హైదరాబాద్ : మియాపూర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్‌బీహెచ్) ఏటీఎంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి తీవ్ర ప్రయత్నం చేశారు. ఏటీఎం పగులకొట్టి డబ్బు తస్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటన శనివారం అర్ధరాత్రి జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు.
మియాపూర్ ఎస్‌బీహెచ్ ఏటీఎంలో చోరీకి యత్నం
Published Sun, Jul 5 2015 10:35 AM | Last Updated on Thu, Aug 30 2018 5:24 PM
Advertisement
Advertisement