ఆధార్ లేకపోతే రేషన్ కట్ | If not Aadhaar ration cut | Sakshi
Sakshi News home page

ఆధార్ లేకపోతే రేషన్ కట్

Published Sun, Oct 12 2014 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM

ఆధార్ లేకపోతే రేషన్ కట్

ఆధార్ లేకపోతే రేషన్ కట్

విజయనగరం కంటోన్మెంట్ : ఆధార్ అనుసంధానం పలు సమస్యలను తెచ్చిపెడుతోం ది. ఓ చిన్న సాంకేతిక లోపం వల్ల వినియో గదారులకు ఇబ్బం దులు ఎదురవుతున్నాయి. ఆధార్ సీడింగ్‌లో ఉన్న లోపభూయిష్ట విధానం వల్ల కుటుంబ సభ్యులంతా రేషన్ పొందలేకపోతున్నారు. ఇప్పటివరకూ సీడింగ్ చేస్తున్న కార్డుల్లోని సభ్యులెవరైనా ఆధార్ నంబర్లు అందజేయకపోతే వారికి మాత్ర మే సరుకులు నిలిపివేసేవారు. కానీ ఇప్పుడు రేషన్ కార్డులోని కుటుంబ యజమానికి ఆధార్ కార్డు రాకపోతే కుటుంబ సభ్యలందరికీ రేష న్ నిలిపివేస్తున్నారు. దీని వల్ల జిల్లా వ్యాప్తంగా వందలాది మం ది కుటుంబాలు రేషన్ పొందలేకపోతున్నారు. దీంతో నిరుపేద  కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 6,64,  971 రేషన్ కార్డులుండగా ఇందులో 23,63,451 మంది లబ్ధిదారులు న్నారు.
 
 వీరిని పౌరసరఫరాల శాఖ యూనిట్లుగా పరిగణిస్తోంది. ఆధార్ సీడింగ్ చేసేటప్పుడు ఒక రేషన్ కార్డులోని కు టుంబ సభ్యలందరికీ ఆధార్ కార్డుల నెంబర్లను సీడింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే చాలా మంది వలస వెళ్లినవారు, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు ఆధార్ కార్డులు రాని వారికి ఇంకా అనుసంధానం జరగలేదు. వీరితో పాటు 0 నుంచి 5 ఏళ్ల వయసు కలిగిన కుటుంబ సభ్యుల పేర్లు కూడా కలవలేదు. గతంలో ఐదేళ్లలోపు వయసున్న వారికి ఆధార్‌కార్డు వద్దని చెప్పిన యంత్రాంగం ఇప్పుడు వారికి కూడా ఆధార్ తీసి అందజేయూలని చెప్పడంతో ప్రస్తుతం వారి ఆధార్ కార్డుల నమోదు జరుగుతోంది. అయితే ఇప్పటివరకూ ఆధార్ కార్డులు రాని వారు, వివిధ కారణాల వల్ల నమోదు సక్సెస్ అయినా కార్డులు చేరని వారు అనుసంధానానికి నంబర్లు అందజేయలేక పోయూరు.
 
 ఇలా సమర్పించలేకపోయిన వారికి కొత్తగా వచ్చిన కీ రిజిస్టర్ ప్రకారం సరుకులు నిలిపివేస్తున్నారు. కుటుంబంలోని ఎవరయినా ఒక సభ్యు డు ఆధార్ ఇవ్వకపోతే  ఎలాట్‌మెంట్ ప్రకారం  మిగతా వారికి సరుకులు వస్తున్నాయి. అయితే కుటుంబ యజ మాని ఆధార్ సమర్పించకపోతే మొత్తం కుటుంబ సభ్యులందరి  రేషన్ సరుకులూ నిలిచిపోతున్నాయి. దీంతో ఆయా కుటుంబా లు రేషన్ కోసం ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుల్లో దాదాపు 25 వేల రేషన్ కార్డులు ఈ విధంగా ఉండొ చ్చన్నది అంచనా! అయితే ఇటువంటి రేషన్ కార్డులను ఎలా సరిదిద్ది ఇవ్వాలన్నది అధికారులకు ప్రశ్నార్ధకంగా మారిం ది. దీంతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులకు ఇక్కడి అధికారులు సమాచారమిచ్చి ఏవిధంగా చేయాలన్న విషయంపై స్పష్టత కోరారు. ఇది సాంకేతిక తప్పిదమని, దీన్ని సరిదిద్దేం దుకు ప్రయత్నిస్తున్నామని ఏఎస్‌ఓ శేషగిరిరావు తెలిపారు.
 
 కొనసాగు.. తున్న ఆధార్ అనుసంధానం :
 జిల్లాలో రేషన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానించే ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ఒక్కటే అధమ స్థానంలో ఉంది.  అన్ని జిల్లాల్లోనూ 94 శాతం దాటి ఆధార్ అనుసంధానం జరిగితే ప్రస్తుతం కొనసాగుతున్న అనుసంధానం కేవలం 85 శాతం తోనే ఉండిపోయింది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 85.90 శాతం రేషన్ కార్డుల అనుసంధానం జరిగింది. ఇంకా మిగతా శాతం రద్దు చేయడానికి సిబ్బంది కూడావెనుకడుగు వేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement