తెగిన ఆధారం | 34 thousand to cut ration cards | Sakshi
Sakshi News home page

తెగిన ఆధారం

Published Thu, Sep 11 2014 3:07 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM

తెగిన ఆధారం

తెగిన ఆధారం

 34వేల కార్డులకు రేషన్ కట్
 డీలర్లకు అందని ఆధార్ కార్డుల వివరాలు
- 33,01,445 యూనిట్లలో 3లక్షలు రద్దు
- ఇంకా ఆధార్ లేని యూనిట్లు 5.92లక్షలు
- ఇబ్బందులు పడుతున్న పేదలు
- ఆధార్ వివరాలు ఇస్తే కార్డులు పునరుద్ధరిస్తామంటున్న అధికారులు

 హన్మకొండ అర్బన్: జిల్లాలో 34వేల తెల్లరేషన్ కార్డులకు సెప్టెంబర్ నెల రేషన్ సరుకులు నిలిపివే స్తూ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఆధార్ కార్డు వివరాలు లేకపోవడం వల్లే రేషన్ కార్డులకు సరుకులు నిలిపి వేశామంటున్నారు. ప్రస్తుతం 34వేల కార్డులకు రేషన్ నిలిపి వేయడం వల్ల 910 టన్నుల బియ్యం మిగిలినట్లు అధికారులు లెక్కలు వేస్తున్నారు. తద్వారా ఒక్క నెలకే రూ.53 లక్షలు  ఆదా అయినట్లు అధికారులు పేర్కొన్నారు.

జిల్లాలో అన్ని రకాల రేషన్‌కార్డులు కలిపి మొత్తం 9,79,821 ఉన్నాయి. వీటిలో 33,01,445 యూనిట్లు(కార్డులో ఎందరు ఉంటే అన్ని యూనిట్లు) ఉన్నాయి. ఇందులో అధికారుల వద్ద ఉన్న తాజా సమాచారం ప్రకారం 27,08,920 యూనిట్లకు ఆధా ర్ వివరాలు జతచేశారు. ఇందులో 1,04,525 లక్షల యూనిట్లకు సంబంధించిన సమాచారం అప్‌లోడ్‌కాకుండా పెండింగ్‌లో ఉంది. ఇక ఆధార్ జోడించడం తో  మొత్తం యూనిట్లలో సుమారు 3లక్షల కార్డులు మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారివిగా అధికారులు గుర్తించి, స్థానికంగా నిర్ధారించుకుని వాటిని పూర్తిగా తొలగించారు. ఇంకా 5,92,525 యూనిట్ల నుంచి ఆధార్ వివరాలు అందలేదు.
 
అప్‌లోడ్‌కాని వారికి ఇబ్బందులు..
తాజా సమాచారం ప్రకారం జిల్లాలో 1,04,525 యూనిట్లకు సంబంధించి ఆధార్ సమాచారం అధికారుల వద్ద ఇంకా అప్‌లోడ్‌కాలేదు. అయితే వీరిలో చాలామంది గతంలో శాశ్వత ఆధార్ నంబర్ కాకుం డా.. ఆధార్ నమోదు సమయంలో వచ్చే ఈ-ఆధార్ నంబర్‌ను అధికారులకు ఇచ్చారు. ఆ తర్వాత సాం కేతిక కారణాలతో చాలామందికి శాశ్వత ఆధార్‌కార్డులు రాలేదు. వీరిని మళ్లీ ఆధార్ నమోదుకు వివరా లు ఇచ్చి కార్డులు పొందాలని అధికారులు చెప్పా రు. మండలాల వారీగా పరిశీలిస్తే ఒక్క హన్మకొండ మండలంలో ఈ-ఆధార్ వివరాలు ఇచ్చిన సుమారు 22వేల మంది సమాచారం పెండింగ్‌లో ఉన్నట్లు చూపిస్తోంది. దీంతో ఇలాంటి కార్డుదారులకు ఈ నె ల కిరోసిన్ కోటా నిలిపివేస్తున్నట్లు హన్మకొండ తహసీల్దార్ చెన్నయ్య డీలర్లకు చెప్పారు. ఇదే పరిస్థితి జిల్లా వ్యాప్తంగా చూస్తే లక్ష మందికిపైగా రేషన్ నిలిచి పోయే పరిస్థితి కనిపిస్తుంది.
 
‘రచ్చబండ’ కార్డులే ఎక్కువ..
ప్రస్తుతం సెప్టెంబర్ నెలకు సంబంధించి రేషన్ కోత పెట్టిన 34వేల కార్డుల్లో సుమారు 18 వేల కార్డుల వరకు రచ్చబండ సభల్లో ఇచ్చిన కార్డులే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పదేపదే చెప్పినా ఆధార్ వివరాలు, ఫొటోలు ఇవ్వని వారి కార్డులకు కోటా నిలిపివేసినట్లు అధికారులు చెపుతున్నారు.
 
ఆధార్‌లేనివారు 20శాతం..
జిల్లాలో 20శాతం మందికి ఆధార్ వివరాలు లేవని ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో కార్డులు పూ ర్తిగా తొలగిస్తే పేదలు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహనలేక ఈ-ఆధార్ నంబర్ ఇచ్చారు. వారికి తర్వాత శాశ్వత ఆధార్ ఇవ్వక పోవడం వల్ల కొందరి కార్డులు తొలగించే అవకాశాలు ఉన్నాయి. అందువ ల్ల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన తరువాత మాత్రమే కార్డులను శాశ్వతంగా తొలగించాల ని పేదలు కోరుతున్నారు.
 
ఆధార్, ఫొటోలు ఇస్తే కార్డును పునరుద్ధరిస్తాం..

జిల్లాలో ఆధార్ వివరాలు, ఫొటోలు ఇవ్వని సుమారు 34వేల కార్డులకు ఈనెల రేషన్ ఇవ్వలే దు. వీరికి వారం రోజులపాటు గడువు ఇచ్చాం. ఈ లోగా ఆధార్ వివరాలు, ఫొటోలు సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో అందజేస్తే వారి కా ర్డును పునరుద్ధరిస్తాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ కోటా నిలిపివేశాం. ఆధార్ అప్‌లోడ్ విషయంలో తహసీల్దార్లు మరింత శ్రద్ధ వహించాలి. సాధ్యమైనంత త్వరగా అధార్ వివరాలు నమోదు చేయాలి. బోగస్‌కార్డులు పూర్తిగా ఏరివేసేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.    - ఉషారాణి, డీఎస్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement