racha banda
-
ఓల్లు నారాజ్ కావొద్దని..
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): ఏంరా... రాజు ఎటు పోతున్నవ్ అసలే కనిపిత్తలేవ్... ఏంలేదు నర్సన్న రోజు ఎలచ్చన్ల పెచారంకు బోతున్న గందుకే నీకు కనిపిత్తలేను... గట్లనా మరి గదే రోజు పొద్దుగాల్ల కసీర్కాడ ఉన్న హోటల్‌కు అచ్చి చాయి తాగుతుంటివి.. మూడు నాలుగు రోజుల నుంచి సూత్తున్న కనిపిత్తలేవని అడుగుతున్న. అవు నర్సన్న మస్కట్ బోయేటందుకు విజాకు అప్లికేషన్ పెట్టిన గని ఇంకా మస్తు టైం ఉంది. గందుకే ఉట్టిగా ఇంటికాడ ఉంటే యాష్ట అత్తది. పెచారంకు బోతే పైసలత్తున్నయి. ఇంత బిర్యాని బువ్వ బెడుతుండ్రు... గందుకే పెచారంకు బోతున్న. అగో రోజు మస్తు మజా సేత్తున్నవ్ అన్నట్లు గదరా రాజు.. అవు నర్సన్న మరేంజేస్తం... ఎలచ్చన్లు అయిపోయేదాంకా పెచారంల తిరుగుతున్న.. అవు మల్ల మరి ఏ పార్టీల్లోకు పెచారంకు బోతున్నవ్ రాజు. ఏం లేదు నర్సన్న ఓల్లు ఒక రోజు ముందు సెబితే ఆల్లకు పెచారంకు బోతున్న. అగో గట్ల గిదేం తరీకర బై రాజు.. ఇగో నర్సన్న ఓల్లయిన గంతే పైసలిత్తుండ్రు. అందరి లెక్కనే బిర్యాని బువ్వ బెడుతుండ్రు. గందుకే ముందు ఓల్లు సెబితే ఆల్లకు పెచారంకు బోతున్నం. గట్ల గాదురా రాజు. ఏదన్న ఒక పార్టీకే పెచారంకు బోవాల గాని ఓల్లు సెబితే ఆల్లకు పోవుడు ఏమన్నా మంచిదావురా. ఇగో నర్సన్న.. గిప్పుడు గిట్లనే సెయ్యాలే.. ఏంటికంటే.. ఓల్లయిన ఉట్టిగనే తోల్కపోతలే. అందరు పైసలు, బిర్యాని బువ్వ పెట్టుడు కామన్ జేసిండ్రు. గందుకే ఒక రోజు ముందు సెప్పినోల్లకు పెచారంకు బోతున్నం. మల్ల పొద్దుమీక్కి మా ఇంటికచ్చి పెచారంకు రమ్మని సెప్పినోల్లకు తెల్లారి ఆల్లకు బోతున్నం. ఇగో రాజు నేను అన్నది నీకర్థం గాలే.. నేను సెప్పిదే ఏంటిదంటే ఏదన్న ఒక పార్టీకి పెచారంకు బోవాల గాని ఓల్లు సెబితే ఆల్లకు పోవుడు ఏం మంచిగలేదు. ఏదన్న ఒక పార్టీతోనే ఉండాలే అని సెప్పుతున్న. గది కరెక్టె గని నర్సన్న. మనకు ఎప్పుడు ఓల్లతోని పని బడ్తదో తెల్వదాయే. గందుకే ఏ పార్టీవోల్లు సెప్పినా పెచారంకు బోయి అత్తున్న. అంటే ఒక పాల్టీలనే తిరగవ్ అన్నట్లు గదరా రాజు. అవ్మల్ల. నర్సన్న ఒక పార్టీలనే దిరిగితే మిగిలిన పార్టీలోల్లతోని లొల్లి. గందుకే ఓల్లను కూడా నారాజ్ సేయకుండా అన్ని పార్టీవోల్లకు బోయి పెచారం సేసి అత్తున్నం. గట్లనే ఏ పార్టీవోల్లతోని బోతే ఆల్ల కండువ గప్పుకుంటున్నం నర్సన్న. అవ్రా రాజు నువ్వు సెప్పింది మస్తుగున్నది. నీ లెక్కనే రాజకీయం చెయ్యాల. మంచి పిలాన్ సేసినవ్. ఓల్లు కూడా నారాజ్ కాకుండా అందరి తాన్కి బోతున్నవ్. ఓల్లు పైసలిత్తే ఆల్లయి తీసుకుంటున్నవ్. మంచి పని జేసినవ్. పోతరా మస్తు లేట్ అయ్యింది పని బాగుంది అని ఆడికెల్లి ఇద్దరు ఎల్లిపోయిండ్రు.. -
ప్రజలతో మమేకం
సాక్షి, తిరుపతి: జిల్లాలోని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుం టూ ముందుకు సాగుతున్నారు. ఆదివారం మదనపల్లె, పూతలపట్టు, చిత్తూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు, గంగాధరనెల్లూరు నియోజకర్గాల్లో రచ్చబండ, పల్లెనిద్ర చేపట్టారు. మదనపల్లె మండలం కోటవారిపల్లెలో ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్‌తిప్పారెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు పరిధిలోని గుడిపాల మండలం చీలాపల్లె పం చాయతీ రాసనిపల్లెలో పార్లమెంటరీ ఇన్చార్జ్ జంగాలపల్లె శ్రీనివాసులు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాళహస్తి పరిధిలోని తొట్టంబేడు మండలం పొయ్యిగ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. గంగాధరనెల్లూరు పరిధిలోని పాతగుంటలో ఎమ్మెల్యే నారాయణస్వామి రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పూతలపట్టు నియోజక వర్గం బంగారుపాళెం మండలం జంబుగానిపల్లెలో ఎమ్మెల్యే సునీల్‌కుమార్ రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించా రు. సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెం మండలంలో ఎంజీనగర్, అరుంధతివాడ, సిద్ధాపురం, అంబికాపురం గ్రామాల్లో రచ్చబం డ నిర్వహించారు. ఎంజీనగర్ గిరిజన కాలనీ లో కోనేటి ఆదిమూలం పల్లెనిద్ర చేపట్టారు. -
ప్రజల మధ్య వైఎస్సార్సీపీ
చిత్తూరు, సాక్షి: ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వైఎస్సార్సీపీ జిల్లాలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆయా గ్రామాల్లో ప్రజలు పడుతున్న బాధలు, ఎదుర్కొంటున్న సమస్యలను నాయకులే స్వయంగా పరిశీలిస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకుపోతున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని నాయకులు ప్రజలకు తెలియజేస్తున్నారు. పీలేరు నియోజకవర్గం కేవీపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీలోని శిబ్బాలవారిపల్లెలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సోమవారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటామని, ఏ కష్టమొచ్చినా ప్రజలు నేరుగా వచ్చి మా దృష్టికి తెస్తే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని కంచన పుత్తూరు గ్రామంలోని ఎస్సీ, ఎస్టీకాలనీలో సోమవారం నియోజకవర్గ సమన్వయ కర్త ఆదిమూలం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో రోడ్లు, తాగునీటి సరఫరా అధ్వానంగా ఉన్నాయని నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. పక్కాగృహాలన్నీ టీడీపీ సానుభూతిపరులకే ఇస్తున్నారని ప్రజలు వాపోయారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయ్తు కార్యదర్శి విద్యానాథ్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ∙పుంగనూరు పట్టణంలోని భగత్‌సింగ్‌కాలనీలో ఆదివారం రాత్రి వైఎస్ఆర్ సీపీ రాష్ట్రకార్యదర్శి ఎన్ రెడ్డెప్ప, జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బాలు ఆధ్వర్యంలో పల్లె నిద్ర చేశారు. -
ప్రజల వద్దకు ప్రతిపక్షం
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రజల సమస్యలు తెలుసుకొనేందుకు ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ వారి ముంగిటకే వెళ్తోంది. రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాల్లో భాగంగా ఆ పార్టీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు గ్రామాలు, కాలనీల్లో బస చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. వరుసగా రెండో రోజైన ఆదివారం కూడా జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు వివిధ సమస్యలు ఏకరువు పెట్టారు. వారికి భరోసా ఇచ్చిన నేతలు.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ఆయా సమస్యలను ఏవిధంగా పరిష్కరిస్తుందో వివరించారు. దళితుల గృహ అవసరాలకు ఉచిత విద్యుత్, నవరత్న పథకాల ద్వారా జరిగే మేలును రచ్చబండలో వివరించారు. రాత్రి ఆయా కాలనీల్లోని దేవాలయాలు, స్కూళ్లలో బస చేశారు. కోటనందూరులో తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, అయినవిల్లి మండలం కొండుకుదురులంకలో పి.గన్నవరం కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, రౌతులపూడి మండలం పి.చామవరంలో ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్, గండేపల్లి మండలం ఉప్పలపాడులో జగ్గంపేట కో ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్, అనాతవరంలో ముమ్మిడివరం కో ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ, రంగంపేట ఎస్టీ కాలనీలో అనపర్తి కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, కొత్తపల్లి మండలం రమణక్కపేటలో పిఠాపురం కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు, కపిలేశ్వరపురం మండలం నేలటూరులో మండపేట కో ఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహించారు. కడియం మండలం మురమండలో శనివారం రచ్చబండ నిర్వహించగా, ఆదివారం ప్రత్యేక హోదాకు మద్దతుగా రాజమహేంద్రవరం రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో సంతకాలు సేకరించారు. అదే నియోజకవర్గం ధవళేశ్వరంలో మరో కో ఆర్డినేటర్ గిరిజాల వీర్రాజు (బాబు) కూడా సంతకాలు సేకరించారు. ప్రజా సమస్యలే ఎన్నికల మేనిఫెస్టో : ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కోటనందూరు: తెలుగుదేశం ప్రభుత్వ నిరంకుశ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకొని, వాటి పరిష్కారాలనే ఎన్నికల మేనిఫెస్టోగా ప్రకటిస్తామని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. కోటనందూరు కొత్త ఎస్సీ కాలనీలో ఆదివారం జరిగిన ‘రచ్చబండ–పల్లెనిద్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అసెంబ్లీలో ఉండాల్సిన తమ పార్టీ ఎమ్మెల్యేలు.. టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరి కారణంగా ప్రజా సమస్యలను తెలుసుకొనేందుకు పల్లెల్లో తిరుగుతున్నారన్నారు. సీఎం చంద్రబాబు తమ ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలతో సంతలో పశువుల మాదిరిగా కొలుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విలువలంటే గౌరవం లేని అసెంబ్లీని అందుకే బాయ్‌కట్ చేశామన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తొలుత ఈ కార్యక్రమాన్ని దళితవాడల్లో నిర్వహిస్తున్నామన్నారు. నేరుగా ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని, పార్టీ అధికారం చేపట్టిన తరువాత వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు దళిత మహిళలు వివిధ సమస్యలను వివరించారు. అర్హులకు కూడా పింఛన్లు ఇవ్వడం లేదని, ఒక్క ఇల్లు కూడా నిర్మించుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, త్వరలో రాజన్న పాలన వస్తుందని, అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. దళితులకు ఉచిత కరెంటు, వృద్ధులకు రూ.2 వేల పింఛను, మండల కేంద్రాల్లో వృద్ధాశ్రమాలు వంటి అనేక హామీలను జగన్ ప్రకటించారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను సీఎంను చేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ గొర్లి రామచంద్రరావు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, జిల్లా కార్యదర్శి పెదపాటి అమ్మాజీ, సర్పంచ్‌లు బొంగు గోపాలకృష్ణ, యలమంచిలి దేవుళ్ళు, ఎంపీటీసీ సభ్యురాలు గర్సింగు శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
నేతన్నల బతుకుల్లో జగన్ వెలుగు నింపుతారు
-
’పల్లెనిద్ర’ చేసిన ఎమ్మెల్యే నాని
-
రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ రచ్చబండ - పల్లెనిద్ర
-
తెగిన ఆధారం
34వేల కార్డులకు రేషన్ కట్ డీలర్లకు అందని ఆధార్ కార్డుల వివరాలు - 33,01,445 యూనిట్లలో 3లక్షలు రద్దు - ఇంకా ఆధార్ లేని యూనిట్లు 5.92లక్షలు - ఇబ్బందులు పడుతున్న పేదలు - ఆధార్ వివరాలు ఇస్తే కార్డులు పునరుద్ధరిస్తామంటున్న అధికారులు హన్మకొండ అర్బన్: జిల్లాలో 34వేల తెల్లరేషన్ కార్డులకు సెప్టెంబర్ నెల రేషన్ సరుకులు నిలిపివే స్తూ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఆధార్ కార్డు వివరాలు లేకపోవడం వల్లే రేషన్ కార్డులకు సరుకులు నిలిపి వేశామంటున్నారు. ప్రస్తుతం 34వేల కార్డులకు రేషన్ నిలిపి వేయడం వల్ల 910 టన్నుల బియ్యం మిగిలినట్లు అధికారులు లెక్కలు వేస్తున్నారు. తద్వారా ఒక్క నెలకే రూ.53 లక్షలు ఆదా అయినట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో అన్ని రకాల రేషన్‌కార్డులు కలిపి మొత్తం 9,79,821 ఉన్నాయి. వీటిలో 33,01,445 యూనిట్లు(కార్డులో ఎందరు ఉంటే అన్ని యూనిట్లు) ఉన్నాయి. ఇందులో అధికారుల వద్ద ఉన్న తాజా సమాచారం ప్రకారం 27,08,920 యూనిట్లకు ఆధా ర్ వివరాలు జతచేశారు. ఇందులో 1,04,525 లక్షల యూనిట్లకు సంబంధించిన సమాచారం అప్లోడ్కాకుండా పెండింగ్‌లో ఉంది. ఇక ఆధార్ జోడించడం తో మొత్తం యూనిట్లలో సుమారు 3లక్షల కార్డులు మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారివిగా అధికారులు గుర్తించి, స్థానికంగా నిర్ధారించుకుని వాటిని పూర్తిగా తొలగించారు. ఇంకా 5,92,525 యూనిట్ల నుంచి ఆధార్ వివరాలు అందలేదు. అప్‌లోడ్‌కాని వారికి ఇబ్బందులు.. తాజా సమాచారం ప్రకారం జిల్లాలో 1,04,525 యూనిట్లకు సంబంధించి ఆధార్ సమాచారం అధికారుల వద్ద ఇంకా అప్లోడ్కాలేదు. అయితే వీరిలో చాలామంది గతంలో శాశ్వత ఆధార్ నంబర్ కాకుం డా.. ఆధార్ నమోదు సమయంలో వచ్చే ఈ-ఆధార్ నంబర్‌ను అధికారులకు ఇచ్చారు. ఆ తర్వాత సాం కేతిక కారణాలతో చాలామందికి శాశ్వత ఆధార్‌కార్డులు రాలేదు. వీరిని మళ్లీ ఆధార్ నమోదుకు వివరా లు ఇచ్చి కార్డులు పొందాలని అధికారులు చెప్పా రు. మండలాల వారీగా పరిశీలిస్తే ఒక్క హన్మకొండ మండలంలో ఈ-ఆధార్ వివరాలు ఇచ్చిన సుమారు 22వేల మంది సమాచారం పెండింగ్‌లో ఉన్నట్లు చూపిస్తోంది. దీంతో ఇలాంటి కార్డుదారులకు ఈ నె ల కిరోసిన్ కోటా నిలిపివేస్తున్నట్లు హన్మకొండ తహసీల్దార్ చెన్నయ్య డీలర్లకు చెప్పారు. ఇదే పరిస్థితి జిల్లా వ్యాప్తంగా చూస్తే లక్ష మందికిపైగా రేషన్ నిలిచి పోయే పరిస్థితి కనిపిస్తుంది. ‘రచ్చబండ’ కార్డులే ఎక్కువ.. ప్రస్తుతం సెప్టెంబర్ నెలకు సంబంధించి రేషన్ కోత పెట్టిన 34వేల కార్డుల్లో సుమారు 18 వేల కార్డుల వరకు రచ్చబండ సభల్లో ఇచ్చిన కార్డులే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పదేపదే చెప్పినా ఆధార్ వివరాలు, ఫొటోలు ఇవ్వని వారి కార్డులకు కోటా నిలిపివేసినట్లు అధికారులు చెపుతున్నారు. ఆధార్‌లేనివారు 20శాతం.. జిల్లాలో 20శాతం మందికి ఆధార్ వివరాలు లేవని ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో కార్డులు పూ ర్తిగా తొలగిస్తే పేదలు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహనలేక ఈ-ఆధార్ నంబర్ ఇచ్చారు. వారికి తర్వాత శాశ్వత ఆధార్ ఇవ్వక పోవడం వల్ల కొందరి కార్డులు తొలగించే అవకాశాలు ఉన్నాయి. అందువ ల్ల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన తరువాత మాత్రమే కార్డులను శాశ్వతంగా తొలగించాల ని పేదలు కోరుతున్నారు. ఆధార్, ఫొటోలు ఇస్తే కార్డును పునరుద్ధరిస్తాం.. జిల్లాలో ఆధార్ వివరాలు, ఫొటోలు ఇవ్వని సుమారు 34వేల కార్డులకు ఈనెల రేషన్ ఇవ్వలే దు. వీరికి వారం రోజులపాటు గడువు ఇచ్చాం. ఈ లోగా ఆధార్ వివరాలు, ఫొటోలు సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో అందజేస్తే వారి కా ర్డును పునరుద్ధరిస్తాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ కోటా నిలిపివేశాం. ఆధార్ అప్లోడ్ విషయంలో తహసీల్దార్లు మరింత శ్రద్ధ వహించాలి. సాధ్యమైనంత త్వరగా అధార్ వివరాలు నమోదు చేయాలి. బోగస్‌కార్డులు పూర్తిగా ఏరివేసేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. - ఉషారాణి, డీఎస్ఓ -
ఈ‘సారీ’ కూపన్లే..
- శాశ్వత కార్డులు లేనట్లేనా..? - మరో మూడు నెలలు కూపన్లతోనే రేషన్ - జిల్లాకు చేరిన 42,251 కూపన్లు కలెక్టరేట్ : జిల్లాలోని రచ్చబండ రేషన్ కూపన్ దారులకు శాశ్వత రేషన్‌కార్డులు అందని ద్రాక్షగా మారాయి. లబ్ధిదారులకు శాశ్వత తెల్లకార్డులను ఇప్పట్లో జారీ చేసే యోచన లో ప్రభుత్వం లేనట్లుగా తెలుస్తోంది. గత ప్రభుత్వం రచ్చబండ ద్వారా రేషన్ కూపన్లు అందించి సరుకులు తీసుకునేలా వీలు కల్పించింది. 2013 నవంబర్‌లో ఆరు నెలలకు సరిపడా కూపన్లు జారీ చేసింది. ఆ కూపన్లు మే నెలతో ముగిశాయి. జూన్ నెలకు సరుకులు తీసుకునేందుకు కూపన్లు లేకపోవడంతో తాత్కాలిక కార్డుదారులకు అధికారుల ఆదేశాల మేరకు డీలర్లు సరుకులు పంపిణీ చేశారు. ఇక జూలై, ఆగష్టు, సెప్టెంబర్ మూడు నెలలకు సరిపడా 42,251 కూపన్లు శనివారం జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయానికి చేరాయి. జిల్లాకు 42,251 కూపన్లు.. జిల్లాకు 42,251 రేషన్ కూపన్లు వచ్చాయి. వీటి ద్వారా మూడు నెలలు చౌకధరల దుకాణాల ద్వారా సరుకులు పొందవచ్చు. మూడు నెలలకు సరిపడా కూపన్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి జిల్లాకు చేరాయి. వీటిని ఆయా మండలాలకు పంపిణీ చేశారు. త్వరలో ఈ కూపన్లు రచ్చబండ కార్డుదారులకు ఇవ్వనున్నారు. సోమవారం జిల్లా సంయుక్త కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూపన్లకు సంబంధించిన అంశాలపై ఆయా మండలాల అధికారులు, డీలర్లతో చర్చించనున్నారు. డీలర్లు, అధికారులు సమావేశానికి హాజరుకావాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. కూపన్లు తీసుకునే వారు రూ.5 చెల్లించి తీసుకోవాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. -
కూపన్లు క్లోజ్
మిర్యాలగూడ :గత ఏడాది డిసెంబర్లో నిర్వహించిన మూడవ రచ్చబండ కార్యక్రమంలో అర్హులైన వారికి ఫొటోలు లేకుండా టెంపరరీ రేషన్ కార్డులు జారీ చేశారు. వాటితో పాటే లబ్ధిదారులు రేషన్ సరుకులు పొందేందుకు కూపన్లు పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం పది లక్షల తెల్ల రేషన్ కార్డులున్నాయి. వాటిలో 2013 డిసెంబర్లో నిర్వహించిన మూడవ విడత రచ్చబండ కార్యక్రమంలో జారీ చేసిన టెంపరరీ కార్డులు 66వేలు. టెంపరరీ కార్డులు పొందిన వారంతా ఇప్పటివరకు వాటితోనే కాలం గడుపుతూ వచ్చారు. అవి కేవలం రేషన్ దుకాణంలో సరుకులు తీసుకెళ్లడానికే తప్ప ఇతర ఏ విషయానికీ పనికిరావడం లేదు. ఈ నెలతో పూర్తయిన కూపన్లుగత ఏడాది మూడవ రచ్చబండ కార్యక్రమంలో టెంపరరీ రేషన్ కార్డులు జారీ చేసిన లబ్ధిదారుల వద్ద కూపన్లు పూర్తయ్యాయి. టెంపరరీ రేషన్ కార్డులతో పాటు 2013 డిసెంబర్ నుంచి 2014 జూన్ వరకు కూపన్లు జారీ చేశారు. కాగా ఈ నెలతో లబ్ధిదారుల వద్ద ఉన్న కూపన్లు పూర్తయ్యాయి. కొత్త ప్రభుత్వం తిరిగి కూపన్లు జారీ చేస్తుందా? లేదా? అని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. టెంపరరీ కార్డులతో ఇక్కట్లు పేదవర్గాలకు చెందిన వారు తెల్లరేషన్ కార్డులకు అర్హులైనప్పటికీ మూడవ రచ్చబండ కార్యక్రమంలో టెంపరరీ కార్డులు జారీ చేశారు. వీరంతా రెండవ రచ్చబండ కార్యక్రమంలో దరఖాస్తులు చేసుకోగా జిల్లా వ్యాప్తంగా 65,962 కుటుంబాలను అర్హులుగా గుర్తించారు. కానీ కేవలం 43వేల మంది నుంచి మాత్రమే రెవెన్యూ అధికారులు ఫొటోలు సేకరించారు. అయినా ఫొటోలు లేకుండానే లబ్ధిదారుల పేర్లతో టెంపరరీ కార్డులు జారీ చేశారు. దీంతో టెంపరరీ రేషన్ కార్డులు కేవలం రేషన్ దుకాణం వద్ద తప్ప ఎక్కడా పనికి రావడం లేవు. దీంతో లబ్ధిదారులు ఇక్కట్లకు గురవుతున్నారు. కొత్త ప్రభుత్వంలోనైనా అర్హులైన వారికి టెంపరరీ కార్డుల స్థానంలో శాశ్వత కార్డులు జారీ చేస్తారేమో వేచి చూడాలి. -
ఇందిరమ్మకు యాక్షన్ ప్లాన్
ఫిబ్రవరి నెలాఖరులోగా 13,606 పూర్తికి లక్ష్యం రచ్చబండలో మంజూరైన ఇళ్లను కూడా గ్రౌండింగ్‌కు చర్యలు త్వరలో హౌసింగ్, బ్యాంక్, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. శాఖల మధ్య సమన్వయలోపంతో లబ్ధిదారులను ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేల సంఖ్యలో ఇళ్లు నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఏళ్ల క్రితం మంజూరైన గృహాలు ఇప్పటికీ పునాదులకు కూడా నోచుకోలేదు. దీంతో వచ్చే నెలాఖరులోగా నిర్మాణ దశలో ఉన్న వాటిని పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ నిర్ణయించారు. త్వరలోనే గృహ నిర్మాణ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ విషయంపై లక్ష్యాలను నిర్ధేశించనున్నారు. జిల్లాలో ఇందిరమ్మ పథకంలో భాగంగా 2006 నుంచి ఇప్పటి వరకు 3,78,440 గృహాలు మంజూరయ్యాయి. వీటిలో 3,11,870 ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. ఇంకా 66,570 గృహాల నిర్మాణాలను ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటి వరకు 2,73,966 నిర్మాణాలు పూర్తయ్యాయి. సమన్వయ లోపమే సమస్య శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ‘ఇందిరమ్మ’ లక్ష్యాలను సాధించలేకపోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇళ్లను గ్రౌండ్ చేయాలంటే తప్పని సరిగా రెవెన్యూ అధికారులు ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్ (ఎల్పీసీ) ఇవ్వాల్సి ఉంది. అయితే ఎల్పీసీ మంజూరు విషయంలో తీవ్రజాప్యం జరుగుతున్న కారణంగా నిర్మాణాలను ప్రారంభించలేకపోతున్నామని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. అలాగే బ్యాంకు ఖాతాలకు సంబంధించి సమస్యలు కూడా ఉండడంతో మరింత జాప్యం జరుగుతోందని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన కలెక్టర్ బ్యాంకర్లు, రెవెన్యూ, హౌసింగ్ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ప్రధానంగా ఎల్పీసీల సమస్య పరిష్కారంపై చర్యలు తీసుకోనున్నారు. అలాగే హౌసింగ్ కార్యాలయంలో కూడా ఎల్పీసీల విషయంలో రెవెన్యూ అధికారులతో మంగళవారం చర్చించనున్నారు. పూర్తయ్యేదెప్పుడు? జిల్లాలో ప్రస్తుతం 37,904 గృహాలు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో బేస్మెంట్ పూర్తయినవి 15,229, బేస్మెంట్ స్థాయిలో 3,647, లింటల్ స్థాయి పూర్తయినవి 5,422, రూఫ్ స్థాయిలో 13,606 ఉన్నాయి. ఫిబ్రవరి నెలాఖరులోగా ముందుగా రూఫ్ స్థాయిలో ఉన్న వాటినైనా పూర్తి చేసేందుకు కలెక్టర్ కార్యాచరణ రూపొందించనున్నారు. అలాగే ఏజెన్సీలో 8 వేల ఇళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటికి ఆస్బెస్టాస్ రేకులు అందుబాటులో లేకపోవడంతో నిర్మాణాలలో జాప్యం జరుగుతోంది. ఆ విషయాన్ని కలెక్టర్ హౌసింగ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వీటితో పాటు రచ్చబండలో వచ్చిన దరఖాస్తుదారులకు మంజూరైన 34,523 గృహాలను కూడా వీలైనంత త్వరగా గ్రౌండింగ్ చేసేందుకు కలెక్టర్ హౌసింగ్ అధికారులకు లక్ష్యాలను నిర్ధేశించనున్నారు. -
కూపన్లు సరే.. రేషన్ ఏదీ?
తెనాలి అర్బన్, న్యూస్‌లైన్ :అర్హులందరికీ సంక్షేమ పథకాలు..రేషన్ కార్డులు, పింఛన్లు ఇలా ఒకటేమిటీ అన్నీ ఇచ్చేస్తామంటూ రచ్చబండలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఊదరగొట్టారు. ఆచరణలో కార్యరూపం దాల్చకపోవడంతో లబ్ధిదారులు లబోదిబో మంటున్నారు. పేదలకు సంక్షేమ పథకాలంటూ ఇప్పటికి మూడువిడతలుగా ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమం నిర్వహించింది. మూడో విడతలో జిల్లా వ్యాప్తంగా 62వేల మందికి రేషన్ కూపన్లు పంపిణీచేశారు. రెండో విడత రచ్చబండలో స్వీకరించిన 77 వేల రేషన్‌కార్డుల దరఖాస్తులకుగాను ఈ మొత్తాన్ని పంపిణీ చేయగా, మరో 15 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. డిసెంబర్ నుంచి వచ్చే జూన్ వరకు ఈ కూపన్లను లబ్ధిదారులకు అందించారు. ఈ కూపన్లు పట్టుకుని లబ్ధిదారులు డీలర్ల చు ట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. డిసెంబర్ నెలకు సంబంధించి వీరికి ఇప్పటివరకు రేషన్రాలేదు. ఎప్పుడు వస్తుందన్నదీ డీలర్లు కూడా చెప్పలేకపోతున్నారు. అడ్రస్ ఒక ఊరిలో.. రేషన్ షాపు మరో ఊరిలో.. తొలివిడత రచ్చబండలో స్వీకరించిన రేషన్‌కార్డుల దరఖాస్తులకు రెండోవిడత రచ్చబండలో కూపన్లు పంపణీచేశారు. వీటిలో అన్నీ తప్పుల తడకలే. లబ్ధిదారు అడ్రస్ ఒక గ్రామంలో ఉంటే, వారికి కేటాయించిన రేషన్ షాపు మరో గ్రామంలో ఉంది. తెనాలి మండల పరిధిలోని హాఫ్‌పేట, కొలకలూరు గ్రామాల్లో జరిగిన గందరగోళం నిదర్శనంగా చెప్పవచ్చు. రెండో విడత రచ్చబండలో పంపిణీ చేసిన కార్డుల్లో హాఫ్పేటకు చెందిన 40 మంది కార్డులకు కొలకలూరు షాపు నంబరు, మూడో విడతలో 37 కార్డులకు ఖాజీపేట షాపును కేటాయించారు. రెండో విడతలో పంపిణీచేసిన వాటిలో కొలకలూరుకు చెందిన 15, మూడోవిడతలో పంపిణీ చేసినవాటిలో 20 కార్డులకు హాఫ్‌పేట షాపును కేటాయించారు. వీటిని యథాస్థానాలకు మార్చాలని తహశీల్దార్‌ను కోరారు. ప్రజావాణిలో అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేదు. రేషన్ పంపిణీలో జాప్యం వాస్తవమే రేషన్ కేటాయింపుల్లో జాప్యం జరగుతున్న మాట వాస్తవమే. పాతకార్డుల లబ్ధిదారులకు మరో నాలుగురోజుల్లో రేషన్ అందే అవకాశం ఉంది. కొత్త కూపన్లకు సంబంధించి కేటాయింపుల అంచనాలు డీఎస్వోకు పంపాం. అవి కమిషనర్ ఆమోదం పొందిన తదుపరి రేషన్ కేటాయింపులు జరుగుతాయి. కొంచెం సమయం పడుతుంది. -మల్లన్న, తెనాలి డివిజన్ ఏఎస్వో -
వైఎస్ మరణంతో ఆగినఅభివృద్ధి : గడికోట శ్రీకాంత్‌రెడ్డి
మహానేత వైఎస్ మరణంతో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాయచోటి రచ్చబండ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గడికోట మాట్లాడుతూ రచ్చబండ కార్యక్రమం రూపకర్త కూడావైఎస్సే అన్నారు. వైఎస్ ఫొటో వేదికపై లేకపోవడం బాధాకరమన్నారు. రాయచోటి ప్రజల సౌకర్యార్థం 50 పడకల ఏరియా ప్రభుత్వాసుపత్రిని వందపడకల ఆసుపత్రిగా మార్చాలని కోరారు. రింగురోడ్డును నాలుగులైన్ల రహదారిగా తీర్చిదిద్దాలన్నారు. నియోజక వర్గానికి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల, మహిళా ఉర్దూ డిగ్రీకళా శాల, ప్రభుత్వ ఐటి ఐ, ప్రభుత్వ ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
కిరణ్ రచ్చబండలో కనిపించని స్పందన
సాక్షి ప్రతినిధి, కడప,/రాయచోటి న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాయచోటిలో సోమవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి జనం వచ్చారే కానీ.. వారి నుంచి స్పందన మాత్రం ఆశించిన మేరకు లేదనే చెప్పవచ్చు. ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సుమారు రూ.97.37కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రభుత్వ కార్యక్రమం కావడంతో డ్వాక్రా మహిళలు, ఇతర లబ్ధిదారులతో సభా ప్రాంగణం నిండిపోయింది. అంతవరకు బాగానే ఉన్నా సభచప్పగా సాగింది. ముఖ్యమంత్రి కిరణ్ సభా ప్రాంగణానికి ఉదయం 11.45గంటలకు చేరుకున్నారు. మధ్యాహ్నం 1గంటకు రచ్చబండను ముగించారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడుపుతున్నామని, విపత్కర పరిస్థితుల నుంచి బయటపడ్డామని కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పుకున్నా ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభించలేదు. సీఎం కిరణ్ తన ప్రసంగం మొదలుపెడుతునే ఎమ్మెల్యే వీరశివాను సీనియర్ మంత్రివర్యులు వీరశివారెడ్డి అని సంబోధించారు. ప్రభుత్వ కార్యక్రమమైనప్పటికీ కాంగ్రెస్‌పార్టీ బహిరంగసభలాగ కొనసాగింది. తాను మీ పొరుగు నియోజకవర్గ వాసినని, మీ ప్రాంతంలో తమ ఆడబిడ్డలు ఉన్నారని చెప్పుకున్నా సభికుల నుంచి ఉత్సాహం కనిపించలేదు. వైఎస్ఆర్ పేరు చెప్పగానే హర్షధ్వానాలు : రచ్చబండ రూపకర్త, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఎవరు ఉచ్చరించినా సభలో హర్షధ్వానాలు వెల్లివిరిశాయి. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మొదలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు వైఎస్ పేరు ఎత్తగానే ఈలలు, కేకలు వేస్తూ ఆనందోత్సాహాలను ప్రదర్శించారు. రచ్చబండ బ్యానర్‌పై రాజశేఖరరెడ్డి ఫొటో లేకపోవడం, సమైక్యాంధ్ర కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ నేతల మద్దతు కూడగడుతున్న విషయాన్ని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తెలియజెప్పిన సందర్భంలో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. మంత్రి సీఆర్సీ సుతిమెత్తని విమర్శలు : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమంలో క్రికెటర్ సచిన్ టెండూల్కర్ లాగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు రాంప్రసాద్‌రెడ్డి నుంచి తులసిరెడ్డి వరకు పొగడ్తలతో ముంచెత్తారు. అయితే దేవాదాయ శాఖా మంత్రి సి.రామచంద్రయ్య తన ప్రసంగంలో క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రిటైర్డ్ అయ్యారని కిరణ్‌కుమార్‌రెడ్డి అలా రిటైర్డ్ కారాదన్నారు. సమైక్యాంధ్ర కోసం కెప్టెన్‌గా వ్యవహరించాలని, అందరినీ కలుపుకొనిపోవాలన్నారు. శ్రీకాంత్‌రెడ్డి మొదలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు వైఎస్ పేరు ఎత్తగానే ఈలలు, కేకలు వేస్తూ ఆనందోత్సాహాలను ప్రదర్శించారు. రచ్చబండ బ్యానర్‌పై రాజశేఖరరెడ్డి ఫొటో లేకపోవడం, సమైక్యాంధ్ర కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ నేతల మద్దతు కూడగడుతున్న విషయాన్ని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తెలియజెప్పిన సందర్భంలో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. మంత్రి సీఆర్సీ సుతిమెత్తని విమర్శలు : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమంలో క్రికెటర్ సచిన్ టెండూల్కర్ లాగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు రాంప్రసాద్‌రెడ్డి నుంచి తులసిరెడ్డి వరకు పొగడ్తలతో ముంచెత్తారు. అయితే దేవాదాయ శాఖా మంత్రి సి.రామచంద్రయ్య తన ప్రసంగంలో క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రిటైర్డ్ అయ్యారని కిరణ్‌కుమార్‌రెడ్డి అలా రిటైర్డ్ కారాదన్నారు. సమైక్యాంధ్ర కోసం కెప్టెన్‌గా వ్యవహరించాలని, అందరినీ కలుపుకొనిపోవాలన్నారు. పొగడ్తలతో ముంచెత్తిన తులసీ : రాయచోటి రచ్చబండలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని పొగిడేందుకే కాంగ్రెస్ నేతలు ప్రాధాన్యత ఇచ్చారు. 20సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ తులసీరెడ్డి ముఖ్యమంత్రి మూడేళ్ల కాలాన్ని తన ప్రసంగంతో ఆకట్టుకునే యత్నాన్ని చేశారు. సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తున్న యోధుడిగా కిరణ్‌కుమార్‌రెడ్డిని వర్ణించారు. -
సీఎం కిరణ్ మంచి కెప్టెన్ కావాలి: రామచంద్రయ్య చురక
వైఎస్సార్ జిల్లా: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మంచి ఆటగాడే కానీ, మంచి కెప్టెన్‌గా తాను చూడాలనుకుంటున్నట్లు రాష్ర్ట దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య తెలిపారు. రాష్ట్ర్నాన్ని యథావిధిగా ఉంచేందుకు సీఎం అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ జిల్లా రాయచోటిలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో రామచంద్రయ్య ప్రసంగించారు. సీఎం కిరణ్ మంచి ప్లేయర్‌గా ఉన్నాడని, మంచి కెప్టెన్ గా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. సీఎం అందరినీ సమన్వయం చేసుకుని ముందుకెళ్లినపుడే మంచి కెప్టెన్ కాగలడని రామచంద్రయ్య చురకలంటించారు. అంతకుముందు సీఎం కిరణ్ మాట్లాడుతూ..స్వార్థపరులు తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాల్లో సమస్యలున్నాయన్నారు. అయితే వాటి పరిష్కారం కోసం విభజన చేయడం సరికాదని తెలిపారు. -
రేపు ముఖ్యమంత్రి జిల్లా పర్యటన
చిత్తూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో ఆదివారం పర్యటించనున్నట్లు కలెక్టర్ రాంగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి ఆది వారం మధ్యాహ్నం 1 గంటకు అనంతపురం జిల్లా నుంచి బయలుదేరి 2.30 గంటలకు వి.కోటకు చేరుకుంటారు. వి.కోట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన రచ్చబండలో పాల్గొంటారు. సాయంత్రం 4.40 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 4.50 గంటలకు హెలిప్యాడ్ చేరుకుంటారు. 5 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 5.30 గంటలకు కలికిరి చేరుకుంటారు. తర్వాత 5.40 గంటలకు పీలేరు ప్రాంత అభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 6.10 గంటలకు స్వగ్రామం నగిరిపల్లెకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. సోమవారం ఉదయం 10 గంటలకు కలికిరి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వైఎస్ఆర్ జిల్లా రాయచోటికి చేరుకుంటారు. అక్కడ రచ్చబండ సభల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు రేణిగుంటకు చేరుకుని భోజన విరామానంతరం 2.30 గంటలకు రాష్ర్ట రాజధాని హైదరాబాద్‌కు బయలుదేరుతారు. -
సీఎం ఫ్లెక్సీపై ఆందోళన
ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఉట్నూర్‌లో సోమవారం నిర్వహించిన మూడో విడత రచ్చబండ కార్యక్రమానికి నిరసనల సెగ తగి లింది. తెలంగాణవాదుల నిరసనలతో సభ రచ్చరచ్చ గా మారింది. స్థానిక స్టార్ ఫంక్షన్ హాల్లో రచ్చబండ కార్యక్రమం ప్రారంభమైంది. సమైక్యవాదిగా వ్యవహరి స్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్లెక్సీ తొలగించాలని టీజేఏసీ మండల కన్వీనర్ మర్సకోల తిరుపతి, టీఆర్ఏస్వీ నియోజకవర్గ ఇన్చార్జి ధరణి రాజేశ్, జిల్లా కార్యదర్శి కందుకూరి రమేశ్, నాయకులు కాటం రమేశ్, సెడ్మాకీ సీతారాం, సీపతి లింగాగౌడ్ డిమాండ్ చేస్తూ సభను అడ్డుకున్నారు. సీఎం ఫ్లెక్సీపై తెల్లబట్ట కప్పారు. కార్యక్రమానికి హాజరైన ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్ సీఎం ఫ్లెక్సీకి వేసిన ముసుగు తొలగించాలని అధికారులను ఆదేశించారు. వారు తొలగించేందుకు యత్నించగా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పీవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేదిక ముందు బైఠారుుంచారు. కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని హెచ్చరించారు. దీంతో పోలీసులు, నాయకులకు మధ్య తోపులాట జరిగింది. చివరికి నాయకులను పోలీసులు బయటకు పంపించడంతో అధికారులు ఫ్లెక్సీకి వేసిన ముసుగు తొలగించి కార్యక్రమం ప్రారంభించారు. తప్పులు సరిచేస్తున్నం.. రేషన్‌కార్డుల్లో వయసు తక్కువగాపడడంతో చాలామంది అర్హులు పింఛన్లకు దూరం అవుతున్నారని, వయసు నిర్ధారణకు ఐటీడీఏ ద్వారా శిబిరాలు నిర్వహించామని పీవో జనార్దన్ నివాస్ పేర్కొన్నారు. సుమారు ఆరు వేల మంది శిబిరాలకు హాజరవగా వెరుు్య కార్డుల్లో వయసు వివరాలు సరి చేశామని తెలిపారు. ఇకపై అలాంటి పొరపాట్లను మీ సేవ కేంద్రాల ద్వారా సరి చేసుకోవాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని మారుమూల పల్లెల్లో రోడ్ల సౌకర్యానికి గిరిజన ఉప ప్రణాళిక ద్వారా కృషి చేస్తామని చెప్పారు. పీవో మాట్లాడుతుండగా టీఆర్ఎస్ నాయకులు సీఎం ఫ్లెక్సీ తొలగించాలని నినాదాలు చేశారు. ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ మాట్లాడుతూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడాలన్నారు. సమైక్యవాదిగా వ్యవహరిస్తూ ఇరు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ముఖ్యమంత్రి యత్నిస్తున్నారని ఆరోపించారు. రేషన్‌కార్డులు.. పింఛన్లు.. మండలంలో 130 మందికి బంగారు తల్లి ప్రోత్సాహక బాండ్లు, 1360 మందికి రేషన్‌కార్డులు, 258 మందికి పింఛన్లు, 497 మందికి ఇందిరమ్మ గృహ మంజూరు పత్రాలు అందించారు. ఎస్సీ, ఎస్టీల్లో 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్న వారికి బిల్లుల మాఫీలో భాగంగా 1004 ఎస్సీ, 1370 ఎస్టీ కుటుంబాలకు బిల్లులు మాఫీ చేసిన పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రామచంద్రయ్య, జిల్లా అదనపు వైద్యాధికారి ప్రభాకర్‌రెడ్డి, డీఎంవో అల్హం రవి, మండల ప్రత్యేకాధికారి అక్రముల్లాఖాన్, ఈజీఎస్ ఏపీడీ అనిల్ చౌహాన్, ట్రాన్స్‌కో ఏఈ రవి, హౌసింగ్ ఏఈ విశాల్, తహశీల్దార్ చిత్రు, ఇన్చార్జి ఏంపీడీవో రమాకాంత్‌రావు, రచ్చబండ కమిటీ సభ్యులు భరత్ చౌహాన్, ఇక్బాల్, జాడి మల్లయ్య, సర్పంచులు బోంత ఆశారెడ్డి, అశోక్, మాణిక్‌రావు, హరినాయక్ విమలాబాయి, భాగీర్తా, అంకవ్వ, నాయకులు నారాయణరెడ్డి, కాలం రవీందర్, లింగమ్మ పాల్గొన్నారు. -
రసాభాసగా యాచారం రచ్చబండ
యాచారంలో సోమవారం నిర్వహించిన రచ్చబండ.. రచ్చరచ్చగా మారింది. తెలంగాణవాదులు నిరసనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వేదికపై సీఎం ఫొటోతో ఉన్న ఫ్లెక్సీని తెలంగాణవాదులు చింపేశారు. ఇదిలాఉంటే అర్హులైన వారికి పింఛన్లు మంజూరుకాలేదని వికలాంగులు సైతం ఆందోళనకు దిగారు. దీంతో సభా ప్రారంభంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఆందోళనలతో కాసేపు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. తేరుకున్న పోలీసులు ఆందోళకారులను అరెస్టు చేయడంతో సభ మళ్లీ ప్రారంభమైంది. - న్యూస్‌లైన్, యాచారం యాచారం, న్యూస్‌లైన్: యాచారంలోని ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం మూడో విడత రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితోపాటు వివిధ శాఖల అధికారులు వేదికపై కూర్చున్నారు. మండల పరిషత్ పర్యవేక్షకుడు కోటేశ్వర్రావు ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. అంతలోనే వివిధ రాజకీయ పక్షాల, ప్రజాసంఘాల నాయకులు వేదికపైకి ఎక్కారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్లెక్సీని చించేశారు. దీంతో ఆందోళనకారులను కిందకు దించేందుకు, ఫ్లెక్సీని లాక్కొనేందు కు సీఐ రాములు, పోలీసులు యత్నించారు. రచ్చబండను అడ్డుకోవడంలేదని.. తెలంగాణ వ్యతిరేకి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్లెక్సీని వేదికపై ఉంచవద్దంటూ... నిరసనకారులు ఫ్లెక్సీని పూర్తిగా చిం పేశారు. ఈ దశలో ఆందోళనకారులు జై తెలంగాణ నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి ఏ ర్పడింది. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కొప్పు బాషా, మాల మహానాడు జిల్లా నాయకుడు నారిమల్ల యాదయ్య తదితరులను పోలీసులు అరెస్టుచేసి పీఎస్‌కు తరలించారు. ఆ తర్వాత సభ ప్రారంభమై వివిధ శాఖల అధికారులు మాట్లాడారు. సభావేదిక ఎదుట బైఠాయించిన వికలాంగులు ఇంతలోనే వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ కాళ్ల జంగయ్య కొంతమంది వికలాంగులతో కలిసి ఆందోళనకు దిగారు. అర్హులైన వికలాంగులకు పింఛన్లు మంజూరు కాకపోవడంతోపాటు, ప్రభుత్వం 140 మంది వికలాంగులకు రూ.500 పింఛన్లు రద్దు చేసిందని ఆరోపిస్తూ సభావేదిక ఎదుట బైఠాయిం చారు. ఈ క్రమంలోనే వికలాంగులు ఒక్కొక్కరుగా సభా వేదికపైకి చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వారిని కూడా పోలీసు లు అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. ఆందోళనను గమనించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి.. తెలంగాణలో నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతున్న దృష్ట్యా పోలీసులు అప్రమత్తతంగా లేకపోవడంపై అసంతృష్తి వ్యక్తం చేశారు. సభ చివరలో కూడా లబ్ధిదారులు మంజూరు పత్రాలను అందుకునే సమయంలోనూ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అధిక సంఖ్యలో లబ్ధిదారులు వేదికపైకి చొచ్చుకొని రావడంతో అక్కడేం జరుగుతోం దో అంతుచిక్కలేదు. దీంతో అప్పటివరకు కుర్చీల్లో కూర్చున్న లబ్ధిదారులు ఒక్కసారిగా లేవడంతో సభావేదిక గందరగోళంగా మారింది. పథకాల కూపన్ల పంపిణీలోనూ నింబంధనలు పాటిం చకపోవడంతో లబ్ధిదారులు పోటీపడ్డారు. ఒక దశలో తొక్కిసలాటకు దారి తీసింది. అంతకుముందు సభా వేదికపైకి ఇబ్రహీంపట్నం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్నాథ్‌రెడ్డిని పిలవడంతో తాము కూడా వేదికపైకి వస్తామని మిగతా రాజకీ య పక్షాల నాయకులు ఆందోళన చేశారు. దీంతో గుర్నాథ్రెడ్డి కిందకు దిగడంతో శాంతించారు. లబ్ధిదారులకు అర్హత కూపన్ల పంపిణీ సక్రమంగా లేదని సీపీఏం నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
నేడు మరోసారి జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి
సాక్షి ప్రతినిధి, కాకినాడ : భారీ వర్ష బాధితులను పరామర్శించేందుకు పక్షం రోజుల కిందటే జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రచ్చబండలో పాల్గొనేందుకు మళ్లీ నేడు జిల్లాకు వస్తున్నారు. ఆయన క్రితంసారి బాధితులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదు. ‘మాటలు కోటలు దాటినా చేతలు గడప దాటని’ చందంగా ముఖ్యమంత్రి ఏం చెప్పినా తమకు మేలు జరగలేదని బాధితులు నిష్టూరమాడుతున్నారు. ఈసారైనా ఆయన మాటలు చేతలుగా మారాలని ఆశ పడుతున్నారు. భారీ వర్షాలతో జిల్లాలో వరి, పత్తి, ఉల్లి, కూరగాయల రైతులకు, చేనేత, మత్స్యకార వర్గాలకు నష్టం వాటిల్లింది. ఇళ్లు నేలమట్టమై రోడ్డునపడ్డ కుటుంబాలు మూడువేలకు పైనే ఉన్నాయి. కళ్లెదుటే సర్వం కోల్పోయినా అంచనాలు, అధ్యయనాలు అంటూ సర్కార్ కనికరం చూపలేదు. ఇళ్లు కూలిపోయిన కుటుంబాలకు ఇంతవరకు చిల్లిగవ్వ ఇవ్వలేదు సరికదా ప్రజాపంపిణీ ద్వారా కేజీ బియ్యం కూడా విదిల్చే మానవత్వం ప్రభుత్వానికి లేకుండా పోయిందని బాధిత కుటుంబాలు విలపిస్తున్నాయి. మండల స్థాయిలో దెబ్బతిన్న ఇళ్లు లెక్క తేల్చినా పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. ఇక వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి చేతికొచ్చిన పంట చేలల్లోనే కుళ్లిపోగా కొందరు రైతులు ఆత్మహత్యలకు సిద్ధపడుతున్నారంటే జిల్లాలో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెపుతోంది. ఇవీ క్రితం సారి కిరణ్ హామీలు.. నష్టపోయిన రైతులను పలకరించేందుకు జిల్లాకు వచ్చిన సీఎం గొల్లప్రోలులో మాట్లాడుతూ అనేక హామీలు గుప్పిం చారు. ఇళ్లు దెబ్బతిన్న వారికి తక్షణ సాయంగా దుస్తులు, వంటపాత్రలకు ఇచ్చే సాయాన్ని మూడు వేల నుంచి ఐదువేలకు పెంచామన్నారు. మగ్గాలు దెబ్బతిన్న చేనేత కుటుంబాలకు ఐదువేలు ఇస్తామన్నారు. నూలు, ఇతర రసాయనాల విలువను బట్టి మరో ఐదు వేలు తక్షణం ఇస్తామని ఉదారంగా ప్రకటించారు. అయితే పక్షం రోజులైనా బాధితులకు ప్రభుత్వం నుంచి చిల్లిగవ్వ రాలేదు. వంట పాత్రల మాట దేవుడెరుగు కనీసం కిరోసిన్ కూడా ఇవ్వలేకపోయారు. బాధితుల కోసం లక్షా 56 లీటర్ల కిరోసిన్ విడుదలచేశామని జిల్లా యంత్రాంగం లెక్కలు మాత్రం చెబుతోంది. ఒక్క బాధిత కుటుంబానికి ఒక్క లీటరు కిరోసిన్, పిడికెడు బియ్యం ఇచ్చి న దాఖలా లేదు. ఒక్క ఇంటికీ నష్టపరిహారం ఇవ్వలేదు. ఇప్పటికీ పూర్తి కాని సర్వే జిల్లాలో వరి, పత్తి, అరటి, ఉల్లి, బొప్పాయి, కూరగాయలు, పూలతోటలు అన్నీ కలిపి మూడున్నర లక్షల ఎకరాల్లోని పంట పాడైంది. వరికి ఎకరాకు పాతికవేలు పైబడి పెట్టుబడులు పెట్టిన రైతులు ముసురు మిగిల్చిన నష్టంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు అన్ని రకాల పంటలు పండించే రెండున్నర లక్షల మంది రైతులు సాయం కోసం సర్కార్ వైపు చూస్తున్నారు. కానీ జిల్లాలో నష్టం అంచనాలే ఇంకా పూర్తి కాలేదు. వాస్తవానికి ఈ నెల 16 (శనివారం) నాటికి పంట నష్టంపై సర్వే నూరుశాతం పూర్తి చేయాల్సి ఉండగా శుక్రవారం నాటికి 70 శాతం నష్టాలను మాత్రమే నమోదు చేసినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇంతవరకు సర్వే పూర్తి చేసిన భూముల్లో 38 వేల హెక్టార్లలో వరి పంట నష్టపోయినట్టు లెక్కతేలిందంటున్నారు. మొత్తం సర్వే పూర్తి చేసేందుకు మరో వారం రోజులు సమయం పడుతుందని లెక్కలేస్తున్నారు. సర్వే ఎప్పటికి పూర్తి అవుతుంది, తమకు సాయం ఎప్పటికి అందుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు బాధితులకు తక్షణ సాయం అందించే పరిస్థితి ఉండేది. కానీ ఈ సర్కారు హయాంలో తక్షణ సాయం మాట అటుంచి ఏళ్లూ పూళ్లూ పడుతుందని నీలం నష్ట పరిహారం నిర్వాకమే చాటింది. నేడు జిల్లాకు రానున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈసారైనా వట్టిమాటలు కాక గట్టిచేతలు తలపెట్టి, తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని భారీవర్ష బాధితులు ఆశిస్తున్నారు. -
20, 21 తేదీల్లో కిరణ్ జిల్లా పర్యటన
చిత్తూరు(కలెక్టరేట్),న్యూస్‌లైన్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 20, 21 తేదీల్లో ఆయన జిల్లాలో పర్యటించనున్నట్టు గురువారం కలెక్టర్ కార్యాలయూనికి సమాచారం అందింది. పలు అభివృద్ధి పనులు, పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జిల్లేళ్లమంద, వి.కోటల్లో నిర్వహించే రచ్చబండ సభల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలు ఇలా ఉన్నారుు. 20వ తేదీ ఉదయం ఆరుగంటలకు సీఎం హైదరాబాదు నుంచి బయలుదేరి 7.20 గంటలకు చెన్నై విమానాశ్రయూనికి చేరుకుంటారు. 7.40 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి వరదయ్యపాళెంకు చేరుకుంటారు. శ్రీసిటీ సెజ్‌కు చేరుకుని అధికారులతో సమావేశమవుతారు. అల్పాహారనంతరం 9 గంటలకు క్యాడ్బరీ, డెన్సీలీ ఫ్యాక్టరీలకు శంకుస్థాపన చేస్తారు. 11.10 గంటలకు శ్రీసిటీ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.50 గంటలకు తిరుపతిలోని ఎన్టీఆర్ స్టేడియం చేరుకుంటారు. తిరుపతిలో అధికార, అనధికారులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి చిత్తూరు-తిరుపతి బైపాస్‌లో ఏర్పాటు చేయనున్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 12.30 గంటలకు స్విమ్స్ చేరుకుని శ్రీపద్మావతి వైద్య కళాశాల, చిత్తూరు తాగునీటి పథకం, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. 12.50 గంటలకు తిరుపతి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 1.30 గంటలకు కేవీపల్లె మండలం జిల్లేళ్ల మందకు చేరుకుని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4.10 గంటలకు అదే మండలంలోని తూపల్లెకు చేరుకుని ఝరికోన తాగునీటి పథకానికి ప్రారంభోత్సవం చేస్తారు. 4.20 గంటలకు బయలుదేరి కలకడ మండల కేంద్రానికి చేరుకుని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు కలికిరి మండలం నరిగిపల్లెలోని ఆయన స్వగృహానికి చేరుకుని రాత్రికి అక్కడ బసచేస్తారు. 21వ తేదీ ఉదయం 10.40 గంటలకు కలికిరి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు వి.కోట చేరుకుని అధికార, అనధికారులతో సమావేశమవుతారు. 11.20 గంటలకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.50 గంటలకు వి.కోట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వైఎస్సార్ కడప జిల్లాకు వెళ్లనున్నారు. -
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
చిల్లకల్లు (జగ్గయ్యపేట), న్యూస్‌లైన్ : మండల పరిధిలోని చిల్లకల్లులో ఈ నెల 16న జరగనున్న రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హాజరు కానుండటంతో జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు అధికారులతో కలసి గురువారం ఏర్పాట్లు పరిశీలించారు. ముందుగా మండల పరిషత్ కార్యాలయం పక్కన ఉన్న సంతలో ఏర్పాటు చేస్తున్న సభావేదికను, ఎస్జీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో జరగనున్న రచ్చబండ కార్యక్రమానికి జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలతో పాటు పేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు హాజరుకావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రభాకరరావు, జాయింట్ కలెక్టర్ ఉషాకుమారి, సబ్ కలెక్టర్ దాసరి హరిచందన, వ్యవసాయ శాఖ జేడీ బాలునాయక్, డ్వామా పీడీ అనీల్ కుమార్, యువజన, క్రీడల శాఖ (కృషి) సీఈఓ శ్రీనివాసరావు, డీఆర్డీఏ పీడీ శివశంకర్, జిల్లా వైద్యాధికారి సరసిజాక్షి, జిల్లా పంచాయతీ అధికారి ఆనంద్, డీసీసీ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. సీఎం పర్యటన ఇలా.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 16న ఉదయం 10.30 గంటలకు చిల్లకల్లు రచ్చబండ కార్యక్రమానికి హాజరవుతారని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం వరకు కార్యక్రమంలో పాల్గొంటారని, అనంతరం జగ్గయ్యపేటలోని ఎస్జీఎస్ కళాశాలకు రోడ్డుమార్గాన వస్తారని చెప్పారు. అక్కడినుంచి హైదరాబాద్ వెళతారని అధికారులు తెలిపారు. -
కిరణ్ ఫోటోను దిష్టి బొమ్మలా పెట్టుకుంటున్నాం: పొన్నం
కరీంనగర్: సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై ఎంపీ పొన్నం ప్రభాకర్ మరోసారి మండిపడ్డారు. రచ్చబండ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి ఫోటోను దిష్టిబొమ్మలా పెట్టుకుంటున్నామని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజనపై మంగళవారం మాట్లాడిన పొన్నం..కిరణ్ అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. తెలంగాణలో రచ్చబండకు సీఎంను రావద్దని చెబుతున్నా ఆయన వస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎంకు నిజంగా సిగ్గు అనేది ఉంటే రచ్చబండకు రాకుండా ఉండాలని తెలిపారు. అంతకుముందు జిల్లాలోని ఇల్లెంతకుంట రచ్చబండ సభలో సీఎం ప్రసంగ పాఠవాన్ని ప్రజా ప్రతినిధులుచ అధికారులు బహిష్కరించారు. మెదక్ జిల్లాలో ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తలపెట్టిన రచ్చబండ కార్యక్రమం వాయిదా పడింది. టీఆర్ఎస్, జేఏసీ బెదిరింపులకు భయపడి కార్యక్రమాన్ని వాయిదా వేశారని విమర్శలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌లో తెలంగాణ సభ ఉన్నందునే మెదక్‌లో రచ్చబండ వాయిదా వేసినట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి తెలిపారు. ఎవరు బెదిరింపులకు భయపడి రచ్చబండను వాయిదా వేయలేదన్నారు. -
అడ్డుకుంటే అంతు చూస్తాం: జగ్గారెడ్డి
సంగారెడ్డి : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఈ నెల 13న రచ్చబండలో పాల్గొనేందుకు మెదక్ జిల్లా రానున్నారని, ఆయన పర్యటనను అడ్డుకోవాలని చూస్తే టీఆర్ఎస్ నాయకుల అంతు చూస్తామని ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. ఆయన నిన్న సంగారెడ్డిలో విలేకర్లతో మాట్లాడుతూ రచ్చబండకు సీఎంను ఆహ్వానించిన వారు తెలంగాణ ద్రోహులంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్ సైతం సీఎంను తన నియోజకవర్గంలో పర్యటించాల్సిందిగా కోరారని గుర్తు చేశారు. అప్పుడు వారు కూడా తెలంగాణ ద్రోహులేనా అని ప్రశ్నించారు. 'తెలంగాణ టీఆర్ఎస్ జాగీరా, హరీష్ రావు అబ్బ సొత్తా... మీ బాగోతం ఎవరికి తెలియదు....' అంటూ నిప్పులు చెరిగారు. రచ్చబండ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తదితరులను ఆహ్వానించినట్లు జగ్గారెడ్డి తెలిపారు. -
ఇదిగో కూపన్.. వచ్చే నెలలో రేషన్
11 నుంచి 26 వరకూ రచ్చబండలో పంపిణీ విశాఖ రూరల్, న్యూస్‌లైన్: రెండేళ్లుగా రేషన్‌కార్డులు, పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలు నెరవేరనున్నాయి. ఈ నెల 11 నుంచి జరగనున్న రచ్చబండలో కొత్త కార్డులు ఇస్తారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దరఖాస్తుదారులకు ముందుగా తాత్కాలిక రేషన్‌కార్డుతో పాటు ఏడు నెలలకు సరిపడ రేషన్ కూపన్లు ఇస్తారు. వీరికి డిసెంబర్ నెల నుంచి చౌక దుకాణాల ద్వారా సరుకులు సరఫరా చేస్తారు. అనంతరం తాత్కాలి కార్డుదారులు తమ కుటుంబ సభ్యుల ఫొటోను పౌర సరఫరా అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని ఆన్లైన్లో అపలోడ్ చేశాక కొద్ది రోజులకు శాశ్వత రేషన్‌కార్డులు వస్తాయి. అయితే ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. కాగా 2010లో నిర్వహించిన రచ్చబండలో రేషన్‌కార్డులు, పెన్షన్లు, ఇళ్ల కోసం వేలాదిమంది దరఖాస్తులు చేసుకున్నారు. వారితో పాటు ప్రజావాణి, ఇతరత్రా కార్యక్రమాల్లో వచ్చిన దరఖాస్తులను కూడా క్రోడీకరించి లబ్ధిదారుల జాబితాలను అధికారులు సిద్ధం చేశారు. దీని ప్రకారం జిల్లాలో 1,37,201 మందికి రేషన్‌కార్డులు, 31,841 మందికి పెన్షన్లు, 37,228 మందికి ఇళ్లు రానున్నాయి. వీటన్నింటినీ ఈ నెల 11 నుంచి 26వ తేదీ వరకు జరిగే రచ్చబండ కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల సమక్షంలో అందజేయనున్నారు. అలాగే డిసెంబర్ నెల నుంచే కొత్త పెన్షన్ లబ్ధిదారులకు చెల్లింపులుంటాయి. ప్రస్తుతం హౌసింగ్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి జీవో రావాల్సి ఉంది. ఇది వచ్చిన వెంటనే ఇళ్ల పట్టాలు కూడా అందించనున్నారు. -
పేదల్ని ఆదుకునేందుకే రచ్చబండ : మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
తాడేపల్లిగూడెం రూరల్, న్యూస్‌లైన్ : పేదలను ఆదుకునేందుకే రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. రచ్చబండ ఏర్పా ట్లు, జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల తీరుపై తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన విశ్వవిద్యాలయంలో శుక్రవారం జిల్లా అధికారులతో ఆయన సమీక్షిం చారు. ఈ నెల 11వ తేదీ నుంచి 26 వరకు నిర్వహించనున్న మూడో విడత రచ్చబండలో జిల్లాలోని 2 లక్షల మంది పేదలకు సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా 81 వేల మంది పేదలకు రేషన్ కూపన్లు పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో కొత్తగా 36వేల 549 వృద్ధాప్య, వితంతు, 5వేల 716 మంది వికలాంగులకు పింఛన్లు జారీ చేస్తామని చెప్పారు. 20 నుంచి 30 శాతం వరకూ అంగవైకల్యం కలిగిన వారికి రూ.200 చొప్పున అందిస్తామన్నారు. ఇప్పటివరకూ ఈ కేటగిరి కింద 34వేల 558 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. 31వేల 965 మంది పేదలకు శాశ్వత గృహ నిర్మాణపథకం కింద ఇళ్ల మంజూరు ఉత్తర్వులను అందిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నివసిస్తూ నెలకు 50 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్న 15వేల 455 మంది ఎస్సీలకు రూ.2.42 కోట్లు, 2వేల 399 మంది ఎస్టీలకు రూ.18 లక్షల విద్యుత్ రాయితీ సొమ్ము అందిస్తామని చెప్పారు. రచ్చబండ లబ్ధిదారుల జాబితాలన్నీ ఈ నెల 10 నాటికి సిద్ధం చేసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇటీవల జరిగిన పంట నష్టాలపై కలెక్టర్ సిద్ధార్థజైన్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఖరీఫ్ పంట కాలంలో 12.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని భావించామని, వరదలు, వర్షాలతో 80 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి తగ్గవచ్చని వివరించారు. రంగుమారిన ధాన్యం కొనుగోలుచేసేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ చెప్పారు. శాఖల వారీగా జరిగిన నష్టాల నివేదికను మంత్రి కన్నాకు సమర్పించారు. సమావేశంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఈలినాని, నరసాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు, జేసీ టి.బాబూరావునాయుడు, ఉద్యాన వర్శిటీ అధికారి శ్రీనివాసులు, ట్రాన్స్‌కో ఎస్ఈ టీవీ సూర్యప్రకాష్, వ్యవసాయశాఖ జేడీ వీడీవీ కృపాదాసు, ప్రణాళికా విభాగం జేడీ కె.సత్యనారాయణ, సోషల్ వెల్ఫేర్ జేడీ ఆర్.మల్లికార్జునరావు, డీఎస్వో డి.శివశంకర్ రెడ్డి, ఏలూరు ఆర్డీవో శ్రీనివాసరావు, ఉద్యాన శాఖ ఏడీ ఎస్.సుజాత పాల్గొన్నారు. -
పక్కదారి పట్టించేందుకే రచ్చబండ
సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చేందుకు మరో ఎత్తు సాక్షి, హైదరాబాద్: సమైక్య ఉద్యమం నుంచి ప్రజలు, ఉద్యోగులను పక్కదారి పట్టించేందుకే రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. నవంబరు 6వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. అయితే, ఒకవైపు భారీ వర్షాలు, పంట నష్టం.. మరోవైపు రాష్ట్ర విభజన, సమైక్య ఉద్యమం.. వీటిని ఎదుర్కోవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే రెండేళ్ల తరువాత ‘రచ్చబండ’ను తెరమీదకు తెచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2011 నవంబరులో రెండో విడత రచ్చబండను నిర్వహించారు. అప్పుడు దాదాపు 50 లక్షల దరఖాస్తులు స్వీకరించారు. వాటిలో రేషన్‌కార్డుల కోసం 19.60 లక్షలు, పెన్షన్ల కోసం 11.67 లక్షలు, గృహాల కోసం 20.23 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించిన అధికారులు 13 లక్షలకు పైగా దరఖాస్తులను తిరస్కరించారు. అర్హులైన వారి జాబితాను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. కాని రెండేళ్ల నుంచి అర్హులైన వారికి లబ్ది చేకూర్చడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. దాంతో గత రెండేళ్లుగా దరఖాస్తులు ఇచ్చిన ప్రజలంతా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. ఆ దరఖాస్తులను పరిష్కరించకుండా రెండేళ్లపాటు కాల యాపన చేసిన ప్రభుత్వ పెద్దలకు పేద ప్రజలపై హఠాత్తుగా ప్రేమ పుట్టుకు వచ్చిందన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లోకి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్న అధికార పార్టీ నాయకులు.. ఈ కార్యక్రమాన్ని అడ్డుపెట్టుకుని ముందుకు వెళ్లాలనుకుంటున్నారని పలువురు భావిస్తున్నారు. పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలకు ముందు రచ్చబండ నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే, అనుకోకుండా జూలై 30 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన, తదనంతరం సీమాంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమం రావడం తెలిసిందే. 13 జిల్లాల్లోని ఉద్యోగులంతా రెండునెలలకు పైగా నిరవధిక సమ్మె చేయడంతో పాలన స్తంభించిపోయింది. క్రమంగా ఒక్కో సంఘాన్ని సమ్మె నుంచి విరమించేలా ఒత్తిడి తీసుకుని వచ్చి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చారు. ఇప్పుడా ఉద్యమాన్ని పూర్తిగా పక్కదారి పట్టించడానికి, రాబోయే ఎన్నికల్లో లబ్ది పొందడానికి రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను ఏదో విధంగా తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో మూడో రచ్చబండ కార్యక్రమానికి తెరలేపారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఉపసంఘం భేటీ రచ్చబండ నిర్వహణకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం గురువారం సమావేశమైంది. వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ అధ్యక్షతన మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, బొత్స సత్యనారాయణ, రఘువీరారెడ్డి, పార్ధసారథి, వట్టి వసంతకుమార్, డికె ఆరుణ తదితరులు కార్యక్రమాన్ని రూపొం దించారు. అనంతరం కన్నా లక్ష్మినారాయణ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి వద్దకు వెళ్లి రచ్చబండ తేదీలను ఖరారు చేశారు. నవంబర్ ఆరు నుంచి 24వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయిం చినట్లు కన్నా లక్ష్మినారాయణ మీడియాకు తెలిపారు. -
ఎదురుచూపులే మిగిలాయి..
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: రేషన్‌కార్డులు ఇచ్చేస్తామన్నారు..పెన్షన్లు మంజూరు చేశామన్నారు.. దరఖాస్తులు స్వీకరించి 16 నెలలయింది. లబ్ధిదారుల కళ్లు కాయలు కాయలవుతున్నా సర్కారు మనసు కరగడం లేదు. రాజకీయ లబ్ధి కోసం రచ్చబండలో వీటిని పంపిణీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోంది. వాస్తవానికి ఆగస్టులో రచ్చబండ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినా సమైక్యాంధ్ర ఉద్యమంతో నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ నెలలో నిర్వహించాలనుకున్నా ఉద్యమం మరింత ఉధృతం కావడంతో ఆ పరిస్థితి కనిపించలేదు. దీంతో దరఖాస్తుదారులు ఇబ్బందు లు పడుతున్నారు. ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన రచ్చబండ-2లో జిల్లాలో లక్షల మంది నుంచి రేషన్‌కార్డులకు, వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్ల మంజూరుకు దరఖాస్తులు తీసుకుంది. వీటిని పరిశీలించిన అధికార యంత్రాంగం లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వానికి పంపినా ఇప్పటి వరకు రేషన్‌కార్డులు గాని, పెన్షన్లు గాని మంజూరు చేయలేదు. లబ్ధిదారుల ఎదురుతెన్నులు రచ్చబండ-2లో జిల్లాలో 1.10లక్షల మంది తెల్ల రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఆగస్టు 8న రచ్చబండ నిర్వహించి రేషన్కూపన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు జూలై 31లోగా లబ్ధిదారుల జాబితాను సమర్పిస్తే కూపన్లు ముద్రించి జిల్లాకు పంపిస్తామని తెలిపింది. ఆ మేరకు పౌరసరఫరా అధికారులు లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్ ద్వారా ఆ శాఖ కమిషనర్‌కు పంపించారు. అయితే ఇప్పటికీ కూపన్ల ముద్రణ జరగలేదు. ఈ పరిస్థితుల్లో ఈ నెలలో రేషన్‌కార్డులు వచ్చే అవకాశాలు లేనట్లే. అలాగే పింఛన్ల కోసం సుమారుగా 34,292 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరి జాబితాను కూడా అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. వీటన్నింటినీ ఈ నెలలోనే పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ సమైక్యాంధ్ర ఉద్యమాల నెపంతో మరోసారి వాయిదా వేసింది. మున్సిపల్, పురపాలక ఎన్నికలు లేదా సాధారణ ఎన్నికలకు ముందు మాత్రమే రేషన్‌కార్డులు, పెన్ష న్లు లబ్ధిదారులకు అందే అవకాశమున్నట్టు తెలిసింది. ప్రస్తు తం ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవడంతో వీరు ఇప్పట్లో వీటి కోసం ఇంకా ఎదురుచూపులు తప్పని పరిస్థితే ఉంది -
కోత పెట్టి.. కొత్తగా!
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: ఎన్నికల పుణ్యమా! అంటూ గతంలో కోత పెట్టిన పింఛన్ల ను ప్రభుత్వం తిరిగి ఇచ్చే యోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. వివిధ కారణాలు చూపి జిల్లాలో 97వేల సామాజిక పింఛన్లను రద్దుచేసిన అధికారులు వచ్చే రచ్చబండ కార్యక్రమం ద్వారా 44,830 పిం ఛన్లు మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. రేషన్‌కార్డు ఆధారంగా వయస్సు తక్కువగా ఉందని వృద్ధాప్య పింఛన్లు, సదరన్ క్యాంపులు నిర్వహించి అంగవైకల్య శాతం తక్కువగా ఉందని పిం ఛన్లను తొలగించిన విషయం తెలిసిందే. అయితే ‘బంగారు తల్లి’ పథకం అమలులో భాగంగా గురువారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కొ త్త పింఛన్లను మంజూరుచేసే విషయం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సామాన్య ప్రజల కష్టాలు తెలుసుకుని అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేస్తే ఆయన మరణానంతరం వచ్చిన సీఎంలు కె.రోశయ్య, ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డిలు గతంలో ఉన్న పలువురి పింఛన్లను తొలగించే విధంగా చర్యలు తీసుకున్నారు. బంగారు తల్లి పథకంపై ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గతంలో తిరస్కరించిన వికలాంగులందరికీ కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తామని, అదేవిధంగా వృద్ధాప్య పింఛన్లు కూడా ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తొలగించిన పింఛన్లు ఇలా.. అయితే జిల్లాలో జిల్లాలో దాదాపు 21వేల వికలాంగుల పింఛన్లు తొలగించారు. తిరిగి వారందరికీ పింఛన్లు మంజూరుకావాల్సి ఉండగా, అందులో కేవలం 2454 మంది వికలాంగులకు మాత్రమే పింఛన్లు మంజూరుచేసి చేతులు దులుపుకున్నారు. అదేవిధంగా వృద్ధాప్య పింఛన్లు దాదాపు 43 వేలు తొలగించగా కొత్తగా 25,466 పింఛన్లు మంజూరు చేశారు. వితంతువులకు సంబంధించి 33వేల పింఛన్లను తొలగించగా..వాటి స్థానంలో ప్రస్తుతం 13,491 పింఛన్లు మంజూరుచేశారు. చేనేత, కల్లు గీత కార్మికుల పింఛన్లు కూడా అరకొరగానే ఇవ్వడంతో ఆయా వర్గాలు ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్నారు. త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం సార్వత్రిక ఎన్నిలు కూడా ఆ వెంటనే వచ్చే అవకాశం ఉండటం, ఈ ఎన్నికలన్నీ కూడా పార్టీ గుర్తులపైనే జరుగుతుండటంతో కాంగ్రెస్ పార్టీలో భయం పట్టుకుంది. కాగా, ఇటీవల నిర్వహించిన సొసైటీ, సర్పంచ్ ఎన్నికలు పార్టీల రహితంగా జరగడంతో ఎక్కువ స్థానాలు తమకే వచ్చాయని ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు ప్రకటించుకుని సంబరపడిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లోనైనా పరువు దక్కించుకోవాలంటే వైఎస్ హయాంలో లబ్ధిపొందిన ప్రతి ఒక్కరికీ తిరిగి లబ్ధి చేకూర్చకపోతే ఇబ్బందులు తప్పవని భావించి ఆ మేరకు అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు. సునీతా ల క్ష్మారెడ్డి చేసిన ప్రకటనతో గతంలో పింఛన్లు కోల్పోయిన వికలాంగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.