పంట కొనుగోళ్లలో ఆన్‌లైన్ విధానాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ మలక్‌పేట్ మార్కెట్‌లో మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. గురువారం ఉదయం నుంచి ఆన్‌లైన్ అమలు నేపథ్యంలో సర్వర్ డౌన్ కావటంతో కొనుగోళ్లు మందగించాయి. దీంతో పాటు మిర్చి తక్కువ ధర పలుకుతోంది. రైతులు ఆగ్రహంతో మార్కెట్ అధికారుల చాంబర్ అద్దాలు పగులగొట్టారు. సత్వరం కొనుగోళ్లు జరిగేలా చూడాలని, గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం ఆందోళన కొనసాగుతోంది.