఎం దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎం ప్రభాకర్, కావలి డీఈఈ ఇజ్రాయేలు, సబ్‌డివిజనల్ ఇంజినీరు సురేష్, తదితరులు ఉన్నారు. -
ఎస్బీహెచ్లో మరో ఇద్దరు జీఎంలకు బాధ్యతలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) కొత్తగా జనరల్ మేనేజర్లుగా నియమితులైన ఎం.ఎ. సమద్, రవీందర్ కుమార్ అగ్నిహోత్రి బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన కార్యాలయంలో రికవరీ అండ్ ప్లానింగ్ విభాగం జీఎంగా సమద్, విజయవాడ శాఖలో జీఎంగా (ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్) అగ్నిహోత్రి బాధ్యతలు చేపట్టారు. 1977లో ఎస్బీహెచ్లో చేరిన సమద్.. బ్రాంచ్ మేనేజర్, డిప్యుటీ జీఎం, జీఎం తదితర హోదాల్లో పనిచేశారు. మరోవైపు, అగ్నిహోత్రి.. 1986లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికానెర్ అండ్ జైపూర్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేరారు. ఆ తర్వాత బ్రాంచ్ మేనేజర్, రీజనల్ మేనేజర్ తదితర హోదాల్లో పనిచేశారు. -
'నిధులు లేకుండా సమావేశాలు ఎందుకు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్ర గుప్తా గురువారం సమావేశమ్యారు. రానున్న రైల్వే బడ్జెట్‌కు ప్రతిపాదనలు పంపే విషయమై ఈ సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ సమావేశం మొక్కుబడిగా సాగుతోందని, ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలకు సైతం పరిష్కారం లభించడం లేదని ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు లేకుండా సమావేశాలు నిర్వహించడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని ఎంపీలు అసహనం వ్యక్తం చేశారు. రైల్వే బడ్జెట్ సమావేశాల్లోపు రైల్వే మంత్రిని కలిసి తమ డిమాండ్లను వెల్లడిస్తామని సమావేశంలో పాల్గొన్న ఎంపీలు కొనకళ్ల నారాయణ, జేసీ దివాకర్ రెడ్డి, మాగంటి బాబు, కేశినేని నాని తదితరులు స్పష్టం చేశారు. -
ఇక పట్టాభూముల్లో ఇసుక తవ్వకాలు
తాండూరు: తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) ఆధ్వర్యంలో పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు, అమ్మకాలు జరుగనున్నాయి. జీఓ 30 ప్రకారం రాష్ట్రంలోని పది జిల్లాల్లో మొదటగా నిజామాబాద్ జిల్లాలో ఒప్పందం చేసుకున్న టీఎస్ఎండీసీ రెండో ఒప్పందం రంగారెడ్డి జిల్లాలో చేసుకుంది. శుక్రవారం టీఎస్ఎండీసీ అడిషనల్ జనరల్ మేనేజర్ ఏ.ఆనంద్ (హెచ్ఆర్) తాండూరు గనుల శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ కార్యాలయాన్ని సందర్శించారు. మైన్ ఏడీ జయరాజ్‌తో పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు, అమ్మకాలపై ఒప్పందం చేసుకున్నారు. అనంతరం అడిషనల్ జనరల్ మేనేజర్ ఆనంద్ వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో ఐదు పట్టా భూముల్లో యజమానులతో ఒప్పందాలు జరిగాయన్నారు. రంగారెడ్డి జిల్లా తాండూరు డివిజన్లోని యాలాల మండలంలో రాజశేఖరరెడ్డి (ఎకరం 30 గుంటలు), విజయ్‌కుమార్‌రెడ్డి (ఎకరం) పట్టాభూముల్లో ఇసుక తవ్వకాలకు అగ్రిమెంట్ కుదిరిందన్నారు. రాజశేఖరరెడ్డి భూమిలో 21,300 క్యూబిక్ మీటర్లు, విజయ్‌కుమార్‌రెడ్డి భూమిలో 12,240 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలు, అమ్మకాలకు ఒప్పందం జరిగిందని వివరించారు. ఒక క్యూబిక్ మీటర్ ఇసుకను రూ.600కు విక్రయించనున్నట్టు ఆయన తెలిపారు. జిల్లాతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి ఇసుక కావాలన్న విక్రయిస్తామన్నారు. ఆన్లైన్లో రూ.600 చెల్లించి ఇసుకను బుకింగ్ చేసుకోవచ్చన్నారు. ఆన్లైన్లో ఇసుక బుకింగ్ చేసుకోవడానికి ఠీఠీఠీ.్టటఝఛీఛి.్ట్ఛ్చజ్చ్చ.జౌఠి.జీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని చెప్పారు. తెలంగాణలోని మిగితా జిల్లాల్లో కూడా పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల ఒప్పందాల ప్రక్రియ తుది దశలో ఉన్నాయన్నారు. త్వరలోనే ఆయా జిల్లాల్లో కూడా ఇసుక తవ్వకాలు చేపట్టనున్నట్టు చెప్పారు. తవ్వకాలు పూర్తయ్యే వరకు లేదా ఆరు నెలలపాటు పట్టా భూముల యజమానులతో ఒప్పందం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. యాలాల మండలంలో వచ్చే సోమవారం నుంచి తవ్వకాలు ప్రారంభిస్తామని తెలిపారు. రూ.600ల్లో పట్టాదారునికి రూ.200 చెల్లిస్తామని, రూ.50 తవ్వకాల ఖర్చులతోపాటు గనుల శాఖకు సీనరేజ్ చెల్లించడం జరుగుతుందన్నారు. మిగితా డబ్బులు ప్రభుత్వ ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఆనంద్ వివరించారు. -
జీఎంను నిర్బంధించిన కార్మికులు
బొబ్బిలి(విజయనగరం): కార్మికుల సమస్యలు పరిష్కరించటంలో జాప్యం చేస్తునందుకు నిరసనగా జ్యోతిజూట్మిల్లు జీఎంను కార్మికులు నిర్బంధించారు. ఈ సంఘటన మంగళవారం విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం మండిదిబ్బ గుట్టలో చోటుచేసుకుంది. కొంతకాలంగా మిల్లు మూతపడటంతో కార్మికులు మంగళవారం యాజమాన్యంతో చర్చలకు వెళ్లారు. అయితే ఈ సందర్భంగా జీఎం తమతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ కార్మికులు జీఎం సహా మేనజర్‌ను చాంబర్లో నిర్బంధించారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ముత్తాత జాడ కోసం స్కాట్లాండ్ నుంచి ...
హైదరాబాద్: స్కాట్లాండ్కు చెందిన నికోలస్ గ్రేవ్స్ తన ముత్తాతకు సంబంధించిన సమాచారం కోసం హైదరాబాద్ నగరానికి విచ్చేశారు. నిజాం రైల్వేలో విధులు నిర్వహించిన తన ముత్తాత జేమ్స్ థిడోర్ వివరాల కోసం గ్రేవ్స్ సోమవారం దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవను కలిశారు. ఈ సందర్భంగా జేమ్స్ థిడోర్కు సంబంధించిన పెన్షన్ బుక్‌ను జీఎం శ్రీవాస్తవకు చూపించారు. ఆయన వెంటనే జేమ్స్స థిడోర్ వివరాలు సేకరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. 1932లో నిజాం రైల్వేస్‌లో జేమ్స్ థిడోర్ లోకో ఫిట్టర్‌గా విధులు నిర్వర్తించినట్లు ఈ సందర్బంగా గుర్తించారు. ఆయన 1897 డిసెంబర్ 15న జన్మించారు. కాగా థిడోర్ కుమార్తె... నికోలస్ గ్రేవ్స్ నానమ్మ అయిన ఫిలిస్ మార్గరేట్ చాంపియన్ 1920 సెప్టెంబర్ 19న సికింద్రాబాద్‌లో జన్మించారు.ఇండియాలోని బ్రిటిష్ ఆర్మీలో పని చేసిన పెర్సీ జేమ్స్ చాంపియన్‌తో ఆమె వివాహం అయింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో 1939లో నికోలస్ గ్రేవ్స్ అమ్మమ్మ, తాతయ్య ఇంగ్లాండ్ తరలి వెళ్లారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన ఇండియన్ రైల్వే ఫ్యాన్ క్లబ్ సమావేశానికి నికోలస్ గ్రేవ్స్ వచ్చారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులను నికోలస్ గ్రేవ్స్ కలిసి... తన ముత్తాత గురించి వివరించారు. దీంతో నికోలస్‌కు తన ముత్తాత సమాచారాన్ని అధికారులు అందించారు. దీంతో నికోలస్ ఆనందపరవశం పొందారు. తన ముత్తాత జేమ్స్ థియోడోర్ పింఛను పుస్తకాన్ని జీఎం శ్రీవాత్సవకు బహుమానంగా అందజేశారు. -
సిగ్నలింగ్ వ్యవస్థను పరిశీలించిన రైల్వే జీఎం
చేగుంట, న్యూస్‌లైన్: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (జీఎం) శ్రీవాత్సవ శుక్రవారం జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. చేగుంట మండలం వడియారం, తూప్రాన్ మండలం మనోహరాబాద్ రైల్వే స్టేషన్లను ఆయన సందర్శించారు. చేగుంట మండలం వడియారం 229వ నంబరు రైల్వే గేటు పనితీరును ఆయన పరిశీలించారు. సికింద్రాబాద్ నిజామాబాద్ మార్గంలో రైళ్లు 130 కిలోమీటర్ల వేగంతో వెళ్లే పరిస్థితిని ఆయన సమీక్షించారు. అనంతరం వడి యారం పరిధిలో పనిచేస్తున్న గ్యాంగ్ మెన్లతో ఆయన మాట్లాడారు. వారి క్వార్టర్స్ సౌకర్యాల పట్ల వివరాలు అడిగారు. జూనియర్ గ్యాంగ్‌మన్లకు రైల్వే లైన్ నిర్వహణ పట్ల సీనియర్లు అవగాహన కల్పించాలని సూచించారు. గేటు వద్ద ఉన్న సిగ్నలింగ్ వ్యవస్థ గేటు బయట ఉన్న పరిసరాలను ఆయన నిశితంగా పరిశీలించారు. ఆయన వెంట కమిషనర్ ఆఫ్ సెఫ్టీ, రైల్వే డిపార్ట్మెంట్ డీకే సింగ్, శ్రీహరి, సీఎస్ఓ సాహూ, ఇంజనీర్ శ్రీనువాసురావు, ఎస్పీ రంగారావు, ఏఎస్పీ సయ్యద్ ఖదీర్‌తో పాటు రైల్వే శాఖకు చెందిన పలువురు ఇంజనీర్లు, రైల్వే పోలీసులు ఉన్నారు. జీఎంకు వినతి పత్రం తూప్రాన్ మండలం మనోహరాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్స్‌ప్రెస్‌లను నిలపాలని, అదనపు రైళ్లు నడపాలని స్థానిక పీఏసీఎస్ చైర్మన్ మహిపాల్‌రెడ్డి, తూప్రాన్ - శివ్వంపేట మండలాలకు చెందిన సర్పంచ్‌లు, వ్యాపారులు, విద్యార్థులు శ్రీవాత్సవ్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. మనోహరాబాద్ రైల్వేస్టేషన్ మీదుగా వెళుతున్న శ్రీవాత్సవ్ స్టేషన్లో ఆగకుండా వెళుతుండడంతో స్థానికులు రైలును అడ్డుకున్నారు. అనంతరం ఆయన రైలు దిగి వారి నుంచి వినతి పత్రాలను సేకరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చి వచ్చిన రైలులో వెళ్లిపోయారు. అక్కన్న పేటలో ఏసీఎం రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ ఏసీఎం (అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్) భాను ప్రకాష్ శుక్రవారం అక్కన్నపేట రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఈ నెల 19న అక్కన్నపేట - మెదక్ రైల్వే లైన్ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లిఖార్జున్ ఖర్గే, దక్షిణ మధ్య రైల్వే జీఎంతో పాటు మెదక్ ఎంపీ విజయశాంతిలు అక్కన్నపేట రైల్వే స్టేషన్‌గా మీదుగా మెదక్ వెళుతుండడంతో ఆయన స్థానిక స్టేషన్‌ను సందర్శించారు. -
ఈ ఏడాది ఎంఎస్ఎంఈ కింద 9వేల కోట్ల రుణాలు
మిర్యాలగూడ టౌన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్‌లో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ ప్రెజైస్ (ఎంఎస్ఎంఈ) యూనిట్ల కింద ఉన్న లబ్ధిదారులకు ఈ ఏడాది 9వేల కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఆ బ్యాంక్ రాష్ట్ర నెట్వర్క్ జనరల్ మేనేజర్ కెఎస్ జావంద అన్నారు. శుక్రవారం స్థానిక విఘ్నేశ్వర ఎస్టేట్‌లో జరిగిన రైస్‌మిల్లర్స్, గ్రానైట్ పరిశ్రమల బ్యాంకు ఖాతాదారుల జిల్లాస్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ ఏడాదిలో బ్యాంకు అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఎంఎస్ఎంఈ యూనిట్ల వారికి రుణాలు ఇచ్చే విషయంలో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. గతంలో రెగ్యులర్ లిమిట్స్లను రెండేళ్లకు ఒకసారి రెన్యూవల్ చేశారని, ప్రస్తుతం ఒక సంవత్సరానికి రెన్యూవల్ చేస్తున్నారని పలువురు ఖాతాదారులు జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లారు. రెన్యూవల్ విషయంలో పాత పద్ధతినే కొనసాగించాలని, వడ్డీ విషయంలో కూడా చర్చించాలని సిబ్బందికి సూచించారు. సమావేశంలో హైదరాబాద్ జోనల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ టీటీ తారకం, నల్లగొండ, సూర్యాపేట రీజియన్ ఏజీఎంలు హరి కృష్ణనంద, ఎస్.వెంకటరమణ, బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ లీడర్ నర్సింహమూర్తి, మిర్యాలగూడ చీఫ్ మేనేజర్ కెవీఎస్ఆర్ మూర్తి, ఎస్బీఐ జనరల్ మేనేజర్ ఇన్సూరెన్స్ ప్రసాద్, సీఏ సత్యనారాయణ, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గార్లపాటి ధనమల్లయ్య, మిల్లర్లు పాల్గొన్నారు.