
ఇటీవల చిన్నచిన్న కారణాలకే హత్యలు చేస్తున్నారు. కారణాలు కూడా వినేందుకు హస్యస్పదంగా ఉంటాయే తప్ప సీరియస్ విషయమంటూ ఏం ఉండదు. ప్రస్తుతం అరచేతిలో ప్రపంచ ఇమిడిపోయేలా స్మార్ట్ ఫోన్‌లు వచ్చాక ప్రతీది సులభంగా తెలిసిపోడంతో మనుషుల్లో సహనం అనేదే లేకుండాపోయింది. ప్రతీది క్షణాల్లో అనుకున్న వెంటనే అయిపోవాలనే వికృత మనస్తత్వం జనాల్లో రావడం వల్లనో ఏమో గానీ పిచిపిచ్చి కారణాలకే ప్రాణాలు తీసేంతవరకు వెళ్లిపోతున్నారు. అచ్చం అలానే ఇక్కడో వ్యక్తి చిన్న కారణానికి భార్యని కడతేర్చాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఢిల్లీలోని సుల్తాన్‌పూర్‌లో నివశిస్తున్న భార్యభర్తలిద్దరూ కలిసి ఫుల్‌గా మద్యం తాగారు. ఆ తర్వాత భర్త భోజనం చేద్దాం రా.. అంటే ఆమె తినేందుకు ఆసక్తి చూపలేదు. పైగా తనకు భోజంనం పెట్టమని భర్త కోరిన ఆమె వడ్డించకపోవడంతో ఆగ్రహంతో సదరు వ్యక్తి ఆమెను కొట్టి, హత్య చేశాడు.
ఆ తర్వాత అతను మద్యం మత్తులో ఆమె చనిపోయిందన్న విషయం మరిచిపోయి ఆ శవం పక్కనే పడుకున్నాడు. కాసేపటి తర్వాత మేలుకున్నాక తన భార్య చనిపోయిందని గ్రహించాడు. అంతే ఆ వ్యక్తి రూ.40 వేలు నగదు తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఐతే పోలీసులు నిందుతుడు వినోద్ కుమార్ దూబేగా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment