ఎస్‌బీహెచ్ ఏటీఎం ధ్వంసం
Published Tue, Oct 25 2016 11:37 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
నాయుడుపేట టౌన్ : నెల్లూరు జిల్లా నాయుడుపేట టౌన్‌లోని ఎస్‌బీహెచ్ ఏటీఎంను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఏటీఎం గదిలోని సీసీ కెమెరా వైర్లను కూడా కత్తిరించిన దుండగులు ఏటీఎం ధ్వంసం చేసి క్యాష్ లాకర్‌ను తెరిచేందుకు శతవిధాలా ప్రయత్నించి విఫలమైనట్లుగా తెలుస్తోంది. స్థానికులు ఈ విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న స్థానిక సీఐ రత్తయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమాచారాన్ని బ్యాంకు అధికారులకు తెలియజేశారు.
Advertisement
Advertisement