
సాక్షి, కాకినాడ: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో అనంతబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. అనంత బాబు అరెస్ట్ అనంతరం డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు వివరాలను కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు మీడియాకు వెల్లడించారు.
అనంతబాబుకు సుబ్రహ్మణ్యం రూ.25 వేలు ఇవాల్సి ఉందని.. ఇద్దరి మధ్య మాటమాట పెరిగి గొడవ జరిగిందన్నారు. కోపంతో అనంతబాబు.. సుబ్రహ్మణ్యాన్ని వెనక్కి నెట్టడంతో గ్రిల్ వల్ల అతని తలకు గాయం కావడంతో మృతి చెందినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment