ration cut
-
అలాచేసినందుకు రేషన్ కట్..
బరంపూర్: బహిరంగ మల విసర్జన చేస్తున్న కుటుంబాలకు రేషన్ సరుకులను నిలిపివేస్తూ ఒరిస్సాలోని గంజాం జిల్లా శనఖే ముండి బ్లాక్‌లోని గౌతమీ పంచాయతీ నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేసే వారికి రేషన్ ఇవ్వరాదని నిర్ణయించామని, ఆ మేరకు 20 కుటుంబాల వారికి రేషన్ ఇవ్వడం లేదని సర్పంచ్ సుశాంత్ స్వైన్ తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన 300 మంది మహిళలు ఉదయం 3 గంటల నుంచి 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు పంచాయతీలోని బహిరంగ ప్రదేశాలను పర్యవేక్షిస్తున్నారు. దీంతో బహిరంగ మలవిసర్జన అలవాటు తగ్గుముఖం పట్టిందన్నారు. కాగా, ఆహార భద్రత పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు అనీ ఆయా కుటుంబాలకు రేషన్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు గంజాం కలెక్టర్ తెలిపారు. -
మరుగుదొడ్డి లేదని ‘రేషన్’ కట్
తాండూరు రూరల్ : స్వచ్ఛభారత్ కింద మంజూరైన వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోలేదని అధికారులు రేషన్ సరుకులు నిలిపివేశారు. కనీసం తాత్కలికంగా రేషన్ సరుకులు నిలిపివేస్తే కొందరైన వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుంటారని అధికారులు ఈ విధంగా చేసినట్లు సమాచారం. మండలంలోని మిట్టబాసుపల్లి గ్రామంలో రెండు రోజుల నుంచి గ్రామంలోని లబ్ధిదారులకు రేషన్ సరుకులు ఇవ్వడం లేదని గ్రామానికి చెందిన మాల శ్రీను, బంటు మొగులప్ప డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ రాములును కలిసేందుకు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని రేషన్ డీలర్ లబ్ధిదారులకు రేషన్ సరుకులు ఇవ్వడం లేదన్నారు. డీలర్ అశప్పను అడగ్గా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సరుకులు ఇవ్వడం లేదని చెబుతున్నారని చెప్పారు. గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించుకుంటేనే రేషన్ ఇస్తామని అధికారులు చెబుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. బియ్యం లేకపోతే ఎలా బతకాలి అని గ్రామస్తులు వాపోతున్నారు. దీంతో గ్రామంలో ఇదే విషయమై జోరుగా చర్చ సాగుతోంది. ఈ విషయమై తహసీల్దార్ రాములును ఫోన్లో సంప్రదిస్తే వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోకపోవడం వల్ల ఎంపీడీఓ డీలర్‌కు చెప్పి రేషన్ సరుకులు ఇవ్వొదని చెప్పారని తహసీల్దార్ బదులిచ్చారు. ఎంపీడీఓ జగన్మోహన్రావుకు ఫోన్ చేస్తే స్పందించలేదు. పంపిణీ చేస్తాం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో రేషన్ సరుకులు నిలిపివేశాం. అంతేకాకుండా డీలర్ ఆశప్ప అనార్యోగం కారణంగా కూడా సరుకులు ఆలస్యమయ్యాయి . మంగళవారం నుంచి ప్రతి ఒక్కరికీ రేషన్ సరుకులు అందజేస్తాం. – ఇస్మాయిల్, సర్పంచ్ -
జన్మభూమిలో ఫోజులు...కోటాలో కోతలు
ఇలా ఇచ్చారు.. అలా లాగేస్తారా..! బ్లాక్‌లో వేలాదిగాSరేషన్ కార్డులు కార్డుదారుల ఆశలు గల్లంతు ఎక్కడెక్కడ ఎన్నెన్ని... ∙కాకినాడలో 11 వేల రేష¯ŒSకార్డులు పంపిణీ చేశారు. సుమారు 2 వేలు బ్లాక్‌లో పెట్టారు. ∙కాకినాడ రూరల్ మండలంలో జన్మభూమిలో 2,562 రేష¯ŒS కార్డులు పంపిణీ చేయగా ఇందులో 500 బ్లాక్ చేశారు ∙రాజమహేంద్రవరం నగరంలో 6,396 రేష¯ŒS కార్డులు పంపిణీ చేస్తే 1400 కార్డులు.. రాజమహేంద్రవరం రూరల్‌లో 3960 కార్డులు పంపిణీ చేయగా, సుమారు 500 కార్డులు బ్లాక్‌లో పెట్టారు. ∙అమలాపురంలో 2,071 కార్డులు పంపిణీ చేస్తే సుమారు 300 కార్డులను బ్లాక్ చేశారు. సాక్షిప్రతినిధి, కాకినాడ : ‘ఏరు దాటే వరకూ ఓడ మల్లన్న. ఏరు దాటాక బోడి మల్లన్న’ చందంగా ఉంది సర్కారు తీరు. జన్మభూమి సభలు జరిగినప్పుడు వాటి విజయవంతం కోసం జనం కావాల్సి వచ్చింది. అందుకోసం సర్కార్ పలు తాయిలాలు ప్రకటించింది. అందులో రేష¯ŒSకార్డులు కూడా ఉన్నాయి. 91 వేల పైచిలుకు రేష¯ŒSకార్డులు మంజూరు చేసిన జిల్లా యంత్రాంగం పది రోజుల వ్యవధిలోనే వీటిని జన్మభూమి గ్రామసభల్లో పంపిణీ చేసింది. ఎమ్మెల్యేలు, మంత్రులు ఫొటోలకు ఫోజులిచ్చి జన్మభూమి సభల్లో ఈ రేష¯ŒS కార్డులను పంపిణీ చేశారు. రేపోమాపో రేష¯ŒS సహా ఇతర నిత్యావసరాలు చౌకధరల దుకాణాల నుంచి తెచ్చుకోవాలని జనం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం కొత్త కార్డులకు కోటా కేటాయింపులు కూడా పూర్తి చేసింది. ఫిబ్రవరి కోటా వస్తుందని ఎదురుచూస్తున్న కార్డుదారులకు పంపిణీ చేసిన కార్డులన్నింటినీ పిడుగులాంటి వార్త చేరింది. అదేమంటే ‘బ్లాక్’లో పెట్టారని. దీంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. రేష¯ŒSకార్డులు చేతిలో పెట్టి నెల కూడా కాలేదు, కనీసం ఒక కోటా కూడా ఇంకా తీసుకోలేదు. అప్పుడే బ్లాక్‌లో పెట్టడమేమిటని మండిపడుతున్నారు. జన్మ భూమి సభలు, సమావేశాలు విజయవంతమయ్యే వరకు జనం కావాల్సి వచ్చింది, ఇప్పుడేమో ఇచ్చిన కార్డులు బ్లాక్‌లో పెడతారా అని జనం ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో పరిస్థితిదీ... జిల్లాలో 15 లక్షల 28 వేల 384 రేష¯ŒSకార్డులున్నాయి. జన్మభూమి కోసమని 91 వేల 806 రేష¯ŒSకార్డులు కేటాయించారు. మంజూరు చేసిన మేరకు అందరికీ రేష¯ŒSకార్డులు పంపిణీని పూర్తి చేశారు. తీరా ఫిబ్రవరి నెల కోటా కోసం కార్డులు తీసుకుని తహసీల్థార్ కార్యాలయాల వద్దకు వెళుతుంటే ‘మీకు రేష¯ŒS లేదు ... మీ కార్డు హోల్డ్‌లో ఉందని’ చెబుతున్నారని కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. l ఉదాహరణకు కాకినాడ నగరాన్నే తీసుకుందాం. ఇక్కడ జన్మభూమి సందర్భంగా 11 వేల రేష¯ŒSకార్డులు పంపిణీ చేశారు. అందులో సుమారు రెండువేల కార్డులు బ్లాక్‌లో పెట్టారు. సిటీని ఆనుకుని ఉన్న కాకినాడ రూరల్ మండలంలో జన్మభూమిలో 2,562 రేష¯ŒSకార్డులు పంపిణీ చేశారు. తీరా ఫిబ్రవరి కోటా కేటాయింపులు వచ్చే సరికి సుమారు 500 రేష¯ŒSకార్డులను బ్లాక్ చేశారని సమాచారం. l అమలాపురంలో 2071 కార్డులు పంపిణీ చేస్తే సుమారు 300 కార్డులు, రాజమహేంద్రవరం నగరంలో 6,396 రేష¯ŒSకార్డులు పంపిణీ చేస్తే 1400 కార్డులు, రాజమహేంద్రవరం రూరల్‌లో 3960 కార్డులు పంపిణీచేయగా, సుమారు 500 కార్డులు బ్లాక్‌లో పెట్టారు. ఈ రకంగా బ్లాక్‌లో పెట్టిన రేష¯ŒSకార్డులు అధికారికంగా ప్రాథమిక సమచారాన్ని బట్టి పరిశీలిస్తే 12 వేల వరకూ ఉన్నాయి. అనధికారిక సమాచారం ప్రకారం ఈ సంఖ్య 15 వేల వరకూ ఉంటుందని లెక్కలేస్తున్నారు. కాకినాడ పెరేడ్‌గ్రౌండ్స్‌లో గణతంత్ర వేడుకల సాక్షిగా 91,806 రేష¯ŒS కార్డులు మంజూరు చేసినట్టు జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ ప్రకటించారు. జిల్లా విజిలె¯Œ్స అండ్ మోనిటరింగ్ కమిటీ సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులకు సైతం అధికారులు ఇవే లెక్కలను చూపించారు. కానీ ఫిబ్రవరి కోటాకు ఈ లెక్కలన్నీ తారుమారైపోయేలా కన్పిస్తున్నాయి. ఈ కార్డులను ఎందుకు బ్లాక్‌లో పెట్టారంటే పల్స్ సర్వే మేరకు నిర్ణయం తీసుకున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నారని మం డ ల స్థాయిలో సమాధానం వస్తోంది. సొంత ఇళ్లు, ఇంటి స్థలం ఉందని, నాలుగు చక్రాల వాహనం ఉందని..ఇలా పలు కారణాలు చెబుతున్నారని కార్డుదారులు ఆవేదన చెందుతున్నారు.రేష¯ŒSకార్డుకు దరఖాస్తు చేశాక అర్హత ఉందా లేదా అనేది పరిశీలించాకనే వాటిని మంజూరు చేశా రు. ఇప్పుడేమో అర్హత లేదని, పల్స్ సర్వే అంటూ కుంటిసాకులతో సర్కార్ నోటి దగ్గర కూడు తిరిగి లాగేసుకుంటోందని కార్డుదారులు లబోదిబోమంటున్నారు. ఆస్తులు లేకపోయినా ఉన్నట్టుగా... జన్మభూమిలో కొత్త రేష¯ŒS కార్డు ఇచ్చారు. కానీ సంక్రాంతి సరుకుల కోసం డీలర్ వద్దకు వెళితే మీ కార్డు డేటా రావడం లేదు సరుకులు ఇవ్వడం కుదరదన్నారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి అడగ్గా కంప్యూటర్లో పరిశీలించి సొంత ఇల్లు ఉన్నట్టు చూపిస్తోంది. అందుకే కార్డు ఇ¯ŒSయాక్టివ్‌లో ఉంది అని చెబుతున్నారు. మా తాతయ్య ట్రాక్టర్ మెకానిక్ గా పని చేస్తుంటాడు వారికి ఎటువంటి ఆస్తులు లేవు. రాజీవ్ గృహకల్పలో ప్లాట్ ఉంది. – కె.ఉదయకుమార్, కాకినాడ పరిశీలించి అర్హుల కార్డులు పునరుద్ధరిస్తాం ప్రజలందరి ఆధార్ అన్నింటికీ అనుసంధానమైన నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్దేశించిన ఆరు అంశాలలో ఏ ఒక్కటి ఉన్నా కొత్తగా మంజూరు చేసిన లబ్థిదారుల రేష¯ŒS కార్డులు ఇ¯ŒSయాక్టివ్‌లోకి వెళ్ళాయి. వాటన్నింటినీ పరిశీలిస్తున్నాం. అర్హులుంటే ఆ లబ్ధిదారుల కార్డులన్నీ పునరుద్ధరిస్తాం. – వి.రవికిరణ్, జిల్లా పౌరసరఫరాలశాఖాధికారి -
టీడీపీ సభ్యత్వం తీసుకుంటేనే రేషన్!
► కార్డుదారులకు డీలర్ బెదిరింపు ► ఇంటింటికీ తిరిగి రసీదుల అప్పగింత ► సరుకులకు వచ్చేటప్పుడు రూ.100 అదనంగా తేవాలని హెచ్చరిక ► లేదంటే సరుకులు ఇచ్చేది లేదని స్పష్టీకరణ ► బెంబేలెత్తుతున్న నిరుపేదలు కర్నూలు : టీడీపీ సభ్యత్వ నమోదు టార్గెట్ చేరుకోవడానికి నేతలు పేదలను తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తున్నారు. గత నెలలో పలుచోట్ల సభ్యత్వం కోసం వృద్ధులు, వికలాంగుల పింఛన్ లోంచి బలవంతంగా రూ.100 లాక్కున్న విషయం మరువక ముందే తాజాగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటేనే రేషన్ సరుకులు ఇస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలోని 5వ చౌక దుకాణం డీలర్ నారాయణరావు ఇల్లిల్లూ తిరిగి పార్టీ సభ్యత్వ రసీదు ఇచ్చి వెళుతున్నారు. సరుకులు తీసుకోవడానికి వచ్చేటప్పుడు రూ.100 అదనంగా తేవాలని, లేదంటే సరుకులు ఇవ్వమని హెచ్చరిస్తున్నారు. రేషన్ సరుకుల కోసం డబ్బు సముకూర్చుకోవడమే గగనమైన పేద ప్రజలు టీడీపీ నేత అయిన డీలర్ తీరుతో బెంబేలెత్తుతున్నారు. డీలర్ నారాయణరావు కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. తన పరిధిలోని కార్డుదారుల జాబితా ఆధారంగా పార్టీ సభ్యత్వ రసీదులు పూరించి ఇళ్లకు వెళ్లి అందజేస్తున్నాడు. ఆ సమయంలో ‘టీడీపీ సభ్యత్వం తీసుకుంటే మూడు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందుతుంది. ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుంది. రేషన్ సరుకులకు వచ్చేటప్పుడు ఓటర్ కార్డు, రూ.100 తీసుకుని రావాలి. పార్టీ సభ్యత్వం తీసుకోకపోతే సరుకులు వేసేది లేదు’ అని తేల్చి చెబుతున్నాడు. ఈ విషయమై కొందరు కార్డుదారులు రసీదులతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. రేషన్ కార్డుదారులను బెదిరించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతుండటం పట్ల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సరుకులకే డబ్బులు కష్టంగా ఉంది టీ కొట్టు పెట్టుకొని బతుకుతున్నా. నెల నెలా సరుకులు తెచ్చుకోవడానికి డబ్బులు పోగేసుకోవడం ఇబ్బందిగా ఉంది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి డబ్బులు కట్టమంటే మా లాంటి నిరుపేదలకు సాధ్యమయ్యే పనికాదు. సరుకులు తెచ్చుకునేందుకు రేషన్ దుకాణానికి వచ్చేటప్పుడు అదనంగా రూ.100 తీసుకురావాలని డీలర్ నారాయణ చెప్పారు. లేదంటే సరుకులు ఇవ్వరట. – హాషం, కార్డుదారుడు, కోడుమూరు సభ్యత్వం తీసుకోవడం ఇష్టం లేదు వ్యాపారం చేసుకుంటూ రోడ్డుమీద బతికేటోళ్లం. పార్టీల ముద్ర వేసుకుంటే మార్కెట్లో వ్యాపారాలు చేసుకోలేం. డీలర్ నారాయణ టీడీపీ సభ్యత్వం తీసుకోవాలని రసీదు రాసిచ్చాడు. సరుకులు తీసుకునేందుకు వచ్చేటప్పుడు రూ.100, ఓటర్ కార్డు తీసుకుని రమ్మన్నాడు. మాకైతే సభ్యత్వం తీసుకోవడం ఇష్టం లేదు. – సలీంబాషా, కార్డుదారుడు, కోడుమూరు -
ఆధార్ లేకపోతే రేషన్ కట్
విజయనగరం కంటోన్మెంట్ : ఆధార్ అనుసంధానం పలు సమస్యలను తెచ్చిపెడుతోం ది. ఓ చిన్న సాంకేతిక లోపం వల్ల వినియో గదారులకు ఇబ్బం దులు ఎదురవుతున్నాయి. ఆధార్ సీడింగ్‌లో ఉన్న లోపభూయిష్ట విధానం వల్ల కుటుంబ సభ్యులంతా రేషన్ పొందలేకపోతున్నారు. ఇప్పటివరకూ సీడింగ్ చేస్తున్న కార్డుల్లోని సభ్యులెవరైనా ఆధార్ నంబర్లు అందజేయకపోతే వారికి మాత్ర మే సరుకులు నిలిపివేసేవారు. కానీ ఇప్పుడు రేషన్ కార్డులోని కుటుంబ యజమానికి ఆధార్ కార్డు రాకపోతే కుటుంబ సభ్యలందరికీ రేష న్ నిలిపివేస్తున్నారు. దీని వల్ల జిల్లా వ్యాప్తంగా వందలాది మం ది కుటుంబాలు రేషన్ పొందలేకపోతున్నారు. దీంతో నిరుపేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 6,64, 971 రేషన్ కార్డులుండగా ఇందులో 23,63,451 మంది లబ్ధిదారులు న్నారు. వీరిని పౌరసరఫరాల శాఖ యూనిట్లుగా పరిగణిస్తోంది. ఆధార్ సీడింగ్ చేసేటప్పుడు ఒక రేషన్ కార్డులోని కు టుంబ సభ్యలందరికీ ఆధార్ కార్డుల నెంబర్లను సీడింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే చాలా మంది వలస వెళ్లినవారు, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు ఆధార్ కార్డులు రాని వారికి ఇంకా అనుసంధానం జరగలేదు. వీరితో పాటు 0 నుంచి 5 ఏళ్ల వయసు కలిగిన కుటుంబ సభ్యుల పేర్లు కూడా కలవలేదు. గతంలో ఐదేళ్లలోపు వయసున్న వారికి ఆధార్‌కార్డు వద్దని చెప్పిన యంత్రాంగం ఇప్పుడు వారికి కూడా ఆధార్ తీసి అందజేయూలని చెప్పడంతో ప్రస్తుతం వారి ఆధార్ కార్డుల నమోదు జరుగుతోంది. అయితే ఇప్పటివరకూ ఆధార్ కార్డులు రాని వారు, వివిధ కారణాల వల్ల నమోదు సక్సెస్ అయినా కార్డులు చేరని వారు అనుసంధానానికి నంబర్లు అందజేయలేక పోయూరు. ఇలా సమర్పించలేకపోయిన వారికి కొత్తగా వచ్చిన కీ రిజిస్టర్ ప్రకారం సరుకులు నిలిపివేస్తున్నారు. కుటుంబంలోని ఎవరయినా ఒక సభ్యు డు ఆధార్ ఇవ్వకపోతే ఎలాట్మెంట్ ప్రకారం మిగతా వారికి సరుకులు వస్తున్నాయి. అయితే కుటుంబ యజ మాని ఆధార్ సమర్పించకపోతే మొత్తం కుటుంబ సభ్యులందరి రేషన్ సరుకులూ నిలిచిపోతున్నాయి. దీంతో ఆయా కుటుంబా లు రేషన్ కోసం ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుల్లో దాదాపు 25 వేల రేషన్ కార్డులు ఈ విధంగా ఉండొ చ్చన్నది అంచనా! అయితే ఇటువంటి రేషన్ కార్డులను ఎలా సరిదిద్ది ఇవ్వాలన్నది అధికారులకు ప్రశ్నార్ధకంగా మారిం ది. దీంతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులకు ఇక్కడి అధికారులు సమాచారమిచ్చి ఏవిధంగా చేయాలన్న విషయంపై స్పష్టత కోరారు. ఇది సాంకేతిక తప్పిదమని, దీన్ని సరిదిద్దేం దుకు ప్రయత్నిస్తున్నామని ఏఎస్ఓ శేషగిరిరావు తెలిపారు. కొనసాగు.. తున్న ఆధార్ అనుసంధానం : జిల్లాలో రేషన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానించే ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ఒక్కటే అధమ స్థానంలో ఉంది. అన్ని జిల్లాల్లోనూ 94 శాతం దాటి ఆధార్ అనుసంధానం జరిగితే ప్రస్తుతం కొనసాగుతున్న అనుసంధానం కేవలం 85 శాతం తోనే ఉండిపోయింది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 85.90 శాతం రేషన్ కార్డుల అనుసంధానం జరిగింది. ఇంకా మిగతా శాతం రద్దు చేయడానికి సిబ్బంది కూడావెనుకడుగు వేస్తున్నారు. -
అన్నభాగ్య!
పట్టణ పేదలకు రేషన్ కట్ దసరా, బక్రీద్ తర్వాత అమల్లోకి? కిరోసిన్ రహిత పట్టణ ప్రాంతాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం సాక్షి, బెంగళూరు : అడిగిన సమాచారం ఇవ్వని వారికి సబ్సిడీ సరుకులను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగానే తొలిదశలో పట్టణాల్లో ఉంటున్న బీపీఎల్, అంత్యోదయ కార్డుదారులకు చౌకదుకాణాల నుంచి అందించే రేషన్‌ను నిలిపి వేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అనర్హులను గుర్తించడంతో పాటు కిరోసిన్ రహిథ పట్టణ ప్రాంతాలుగా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలకు దిగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే గనుక జరిగితే పట్టణాల్లోని పలువురు పేదలు అన్నభాగ్య పథకానికి దూరం కానున్నారు. ప్రస్తుతం రాష్ట్ర మొత్తం మీద కోటి కుటుంబాలు రేషన్ షాపుల నుంచి ప్రతి నలా సబ్సిడీ సరుకులను పొందుతున్నాయి. లబ్ధిదారుల్లో మొత్తం 9,17,987 మంది పట్టణప్రాంతాల్లో(వీరిలో 65,061 మంది అంత్యోదయ లబ్ధిదారులు) నివసిస్తున్నట్లు పౌరసరఫరాలశాఖ గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాకుండా 35 లక్షల మంది కొత్తగా బీపీఎల్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి ఎన్నికల కమిషన్ అందజేసే ఎలొక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డ్ (ఎపిక్ కార్డు)తోపాటు ఆధార్ నంబర్‌ను జత చేయడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలు జారీచేసింది. మరోవైపు ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవారికి వెంటనే ఆధార్, ఎపిక్‌నంబర్‌ను ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ దాదాపు రెండు నెలల ముందే సూచించింది. ప్రభుత్వం అడిగిన సమాచారం ఇచ్చినవారు ఇప్పటికీ లక్షను దాటలేదు. దీంతో సమాచారం ఇవ్వని వారికి రేషన్ నిలిపివేయాలని పౌరసరఫరాల శాఖ భావిస్తోంది. ఇందుకోసం మొదట పట్టణ ప్రాంతాల్లో ఈ నిబంధన అమలు చేసి తర్వాత గ్రామీణ ప్రాంతాలకు వర్తింపజేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు పట్టణప్రాంతాల్లో సబ్సిడీ ధరలో కిరోసిన్ పొందే వారిని గుర్తించి సరైన గణాంకాలు కేంద్రానికి ఇచ్చినప్పుడు మాత్రమే ఆ మేరకు కేంద్రం నుంచి అదనపు గ్యాస్ పొందడానికి వీలవుతుంది. ఈ ప్రక్రియ ఎంత వేగంగా జరిగితే అంత వేగంగా కర్ణాటకను కిరోసిన్ రహిత పట్టణ ప్రాంతాల రాష్ట్రంగా చేయడానికి వీలవుతుంది. దీంతో ‘ఆధార్’ను రేషన్ కార్డుకు అనుసంధానం చేయడం వల్ల లబ్ధిదారుల సంఖ్యలో ఖచ్చితత్వం పెరుగుతుందనేది పౌరసరఫరాలశాఖ భావన. దీనికి సంబంధించిన ఫైల్ పదిహేను రోజుల ముందే ప్రభుత్వానికి చేరింది. అయితేదసరా, బక్రీద్ పండుగలు వచ్చే నెల మొదట్లోనే వస్తుండడంతో ఈ నిబంధన వల్ల రేషన్ దొరక్కపోతే ప్రజల నుంచి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వస్తుందని ఫైల్‌పై ముఖ్యమంత్రి సంతకం చేయడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే నవంబర్ నుంచి ఈ నిబంధనలను అమలు చేయాలని పౌరసరఫరాల శాఖ పట్టుదలతో ఉంది. -
ఆధార్.. బేజార్
మిర్యాలగూడ :ఆధార్ కార్డుల అనుసంధానం పేరుతో ప్రజలు భేజార్ అవుతున్నారు. ప్రతి విషయానికి ఆధార్ కార్డులను లింకు పెడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను కుదించే ప్రయత్నం చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ప్రజా పంపిణీ వ్యవస్థకు ఆధార్ కార్డుల లింకు పెట్టి సెప్టెంబర్ మాసం రేషన్ కట్ చేశారు. జిల్లాలో పూర్తిస్థాయిలో ఆధార్ కార్డులకు ఫోటోలు దిగని వారు కొంత మంది ఉండగా, కార్డులు ఉన్నా అనుసంధానం చేయకపోవడంతో మరికొందరు పరేషాన్ అవతున్నారు. రేషన్ కార్డులతో ఆధార్ కార్డుల అనుసంధానం కాలేదనే సాకుతో సెప్టెంబర్ మాసం రేషన్ సరుకులు నిలిపివేశారు. బోగస్ కార్డులు తొలగించిన తర్వాత జిల్లా వ్యాప్తంగా తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు మొత్తం 9,30, 856 ఉన్నాయి.మొత్తం కార్డులలో 32,53,983 యూనిట్లకు గాను ఇప్పటి వరకు 25,12,442 యూనిట్లు మాత్రమే ఆధార్ కార్డులతో అనుసంధానం చేశారు. కాగా ఇంకా ఆధార్ కార్డులు ఇచ్చినా అనుసంధానం కానివి 4,64,720 యూనిట్లు అధికారుల వద్దనే ఉన్నాయి. 2,76,821 మం ది ఆధార్ కార్డులు అధికారులకు అందించాల్సి ఉంది. కానీ అధికారుల వద్దకు చేరినవాటితో పాటు అనుసంధానం కాని వారికి కూడా సెప్టెంబర్ కోటా రేషన్ కట్ చేశారు. ఆధార్ అనుసంధానం తప్పనిసరి రేషన్ కార్డులకు ఆధార్ కార్డుల అనుసంధానం తప్పనిసరిగా చేయాలి. ఆధార్ కార్డులు స్థానిక రేష న్ డీలర్లకు ఇవ్వని వారు ఇవ్వాలి. రచ్చబండలో మంజూరు చేసిన రేషన్ కార్డులకు సెప్టెంబర్ నెల కోటా విడుదల చేయలేదు. టెంపరరీ కార్డులకు ఫొటోలు ఇవ్వకపోవడం వల్ల రేషన్ నిలిపి వేశారు. వారు కూడా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఫొటో లు, ఆధార్ కార్డులు ఇవ్వాల్సి ఉంది. - నాగేశ్వర్రావు, డీఎస్ఓ, నల్లగొండ. రచ్చబండ కార్డులకు రేషన్ నిలిపివేత గత ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమంలో టెంపరరీ రేషన్ కార్డులు మంజూరు చేశారు. కాగా లబ్ధిదారులకు ఫొటోలు లేకుండా టెం పరరీ కార్డుతో పాటు కూపన్లు అందజేశారు. కాగా ఇప్పటి వరకు కూపన్ల ద్వారా రేషన్ సరుకులు తెచ్చుకునే రచ్చబండలో మంజూ రైన రేషన్ కార్డు దారులు సెప్టెం బర్లో సరుకులు ఇవ్వడం లేదు. ఈ నెల కూపన్ ఉన్నా సరుకులు ఇవ్వడం లేదు. జిల్లా వ్యాప్తంగా 31వేల టెంపరరీ రేషన్ కార్డులకు సెప్టెంబర్ నెల రేషన్ నిలిపి వేశారు. కార్డులపై ఫొటోలు లేవనే సాకుతో పాటు ఆధార్ కార్డుల అనుసంధానం కాలేదని రేషన్ నిలిపివేశారు. పండగకు పస్తులే అక్టోబర్ మొదటి వారంలో దసరా పండగ వస్తున్నప్పటికీ సెప్టెంబర్ మాసం రేషన్ సరుకులు ఇవ్వక పోవడంతో పేదలు పస్తులుండే పరిస్థితి ఏర్పడింది. ఆధార్ కార్డుల అనుసంధానం పేరుతో కొంత మందికి, టెంపరరీ కార్డుల పేరుతో మరికొంత మందికి రేషన్ సరుకులు నిలిపివేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 14 వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యానికి సెప్టెంబర్ మాసంలో 900 మెట్రిక్ టన్నులకు కుదించారు. -
తెగిన ఆధారం
34వేల కార్డులకు రేషన్ కట్ డీలర్లకు అందని ఆధార్ కార్డుల వివరాలు - 33,01,445 యూనిట్లలో 3లక్షలు రద్దు - ఇంకా ఆధార్ లేని యూనిట్లు 5.92లక్షలు - ఇబ్బందులు పడుతున్న పేదలు - ఆధార్ వివరాలు ఇస్తే కార్డులు పునరుద్ధరిస్తామంటున్న అధికారులు హన్మకొండ అర్బన్: జిల్లాలో 34వేల తెల్లరేషన్ కార్డులకు సెప్టెంబర్ నెల రేషన్ సరుకులు నిలిపివే స్తూ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఆధార్ కార్డు వివరాలు లేకపోవడం వల్లే రేషన్ కార్డులకు సరుకులు నిలిపి వేశామంటున్నారు. ప్రస్తుతం 34వేల కార్డులకు రేషన్ నిలిపి వేయడం వల్ల 910 టన్నుల బియ్యం మిగిలినట్లు అధికారులు లెక్కలు వేస్తున్నారు. తద్వారా ఒక్క నెలకే రూ.53 లక్షలు ఆదా అయినట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో అన్ని రకాల రేషన్‌కార్డులు కలిపి మొత్తం 9,79,821 ఉన్నాయి. వీటిలో 33,01,445 యూనిట్లు(కార్డులో ఎందరు ఉంటే అన్ని యూనిట్లు) ఉన్నాయి. ఇందులో అధికారుల వద్ద ఉన్న తాజా సమాచారం ప్రకారం 27,08,920 యూనిట్లకు ఆధా ర్ వివరాలు జతచేశారు. ఇందులో 1,04,525 లక్షల యూనిట్లకు సంబంధించిన సమాచారం అప్లోడ్కాకుండా పెండింగ్‌లో ఉంది. ఇక ఆధార్ జోడించడం తో మొత్తం యూనిట్లలో సుమారు 3లక్షల కార్డులు మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారివిగా అధికారులు గుర్తించి, స్థానికంగా నిర్ధారించుకుని వాటిని పూర్తిగా తొలగించారు. ఇంకా 5,92,525 యూనిట్ల నుంచి ఆధార్ వివరాలు అందలేదు. అప్‌లోడ్‌కాని వారికి ఇబ్బందులు.. తాజా సమాచారం ప్రకారం జిల్లాలో 1,04,525 యూనిట్లకు సంబంధించి ఆధార్ సమాచారం అధికారుల వద్ద ఇంకా అప్లోడ్కాలేదు. అయితే వీరిలో చాలామంది గతంలో శాశ్వత ఆధార్ నంబర్ కాకుం డా.. ఆధార్ నమోదు సమయంలో వచ్చే ఈ-ఆధార్ నంబర్‌ను అధికారులకు ఇచ్చారు. ఆ తర్వాత సాం కేతిక కారణాలతో చాలామందికి శాశ్వత ఆధార్‌కార్డులు రాలేదు. వీరిని మళ్లీ ఆధార్ నమోదుకు వివరా లు ఇచ్చి కార్డులు పొందాలని అధికారులు చెప్పా రు. మండలాల వారీగా పరిశీలిస్తే ఒక్క హన్మకొండ మండలంలో ఈ-ఆధార్ వివరాలు ఇచ్చిన సుమారు 22వేల మంది సమాచారం పెండింగ్‌లో ఉన్నట్లు చూపిస్తోంది. దీంతో ఇలాంటి కార్డుదారులకు ఈ నె ల కిరోసిన్ కోటా నిలిపివేస్తున్నట్లు హన్మకొండ తహసీల్దార్ చెన్నయ్య డీలర్లకు చెప్పారు. ఇదే పరిస్థితి జిల్లా వ్యాప్తంగా చూస్తే లక్ష మందికిపైగా రేషన్ నిలిచి పోయే పరిస్థితి కనిపిస్తుంది. ‘రచ్చబండ’ కార్డులే ఎక్కువ.. ప్రస్తుతం సెప్టెంబర్ నెలకు సంబంధించి రేషన్ కోత పెట్టిన 34వేల కార్డుల్లో సుమారు 18 వేల కార్డుల వరకు రచ్చబండ సభల్లో ఇచ్చిన కార్డులే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పదేపదే చెప్పినా ఆధార్ వివరాలు, ఫొటోలు ఇవ్వని వారి కార్డులకు కోటా నిలిపివేసినట్లు అధికారులు చెపుతున్నారు. ఆధార్‌లేనివారు 20శాతం.. జిల్లాలో 20శాతం మందికి ఆధార్ వివరాలు లేవని ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో కార్డులు పూ ర్తిగా తొలగిస్తే పేదలు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహనలేక ఈ-ఆధార్ నంబర్ ఇచ్చారు. వారికి తర్వాత శాశ్వత ఆధార్ ఇవ్వక పోవడం వల్ల కొందరి కార్డులు తొలగించే అవకాశాలు ఉన్నాయి. అందువ ల్ల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన తరువాత మాత్రమే కార్డులను శాశ్వతంగా తొలగించాల ని పేదలు కోరుతున్నారు. ఆధార్, ఫొటోలు ఇస్తే కార్డును పునరుద్ధరిస్తాం.. జిల్లాలో ఆధార్ వివరాలు, ఫొటోలు ఇవ్వని సుమారు 34వేల కార్డులకు ఈనెల రేషన్ ఇవ్వలే దు. వీరికి వారం రోజులపాటు గడువు ఇచ్చాం. ఈ లోగా ఆధార్ వివరాలు, ఫొటోలు సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో అందజేస్తే వారి కా ర్డును పునరుద్ధరిస్తాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ కోటా నిలిపివేశాం. ఆధార్ అప్లోడ్ విషయంలో తహసీల్దార్లు మరింత శ్రద్ధ వహించాలి. సాధ్యమైనంత త్వరగా అధార్ వివరాలు నమోదు చేయాలి. బోగస్‌కార్డులు పూర్తిగా ఏరివేసేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. - ఉషారాణి, డీఎస్ఓ