ఆస్ట్రేలియాలో హైదరాబాదీ యువకుడి అదృశ్యం? ఆందోళనలో కుటుంబం
ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా వెళ్లిన ఓ యువకుడు అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. వారం రోజులుగా ఆ యువకుడి ఆచూకీ తెలియక పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
నగరంలోని మహ్మద్ మోసిన్ అలి మాజ్ (28) అనే యువకుడు మాస్టర్స్ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడ మెల్బోర్న్ దగ్గర ఉంటూ చదువుకుంటున్నాడు. అయితే 2021 డిసెంబరు 30 నుంచి కుటుంబంతో అతని సంబంధాలు తెగిపోయాయి. చివరి సారిగా క్లేటన్ సౌత్ దగ్గర ఉన్నట్టుగా తెలిసింది.
మహ్మద్ మోసిన్ అలిమాజ్ ఆచూకీ తెలియక పోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే బాధితుడి సోదరుడు సోషల్ మీడియా ద్వారా తన సోదరుడి అదృశ్యం గురించిన వివరాలు వెల్లడించాడు. ఆచూకీ తెలిస్తే చెప్పాల్సిందిగా కోరాడు. మరోవైపు హైదరాబాదీ యువడకుడి అదృశ్యంపై ఆస్ట్రేలియాలో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు విక్టోరియా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mohammed is missing.
The 28-year-old was last seen in Clayton South on Thursday, 30 December.
Anyone with information is urged to contact Broadmeadows Police Station on 9302 8222.
#220002920 pic.twitter.com/UjFc5vBaSl
— Victoria Police (@VictoriaPolice) January 4, 2022
చదవండి: ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువకుడి మృతి