సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. మలక్‌పేట ఆసుపత్రిలో బాలింతల మృతి బాధాకరమని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే తనకు ప్రశ్నలు ఉన్నాయంటూ ట్విస్ట్ ఇచ్చారు.
కాగా, రాజ్‌భవన్‌లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. అనంతరం, గవర్నర్ మాట్లాడుతూ.. మలక్‌పేట ఆసుపత్రిలో బాలింతల మృతి బాధాకరమన్నారు. గైనకాలజిస్ట్‌గా నాకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. వైద్య రంగంలో వసతులు మరింత మెరుగుపరచాలి. బిల్లులు పెండింగ్ కాదు.. పరిశీలనలో ఉన్నాయి. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
గతంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలోనూ నలుగురు మరణించారు. తెలంగాణలో జనాభాకు అనుగుణంగా వైద్య రంగంలో వసతులు మరింతగా మెరుగుపరచాలి. వైద్యరంగం మెరుగవ్వడం లేదని చెప్పడం లేదు.. కానీ ఇంకా మెరుగు పరచాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. వివాదాలతో నియామకాలు ఆలస్యం కారాదన్నదే నా భావన. ఈ తరహా విధానాలను గతంలో న్యాయస్థానాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. యూజీసీ కొన్ని అంశాలను ప్రస్తావించింది, న్యాయ చిక్కులు లేకుండా చూసుకోవాలి అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment