మలక్పేటలో కలకలం రేపిన టిఫిన్బాక్స్ బాంబు వదంతి | Tiffin box bomb rumor in Malakpet | Sakshi
Sakshi News home page

మలక్పేటలో కలకలం రేపిన టిఫిన్బాక్స్ బాంబు వదంతి

Published Mon, Oct 28 2013 4:37 PM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM

Tiffin box bomb rumor in Malakpet

హైదరాబాద్: మలక్పేటలో టిఫిన్ బాక్సులో బాంబు ఉందన్న వదంతులు కలకలం రేపింది.  బీహార్ రాజధాని పాట్నాలో వరుస బాంబు పేలుళ్లు సంభవించిన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. తనిఖీలు ముమ్మరం చేశారు. టిఫిన్ బాక్సులో బాంబు వదంతులతో మలక్ పేటవాసులు ఆందోళనకు గురయ్యారు.

ఇదిలా ఉండగా, సనత్‌నగర్‌లో  సైబరాబాద్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక రివాల్వర్, మూడు తపంచాలు స్వాధీనం చేసుకున్నారు.

 బహిరంగ ప్రాంతాలు, లాడ్జిలు, సినిమా ధియేటర్లు, షాపింగ్ మాల్స్ వద్ద పోలీసులు తనిఖీలు జరుపుతున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement