
హైదరాబాద్: వివేకా హత్య కేసుకు సంబంధించి ఈరోజు(సోమవారం) తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వైఎస్ భాస్కర్‌రెడ్డి, వివేకా పీఏ కృష్ణార్డెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టింది హైకోర్టు. దీనిలో భాగంగా వివేకా హత్య కేసులో బెయిల్‌పై బయట ఉన్న దస్తగిర పాత్ర కీలకమని, అతని బెయిల్ రద్దు చేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి.. హైకోర్టును కోరారు.
అప్రూవర్ దస్తగిరి స్టేట్‌మెంట్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకుని సీబీఐ దర్యాప్తు చేపట్టిందని, ప్రత్యక్ష సాక్షి రంగన్న స్టేట్‌మెంట్‌ను మాత్రం పరిగణలోకి తీసుకోలేదని న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి కోర్టుకు తెలియజేశారు. కనీసం సీసీ ఫుటేజ్‌ను కూడా సీబీఐ పరిశీలించలేదని హైకోర్టుకు తెలిపారు. దీనిపై రేపు(మంగళవారం) హైకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment