నగరంలోని మలక్‌పేట్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.
హైదరాబాద్ : నగరంలోని మలక్‌పేట్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉండే బాంటియా ఫర్నిచర్ దుకాణంలో ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయి. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.