సాక్షి, హైదరాబాద్: వివేకా హత్య కేసులో అరెస్టయిన భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సీబీఐ విచారణ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కస్టడీలో సీబీఐ సుప్రీం గైడ్‌లైన్స్ పాటించకపోవడంపై అభ్యంతరం తెలిపారు.
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తప్పకుండా పాటించాలని పేర్కొంది. విచారణ సమయంలో న్యాయవాది ఉండాలన్న హైకోర్టు.. వీడియో, ఆడియో రికార్డ్ చేయాలని ఆదేశించింది. భాస్కర్‌రెడ్డి అనారోగ్యం దృష్ట్యా వైద్య పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు పేర్కొంది.
ఇదిలా ఉంచితే, దస్తగిరిని అప్రూవర్‌గా పరిగణించడాన్ని భాస్కర్‌రెడ్డి సవాల్ చేయగా, దాని సంబంధించిన తదుపరి విచారణ జూన్ మూడో వారానికి వాయిదా పడింది.
చదవండి: టీడీపీ నేత బండారం బట్టబయలు.. సింగర్‌తో సహజీవనం చేసి..
Comments
Please login to add a commentAdd a comment