
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేటు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే అనేక ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. తాజాగా ప్రైవేటు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ నగరంలో మరో ఘటన చోటుచేసుకుంది. మలక్‌పేట్ మెయిన్ రోడ్డుపై నిలిచి ఉన్న ఆర్టీసీ బస్సును మరో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. వెనుక నుంచి వేగంగా బస్సు రావడంతో డ్రైవర్ కంట్రోల్ చేయకపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎవరికి ఏ హాని జరగలేదు. అయితే తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. ఇక ఈ రోడ్డు ప్రమాదం కారణంగా మలక్‌పేటలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.