ఎస్‌బీహెచ్‌లో రూ.కోట్ల మాయం?
Published Fri, Oct 14 2016 12:07 AM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
ప్రత్తిపాడు :
ప్రత్తిపాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖలో కోట్ల రూపాయల్లో వ్యత్యాసం జరిగినట్టు తెలుస్తోంది. బ్యాంకు వ్యవహారాలన్నీ చక్కబెట్టే ప్యూన్ చేతి వాటం ప్రదర్శించి, సొమ్ము కాజేసినట్టు సమాచారం. గత నెలలో జరిగిన బ్యాంక్ ఆడిట్ ద్వారా సుమారు రూ. 2 కోట్లు తేడా జరిగినట్టు గమనించిన బ్యాంకు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సమాయత్తమవుతున్నారు. స్థానిక ట్రెజరీ ద్వారా వివిధ శాఖలను చెందిన సొమ్మును వేర్వేరు ఖాతాలకు ఈ బ్యాంకు ద్వారానే జమ అవుతాయి. నిధులు కాజేసేందుకు లేని ఖాతాలను ఫ్యూన్ సృష్టించినట్టు సిబ్బంది భావిస్తున్నారు. బ్యాంక్ మేనేజర్ కొప్పిశెట్టి సత్యానందం గురువారం రాత్రి ప్రత్తిపాడు సీఐ జి.సత్యనారాయణను కలిసి పరిస్థితిని ప్రాథమికంగా వివరించారు. ఈ వ్యవహారంపై శాఖాపరమైన దర్యాప్తు జరుగుతోందని, విచారణ అనంతరం పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తామని బ్యాంక్ మేనేజర్ తెలిపినట్టు స్థానిక ఎస్సై ఎం.నాగదుర్గారావు ‘సాక్షి’కి తెలిపారు.
Advertisement