తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ 20 ఈ–శాఖలు ప్రారంభం | telangana rural 20 E-branches starts | Sakshi
Sakshi News home page

తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ 20 ఈ–శాఖలు ప్రారంభం

Published Sat, Mar 18 2017 2:07 AM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM

తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ 20 ఈ–శాఖలు ప్రారంభం

తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ 20 ఈ–శాఖలు ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ తాజాగా 20 ఈ–శాఖలను ప్రారంభించింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎస్‌బీహెచ్‌) ఎండీ మణి పాల్వేశన్‌ వీటిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా 4,885 స్వయం సహాయక బృందాలకు రూ. 160.34 కోట్ల రుణ వితరణకు సంబంధించిన చెక్కును గ్రూప్‌ల సమన్వయకర్తలకు అందజేశారు.

ప్రస్తుతం తెలంగాణలోని 18 జిల్లాల్లో 388 శాఖలు ఉన్నాయని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ చైర్మన్‌ బీఆర్‌జీ ఉపాధ్యాయ్‌ తెలిపారు. డిపాజిట్లు రూ. 6,818 కోట్లు కాగా అడ్వాన్స్‌లు రూ. 4,755 కోట్లు, మొత్తం వ్యాపార పరిమాణం రూ. 11,573 కోట్లుగా ఉన్నట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం మరో 12 శాఖలు ప్రారంభించనున్నామని, దీంతో మార్చి ఆఖరు నాటికి మొత్తం బ్రాంచీల సంఖ్య 400కి చేరుతుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement