'నిధులు లేకుండా సమావేశాలు ఎందుకు' | andhra pradesh parliament members meeting with south central railway GM | Sakshi
Sakshi News home page

'నిధులు లేకుండా సమావేశాలు ఎందుకు'

Published Thu, Jan 7 2016 12:36 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM

andhra pradesh parliament members meeting with south central railway GM

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్ర గుప్తా గురువారం సమావేశమ్యారు. రానున్న రైల్వే బడ్జెట్కు ప్రతిపాదనలు పంపే విషయమై ఈ సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ సమావేశం మొక్కుబడిగా సాగుతోందని, ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలకు సైతం పరిష్కారం లభించడం లేదని ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిధులు లేకుండా సమావేశాలు నిర్వహించడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని ఎంపీలు అసహనం వ్యక్తం చేశారు. రైల్వే బడ్జెట్ సమావేశాల్లోపు రైల్వే మంత్రిని కలిసి తమ డిమాండ్లను వెల్లడిస్తామని సమావేశంలో పాల్గొన్న ఎంపీలు కొనకళ్ల నారాయణ, జేసీ దివాకర్ రెడ్డి, మాగంటి బాబు, కేశినేని నాని తదితరులు స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement