
ఆస్తి కోసం సొంత తమ్ముడే అక్కను చంపి, శవాన్ని బాత్‌రూమ్‌లో పెట్టి ఆపై పోలీస్ స్టేషన్‌కి వెళ్లి..
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ మలక్‌పేటలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం సొంత తమ్ముడే అక్కను చంపాడు. అక్కను చంపి శవాన్ని బాత్‌రూమ్‌లో పెట్టి, మిస్సింగ్ కేసు కూడా పెట్టాడు. ఈస్ట్ ప్రశాంత్ నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగు చూసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.