మిర్యాలగూడ టౌన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్‌లో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ ప్రెజైస్ (ఎంఎస్‌ఎంఈ) యూనిట్ల కింద ఉన్న లబ్ధిదారులకు ఈ ఏడాది 9వేల కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఆ బ్యాంక్ రాష్ట్ర నెట్‌వర్క్ జనరల్ మేనేజర్ కెఎస్ జావంద అన్నారు. శుక్రవారం స్థానిక విఘ్నేశ్వర ఎస్టేట్‌లో జరిగిన రైస్‌మిల్లర్స్, గ్రానైట్ పరిశ్రమల బ్యాంకు ఖాతాదారుల జిల్లాస్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ ఏడాదిలో బ్యాంకు అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.
ఎంఎస్‌ఎంఈ యూనిట్ల వారికి రుణాలు ఇచ్చే విషయంలో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. గతంలో రెగ్యులర్ లిమిట్స్‌లను రెండేళ్లకు ఒకసారి రెన్యూవల్ చేశారని, ప్రస్తుతం ఒక సంవత్సరానికి రెన్యూవల్ చేస్తున్నారని పలువురు ఖాతాదారులు జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లారు. రెన్యూవల్ విషయంలో పాత పద్ధతినే కొనసాగించాలని, వడ్డీ విషయంలో కూడా చర్చించాలని సిబ్బందికి సూచించారు. సమావేశంలో హైదరాబాద్ జోనల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ టీటీ తారకం, నల్లగొండ, సూర్యాపేట రీజియన్ ఏజీఎంలు హరి కృష్ణనంద, ఎస్.వెంకటరమణ, బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ లీడర్ నర్సింహమూర్తి, మిర్యాలగూడ చీఫ్ మేనేజర్ కెవీఎస్‌ఆర్ మూర్తి, ఎస్‌బీఐ జనరల్ మేనేజర్ ఇన్సూరెన్స్ ప్రసాద్, సీఏ సత్యనారాయణ, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గార్లపాటి ధనమల్లయ్య, మిల్లర్లు పాల్గొన్నారు.
ఈ ఏడాది ఎంఎస్‌ఎంఈ కింద 9వేల కోట్ల రుణాలు
Published Sat, Sep 28 2013 3:13 AM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM
Advertisement
Advertisement