మలక్‌పేటలోని రైలు వంతెన వద్ద మెట్రో రైల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
హైదరాబాద్ : మలక్‌పేటలోని రైలు వంతెన వద్ద మెట్రో రైల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు, ఇతర సమస్యలు తలెత్తకుండా, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఆ ప్రాంతంలో శాశ్వత బారికేడ్లు ఏర్పాటు చేయడంతోపాటు ట్రాఫిక్ మళ్లింపునకు నిర్ణయించారు.
శనివారం మూడు నెలలపాటు ఇవి అమలులో ఉంటాయని కొత్వాల్ ఎం.మహేందర్ రెడ్డి శుక్రవారం వెల్లడించారు. ఇతర జిల్లాల నుంచి ఎంజీబీఎస్‌కు రావాల్సిన ఆర్టీసీ బస్సుల్ని దిల్‌సుఖ్‌నగర్ బస్టాప్‌లో ఆపేస్తారు.