anantha uday bhaskar
-
అనంతబాబుపై కేసుల వివరాలివ్వండి: హైకోర్టు
సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ అనంతబాబుపై ఉన్న కేసులు, కింది కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్, మృతుడు సుబ్రహ్మణ్యం పోస్టుమార్టం నివేదికను తమ ముందుంచాలని హైకోర్టు శుక్రవారం పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ఉత్తర్వులు జారీచేశారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ అనంతబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనితోపాటు 90 రోజుల్లో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయనందుకు తనకు డీఫాల్ట్ బెయిల్ ఇవ్వాలంటూ మరో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై శుక్రవారం జస్టిస్ రవి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కలిగినీడి చిదంబరం వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ స్వయంగా చెప్పిన వివరాలు తప్ప హత్య విషయంలో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్లో లోపాలున్నాయన్న కారణంతో కింది కోర్టు దానిని తిరస్కరించిందన్నారు. బెయిల్ మంజూరు చేస్తూ ఎలాంటి షరతులు విధించినా అభ్యంతరం లేదన్నారు. మరోవైపు.. ఈ వ్యాజ్యాల్లో మృతుడు తల్లి నూకరత్నం ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ, అనంతబాబుకు నేరచరిత్ర ఉందని.. ఆయనపై పోలీసులు రౌడీషీట్ కూడా తెరిచారని తెలిపారు. దీంతో న్యాయమూర్తి, పిటిషనర్‌పై ఉన్న కేసులు, అతనిపై దాఖలు చేసిన చార్జిషీట్ వివరాలతో పాటు మృతుడు సుబ్రహ్మణ్యం పోస్టుమార్టం నివేదికను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించారు. లొంగిపోయిన అనంతబాబు కంబాలచెరువు(రాజమహేంద్రవరం): తాత్కాలిక బెయిల్ గడువు ముగియడంతో ఎమ్మెల్సీ అనంతబాబు శుక్రవారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో లొంగిపోయారు. గత నెలలో అనంతబాబు తల్లి చనిపోవడంతో కోర్టు ఆయనకు ఈ నెల 9 వరకు బెయిల్ ఇచ్చింది. గడువు ముగియడంతో ఆయన జైలు అధికారుల ముందు హాజరయ్యారు. ఇదీ చదవండి: ఐవోబీ మాజీ ఉద్యోగులకు ఐదేళ్ల జైలు -
ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్
సాక్షి, తూర్పుగోదావరి: ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ మంజూరైంది. మూడు రోజుల పాటు రాజమండ్రి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిన్న(ఆదివారం)అనంతబాబు తల్లి మంగారత్నం మృతిచెందిన సంగతి తెలిసిందే. తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు అనంతబాబుకు ఈ నెల 25 సాయంత్రం వరకూ న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. చదవండి: పదో తరగతి పరీక్షలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం -
ఎమ్మెల్సీ మాజీ కారు డ్రైవర్ భార్యకు ప్రభుత్వోద్యోగం
కాకినాడ సిటీ: ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగమిచ్చారు. ఇటీవల సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ (పీవోఏ) చట్టం కింద ఈమెకు ఉద్యోగమిస్తూ కలెక్టర్ కృతికా శుక్లా సోమవారం స్పందన కార్యక్రమంలో ఉత్తర్వులను అందజేశారు. అపర్ణ అర్హత ధ్రువపత్రాలను పరిశీలించి, కాంపేషనేట్ నియామక ఉత్తర్వులు జారీ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ఎ.హనుమంతరావును కలెక్టర్ ఆదేశించారు. -
ఖైదీలపై అనంతబాబు దాడి పూర్తి అవాస్తవం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు ప్రయత్నించాలని, అవాస్తవాలతో కట్టుకథలు అల్లి, లేనిని ఉన్నట్టు చెప్పడం సరికాదని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజారావు అన్నారు. జైల్లోని ఖైదీలను ఎమ్మెల్సీ అనంతబాబు కొట్టారని, జైల్లో రాచమర్యాదలు.. అని కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు పూర్తి అవాస్తవమని పేర్కొంటూ జైళ్ల శాఖ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. హత్య కేసులో ముద్దాయిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును కేంద్ర కారాగారంలోని ఓ బ్లాకులో సింగిల్ సెల్లో ఉంచినట్టు రాజారావు తెలిపారు. సెక్యూరిటీ రీత్యా సెల్లో 24 గంటలూ సిబ్బంది పహారా, నిత్య పర్యవేక్షణ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అందువలన తోటి ఖైదీలతో ఎలాంటి వివాదాలు, ఘర్షణలు పడే అవకాశమే లేదన్నారు. ఇతర ఖైదీలకు కల్పించే సదుపాయాలనే ఆయనకూ కల్పించామని.. పడుకునేందుకు పరుపు ఏర్పాటు చేశామన్నది పూర్తి అబద్ధమన్నారు. నిబంధనల ప్రకారం అందరు ఖైదీల మాదిరే దిండు, డర్రీ, వులెన్ బ్లాంకెట్, దుప్పటి ఇచ్చామని, మెనూ ప్రకారమే ఆహారం అందిస్తున్నామని తెలిపారు. అనంతబాబును కలిసేందుకు వస్తున్న వారికి నిబంధనల ప్రకారమే ములాఖత్, ఇంటర్వ్యూ అవకాశాలిస్తున్నట్టు చెప్పారు. అలా వచ్చిన వారి పూర్తి వివరాలు, ఆధార్ కార్డు పరిశీలించాకనే అనుమతిస్తున్నట్టు వెల్లడించారు. ములాఖత్‌కు వస్తున్న వారి ఫోన్‌తో అనంతబాబు మాట్లాడారనేది కూడా పూర్తి అవాస్తవమని రాజారావు స్పష్టం చేశారు. -
ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబుపై సస్పెన్షన్ వేటు పడింది. అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ‘పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలమేరకు... తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మరణానికి తానే బాధ్యుడిని అని ఎమ్మెల్సీ అనంతబాబు తమకు వాంగ్మూలం ఇచ్చినట్టు పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమైనది’ అని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా డ్రైవర్ హత్య కేసులో అనంతబాబును ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కోర్టు అతనికి రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు. -
MLC Ananta Babu Case: చట్టం ముందు ఎవరైనా ఒక్కటే: సజ్జల
సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ అనంతబాబు(అనంత్ ఉదయ్ భాస్కర్) కేసు విషయంలో ఆధారాలు ఉంటే మన పార్టీ వారినైనా ఉపేక్షించొద్దని సీఎం జగన్ చెప్పినట్లు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ అనంత్‌బాబు కేసు విషయంలో మేం నిష్పక్షపాతంగా వ్యవహరించాం. సీఎం జగన్ ఎప్పుడూ న్యాయం వైపే నిలిచారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటేనని అన్నారు. 'ఆధారాలు ఉంటే మా పార్టీ వారినైనా ఉపేక్షించొద్దని సీఎం చెప్పారు. ఈ కేసులో పోలీసులు చట్టం ప్రకారం వ్యవహరించారు. ఎమ్మెల్సీ కేసు విషయంలో ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. చంద్రబాబు ఏరోజైనా చట్టం తన పని తాను చేసుకోనిచ్చారా?. ఎమ్మార్వో వనజాక్షి ఘటనను ఎవరూ మరచిపోలేదు. ఆరోజు ఎమ్మార్వోపై దాడి జరిగితే చంద్రబాబు ఏం చేశారో అందరికీ తెలుసు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలపై వార్తలు కూడా వచ్చేవి కావు. ఇప్పుడు ఏ ఘటన జరిగినా ఎల్లోమీడియా విష ప్రచారం చేస్తోందని' సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చదవండి: (ఉద్యోగ సంఘాలతో చర్చలు.. సజ్జల కీలక వ్యాఖ్యలు) -
‘చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలని సీఎం చెప్పారు’
-
‘చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలని సీఎం చెప్పారు’
పల్నాడు జిల్లా: హత్య కేసులో ఇరుక్కున్న ఎమ్మెల్సీ అనంతబాబు(అనంత్ ఉదయ్ భాస్కర్) చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలని సీఎం జగన్ చెప్పారని జలవనరుల శాఖామంత్రి అంబటి రాంబాబు తెలిపారు. మంగళవారం ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టుపై అంబటి మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్సీ అనంతబాబు హత్యకేసులో ఇరుక్కున్నారు. చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలని సీఎం చెప్పారు. ధర్మం వైపే ఉంటామని ప్రభుత్వం చెప్పింది’ అని తెలిపారు. కాగా, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును సోమవారం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతబాబుకు సుబ్రహ్మణ్యం రూ.25 వేలు ఇవాల్సి ఉందని.. ఇద్దరి మధ్య మాటమాట పెరిగి గొడవ జరిగిందని అరెస్ట్ తర్వాత కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు మీడియాకు తెలిపారు. కోపంతో అనంతబాబు.. సుబ్రహ్మణ్యాన్ని వెనక్కి నెట్టడంతో గ్రిల్ వల్ల అతని తలకు గాయం కావడంతో మృతి చెందినట్లు ఎస్పీ పేర్కొన్నారు. -
ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్
సాక్షి, కాకినాడ: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో అనంతబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. అనంత బాబు అరెస్ట్ అనంతరం డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు వివరాలను కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు మీడియాకు వెల్లడించారు. అనంతబాబుకు సుబ్రహ్మణ్యం రూ.25 వేలు ఇవాల్సి ఉందని.. ఇద్దరి మధ్య మాటమాట పెరిగి గొడవ జరిగిందన్నారు. కోపంతో అనంతబాబు.. సుబ్రహ్మణ్యాన్ని వెనక్కి నెట్టడంతో గ్రిల్ వల్ల అతని తలకు గాయం కావడంతో మృతి చెందినట్లు ఎస్పీ పేర్కొన్నారు. -
చట్టం తనపని తాను చేసుకుపోతుంది: మంత్రి బొత్స
సాక్షి, విజయనగరం: ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని.. 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అనంతబాబు వ్యవహారంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. అందులో ప్రభుత్వం జోక్యం చేసుకోదన్నారు. కాగా, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును పోలీసులు విచారిస్తున్నారు. విచారణ పూర్తికాగానే అనంతబాబును రిమాండ్‌కు తరలిస్తామని ఏఎస్పీ పేర్కొన్నారు. 19వ తేదీ రాత్రి సుబ్రహ్మణ్యం వెంట ఉన్న స్నేహితులను పోలీసులు విచారిస్తున్నారు. చదవండి: కొండెక్కిన కోడి.. కిలో చికెన్ అంత ధరా? -
ఎమ్మెల్సీ అనంతబాబును అదుపులోకి తీసుకున్నాం: ఏఎస్పీ
సాక్షి, కాకినాడ: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ హత్య కేసు విచారణ జరుగుతోందని ఏఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. అనంతబాబు పోలీస్ కస్టడీలో ఉన్నారని తెలిపారు. ఈ రోజు అనంతబాబును అరెస్ట్ చేస్తామని ఏఎస్పీ వెల్లడించారు. ఘటన జరిగిన రోజు ఎక్కడున్నారనే దానిపై గన్మెన్లకు సంజాయిషీ నోటీసులను పోలీసులు జారీ చేశారు. చదవండి: నూరేళ్ల ఆశలు సమాధి...భర్త, పిల్లలు కళ్లెదుటే.. -
అనంతబాబుకు బెయిల్ మంజూరు
17న నియోజకవర్గానికి రాక రంపచోడవరం(గంగవరం) : వైఎస్సార్ పార్టీ యువజన విభాగ అధ్యక్షుడు, రంపచోడవరం నియోజకవర్గ కన్వీనర్ అనంత ఉదయభాస్కర్ (బాబు)పై అరకు ఎంపీ కొత్తపల్లి గీత పెట్టిన అక్రమ కేసులో నిజనిజాలు లేవని విశాఖ జిల్లా సెషన్స కోర్టు నమ్మి, ఆయనకు బెయిల్ మంజూరు చేసిందని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొమ్మిశెట్టి బాలకృష్ణ అన్నారు. శుక్రవారం రాత్రి ఆయన మాట్లాడుతూ పార్టీని దెబ్బతీసేందుకు కుట్రలు పన్నినా న్యాయమే గెలుస్తుందన్నారు. అక్రమ కేసులతో అణగదొక్కలేరన్నారు. అనంతబాబు ఈ నెల 17న నియోజకవర్గానికి రానున్నారని, ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఏజెన్సీ ముఖద్వారం అడ్డతీగల మండలం గొంటవానిపాలెం నుంచి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.