ఎల్లో మీడియా స్క్రిప్ట్‌ ప్రకారమే సీబీఐ నడుస్తోంది: సజ్జల | Sajjala Ramakrishna Reddy Comments On Cbi | Sakshi
Sakshi News home page

ఎల్లో మీడియా స్క్రిప్ట్‌ ప్రకారమే సీబీఐ నడుస్తోంది: సజ్జల

Published Fri, May 26 2023 9:41 PM | Last Updated on Fri, May 26 2023 9:58 PM

Sajjala Ramakrishna Reddy Comments On Cbi - Sakshi

సాక్షి, విజయవాడ: ముందే అనుకున్న ప్రణాళిక ప్రకారం సీబీఐ వ్యవహరిస్తున్నట్లు ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐ కౌంటర్‌పై స్పందించారు.

సీబీఐ సెన్సేషన్‌ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఉందని, ఆధారాలు లేకుండా ఏ విధంగా ఆరోపణలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సీబీఐ ఏం చేయాలనుకుంటుందో ఎల్లో మీడియాకు ముందే తెలుస్తుందని.. సీబీఐ విచారణ ఏ విధంగా చేస్తోందో అర్థం కావట్లేదన్నారు. సీబీఐ వెనుక ఎవరున్నారన్నదానిపై విచారణ జరగాలని ఆయన డిమాండ్‌ చేశారు.

‘‘ప్రజల్లో అయోమయం సృష్టించేలా సీబీఐ తీరు ఉంది. ఎల్లో మీడియా స్క్రిప్ట్‌ ప్రకారం సీబీఐ నడుస్తోంది. ఆ స్క్రిప్ట్‌కే విచారణ అని తగిలిస్తున్నారు. కాకమ్మ కథలన్నీ ఎల్లో మీడియాలోనే తయారవుతున్నాయి. దీని వెనుక రాజకీయ కుట్ర కోణం ఉంది. సరైన దిశలో సీబీఐ విచారణ జరగడం లేదు’’ అని సజ్జల అన్నారు.
చదవండి: అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై TS హైకోర్టులో విచారణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement