కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ఏటీఎం చోరీకి దుండగులు విఫల యత్నం చేశారు. జిల్లాలోని గంగాధర క్రాస్ రోడ్డు లో ఉన్న ఎస్బీహెచ్ ఎటీఎంలో బుధవారం అర్ధరాత్రి దుండగులు చొరబడ్డారు. చోరీకి ప్రయత్రించగా సాధ్యం కాకపోవడంతో ఏటీఎం ను ధ్వంసం చేసి పారిపోయారు. గురువారం గుర్తించిన స్తానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఆచూకీ కోసం సమీపంలోని సీసీ పుటేజీని పరిశీలిస్తున్నారు.