హైదరాబాద్: గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. మలక్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మూసారాంబాగ్ శ్యాం హోటల్ వద్ద గురువారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఎంఐఎం కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు ఒక యువకుడిని విచక్షణారహితంగా కొట్టారు. తీవ్ర గాయాలపాలైన అతడిని స్థానికులు ఉస్మానియాకు తరలించారు. ఘటన సమయంలో అక్కడే ఉన్న పోలీసులు చూస్తూ ఉండిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కక్షలే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు.