డిపాజిట్ రేట్ల పెంపుబాటలో ఎస్‌బీహెచ్ | SBH to up MSME advances' share to 20% by FY15 | Sakshi
Sakshi News home page

డిపాజిట్ రేట్ల పెంపుబాటలో ఎస్‌బీహెచ్

Published Thu, Oct 31 2013 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM

డిపాజిట్ రేట్ల పెంపుబాటలో ఎస్‌బీహెచ్

డిపాజిట్ రేట్ల పెంపుబాటలో ఎస్‌బీహెచ్

డిపాజిట్‌దారులకు ద్రవ్యోల్బణాన్ని మించి వాస్తవానికి ప్రయోజనం(రియల్ ఇంట్రస్ట్ రేట్) కలిగించే వడ్డీ రేటు చెల్లించాలన్న రిజర్వు బ్యాంకు పిలుపునకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్‌బీహెచ్) స్పందించింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిపాజిట్‌దారులకు ద్రవ్యోల్బణాన్ని మించి వాస్తవానికి ప్రయోజనం(రియల్ ఇంట్రస్ట్ రేట్) కలిగించే వడ్డీ రేటు చెల్లించాలన్న రిజర్వు బ్యాంకు పిలుపునకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్‌బీహెచ్) స్పందించింది. వచ్చే రెండు వారాల్లో డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచనున్నట్లు ఎస్‌బీహెచ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎం.భగవంతరావు తెలిపారు. బుధవారమిక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఆర్‌బీఐ సూచన మేరకు సగటు ద్రవ్యోల్బణ రేటు కంటే వడ్డీరేట్లు ఎక్కువ ఉండే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
 
 వాస్తవానికి ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే బ్యాంకులో డబ్బు దాచుకున్న డిపాజిట్‌దారులకు ఎలాంటి అధిక ప్రయోజనం లభించకపోగా నష్టపోతున్నారని, దీంతో బంగారం, రియల్ ఎస్టేట్ వంటి ఇతర పెట్టుబడి సాధనాలకేసి చూస్తుండటంతో బ్యాంకులకు డిపాజిట్ల సేకరణ అన్నది చాలా కష్టంగా తయారయ్యింది. సగటు ద్రవ్యోల్బణ రేటు 9.5%గా ఉండగా, వడ్డీరేట్లు 9%గా ఉన్నాయన్నారు. ఇది డిపాజిట్ సేకరణకు ప్రధాన అడ్డంకిగా తయారైంది.  ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఎస్‌బీహెచ్ డిపాజిట్లలో 14% వృద్ధే నమోదయ్యింది. రుణాలపై వడ్డీరేట్లను పెంచే ఆలోచన లేదన్నారు.
 
 గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తం ఎంఎస్‌ఎంఈ రంగంపై రూ.2,000 కోట్ల విలువైన రుణాలను ఇస్తే ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే రూ.1,900 కోట్ల రుణాలను ఇచ్చినట్లు ఆయన తెలిపారు. సమైక్య ఉద్యమంతో గత 55 రోజులు సీమాంధ్ర ప్రాంతంలో బ్యాంకులు పనిచేయకపోవడంతో తమ కార్యకలాపాలపై ప్రభావం చూపిందని, ఎంఎస్‌ఎంఈ రంగంలో ఎన్‌పీఏలు పెరిగే అవకాశాలున్నాయన్నారు. ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement