జన్మభూమిలో ఫోజులు...కోటాలో కోతలు | janmabhoomi ration cut | Sakshi
Sakshi News home page

జన్మభూమిలో ఫోజులు...కోటాలో కోతలు

Published Fri, Feb 3 2017 11:23 PM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM

janmabhoomi ration cut

  • ఇలా ఇచ్చారు.. అలా లాగేస్తారా..!
  • బ్లాక్‌లో వేలాదిగాSరేషన్‌ కార్డులు
  • కార్డుదారుల ఆశలు గల్లంతు
  • ఎక్కడెక్కడ ఎన్నెన్ని...
    ∙కాకినాడలో 11 వేల రేష¯ŒSకార్డులు పంపిణీ చేశారు. సుమారు 2 వేలు బ్లాక్‌లో పెట్టారు. 
    ∙కాకినాడ రూరల్‌ మండలంలో జన్మభూమిలో 2,562 రేష¯ŒS కార్డులు పంపిణీ చేయగా ఇందులో 500 బ్లాక్‌ చేశారు 
    ∙రాజమహేంద్రవరం నగరంలో 6,396 రేష¯ŒS కార్డులు పంపిణీ చేస్తే 1400 కార్డులు.. రాజమహేంద్రవరం రూరల్‌లో 3960 కార్డులు పంపిణీ చేయగా, సుమారు 500 కార్డులు బ్లాక్‌లో పెట్టారు.
    ∙అమలాపురంలో 2,071 కార్డులు పంపిణీ చేస్తే సుమారు 300 కార్డులను బ్లాక్‌ చేశారు.
     
    సాక్షిప్రతినిధి, కాకినాడ :
    ‘ఏరు దాటే వరకూ ఓడ మల్లన్న. ఏరు దాటాక బోడి మల్లన్న’ చందంగా ఉంది సర్కారు తీరు. జన్మభూమి సభలు జరిగినప్పుడు వాటి విజయవంతం కోసం జనం కావాల్సి వచ్చింది. అందుకోసం సర్కార్‌ పలు తాయిలాలు ప్రకటించింది. అందులో రేష¯ŒSకార్డులు కూడా ఉన్నాయి. 91 వేల పైచిలుకు రేష¯ŒSకార్డులు మంజూరు చేసిన జిల్లా యంత్రాంగం పది రోజుల వ్యవధిలోనే వీటిని జన్మభూమి గ్రామసభల్లో పంపిణీ చేసింది. ఎమ్మెల్యేలు, మంత్రులు ఫొటోలకు ఫోజులిచ్చి జన్మభూమి సభల్లో ఈ రేష¯ŒS కార్డులను పంపిణీ చేశారు. రేపోమాపో రేష¯ŒS సహా ఇతర నిత్యావసరాలు చౌకధరల దుకాణాల నుంచి తెచ్చుకోవాలని జనం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం కొత్త కార్డులకు కోటా కేటాయింపులు కూడా పూర్తి చేసింది. ఫిబ్రవరి కోటా వస్తుందని ఎదురుచూస్తున్న కార్డుదారులకు పంపిణీ చేసిన కార్డులన్నింటినీ పిడుగులాంటి వార్త చేరింది. అదేమంటే
    ‘బ్లాక్‌’లో పెట్టారని. దీంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. రేష¯ŒSకార్డులు చేతిలో పెట్టి నెల కూడా కాలేదు, కనీసం ఒక కోటా కూడా ఇంకా తీసుకోలేదు. అప్పుడే బ్లాక్‌లో పెట్టడమేమిటని మండిపడుతున్నారు. జన్మ భూమి సభలు, సమావేశాలు విజయవంతమయ్యే వరకు జనం కావాల్సి వచ్చింది, ఇప్పుడేమో ఇచ్చిన కార్డులు బ్లాక్‌లో పెడతారా అని జనం ప్రశ్నిస్తున్నారు. 
    జిల్లాలో పరిస్థితిదీ...
    జిల్లాలో 15 లక్షల 28 వేల 384 రేష¯ŒSకార్డులున్నాయి. జన్మభూమి కోసమని 91 వేల 806 రేష¯ŒSకార్డులు కేటాయించారు. మంజూరు చేసిన మేరకు అందరికీ రేష¯ŒSకార్డులు పంపిణీని పూర్తి చేశారు. తీరా ఫిబ్రవరి నెల కోటా కోసం కార్డులు తీసుకుని తహసీల్థార్‌ కార్యాలయాల వద్దకు వెళుతుంటే ‘మీకు రేష¯ŒS లేదు ... మీ కార్డు హోల్డ్‌లో ఉందని’ చెబుతున్నారని కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
    l ఉదాహరణకు కాకినాడ నగరాన్నే తీసుకుందాం. ఇక్కడ జన్మభూమి సందర్భంగా 11 వేల రేష¯ŒSకార్డులు పంపిణీ చేశారు. అందులో సుమారు రెండువేల కార్డులు బ్లాక్‌లో పెట్టారు. సిటీని ఆనుకుని ఉన్న కాకినాడ రూరల్‌ మండలంలో జన్మభూమిలో 2,562 రేష¯ŒSకార్డులు పంపిణీ చేశారు. తీరా ఫిబ్రవరి కోటా కేటాయింపులు వచ్చే సరికి సుమారు 500 రేష¯ŒSకార్డులను బ్లాక్‌ చేశారని సమాచారం. 
    l అమలాపురంలో 2071 కార్డులు పంపిణీ చేస్తే సుమారు 300 కార్డులు,  రాజమహేంద్రవరం నగరంలో 6,396 రేష¯ŒSకార్డులు పంపిణీ చేస్తే 1400 కార్డులు, రాజమహేంద్రవరం రూరల్‌లో 3960 కార్డులు పంపిణీచేయగా, సుమారు 500 కార్డులు బ్లాక్‌లో పెట్టారు. ఈ రకంగా బ్లాక్‌లో పెట్టిన రేష¯ŒSకార్డులు అధికారికంగా ప్రాథమిక సమచారాన్ని బట్టి పరిశీలిస్తే  12 వేల వరకూ ఉన్నాయి. అనధికారిక సమాచారం ప్రకారం ఈ సంఖ్య 15 వేల వరకూ ఉంటుందని లెక్కలేస్తున్నారు. కాకినాడ పెరేడ్‌గ్రౌండ్స్‌లో గణతంత్ర వేడుకల సాక్షిగా 91,806 రేష¯ŒS కార్డులు మంజూరు చేసినట్టు జిల్లా కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ ప్రకటించారు. జిల్లా విజిలె¯Œ్స అండ్‌ మోనిటరింగ్‌ కమిటీ సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులకు సైతం అధికారులు ఇవే లెక్కలను చూపించారు. కానీ ఫిబ్రవరి కోటాకు ఈ లెక్కలన్నీ తారుమారైపోయేలా కన్పిస్తున్నాయి.
    ఈ కార్డులను ఎందుకు బ్లాక్‌లో పెట్టారంటే పల్స్‌ సర్వే మేరకు నిర్ణయం తీసుకున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నారని మం డ ల స్థాయిలో సమాధానం వస్తోంది. సొంత ఇళ్లు, ఇంటి స్థలం ఉందని, నాలుగు చక్రాల వాహనం ఉందని..ఇలా పలు కారణాలు చెబుతున్నారని కార్డుదారులు ఆవేదన చెందుతున్నారు.రేష¯ŒSకార్డుకు దరఖాస్తు చేశాక  అర్హత ఉందా లేదా అనేది పరిశీలించాకనే వాటిని మంజూరు చేశా రు. ఇప్పుడేమో అర్హత లేదని, పల్స్‌ సర్వే అంటూ కుంటిసాకులతో సర్కార్‌ నోటి దగ్గర కూడు తిరిగి లాగేసుకుంటోందని కార్డుదారులు లబోదిబోమంటున్నారు.
     
     
    ఆస్తులు లేకపోయినా ఉన్నట్టుగా...
    జన్మభూమిలో కొత్త రేష¯ŒS కార్డు ఇచ్చారు. కానీ సంక్రాంతి సరుకుల కోసం డీలర్‌ వద్దకు వెళితే మీ కార్డు డేటా రావడం లేదు సరుకులు ఇవ్వడం కుదరదన్నారు. తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చి అడగ్గా కంప్యూటర్‌లో పరిశీలించి సొంత ఇల్లు ఉన్నట్టు చూపిస్తోంది. అందుకే కార్డు ఇ¯ŒSయాక్టివ్‌లో ఉంది అని చెబుతున్నారు. మా తాతయ్య ట్రాక్టర్‌ మెకానిక్‌ గా పని చేస్తుంటాడు వారికి ఎటువంటి ఆస్తులు లేవు. రాజీవ్‌ గృహకల్పలో ప్లాట్‌ ఉంది. 
    – కె.ఉదయకుమార్, కాకినాడ
    పరిశీలించి అర్హుల కార్డులు పునరుద్ధరిస్తాం
    ప్రజలందరి ఆధార్‌ అన్నింటికీ అనుసంధానమైన నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్దేశించిన ఆరు అంశాలలో ఏ ఒక్కటి ఉన్నా కొత్తగా మంజూరు చేసిన లబ్థిదారుల రేష¯ŒS కార్డులు ఇ¯ŒSయాక్టివ్‌లోకి వెళ్ళాయి. వాటన్నింటినీ పరిశీలిస్తున్నాం. అర్హులుంటే ఆ లబ్ధిదారుల కార్డులన్నీ పునరుద్ధరిస్తాం.
    – వి.రవికిరణ్, జిల్లా పౌరసరఫరాలశాఖాధికారి
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement