
ఎస్‌బీహెచ్ జీఎంగా గున్విర్ సింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) జనరల్ మేనేజర్(కమర్షియల్ బ్యాంకింగ్)గా గున్విర్ సింగ్ సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. 1983లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలలో ఆఫీసర్‌గా వృత్తిని ప్రారంభించిన సింగ్‌కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికినీర్ అండ్ జైపూర్ బ్యాంకులల్లో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉంది.