కిరణ్ రచ్చబండలో కనిపించని స్పందన | no response in kiran kumar reddy 's racha banda program | Sakshi
Sakshi News home page

కిరణ్ రచ్చబండలో కనిపించని స్పందన

Published Tue, Nov 26 2013 2:30 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

no response in kiran kumar reddy 's racha banda program

 సాక్షి ప్రతినిధి, కడప,/రాయచోటి న్యూస్‌లైన్ :
 ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాయచోటిలో సోమవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి జనం వచ్చారే కానీ.. వారి నుంచి స్పందన మాత్రం ఆశించిన మేరకు లేదనే  చెప్పవచ్చు. ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సుమారు రూ.97.37కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.  ప్రభుత్వ కార్యక్రమం కావడంతో డ్వాక్రా మహిళలు, ఇతర లబ్ధిదారులతో సభా ప్రాంగణం నిండిపోయింది. అంతవరకు బాగానే ఉన్నా సభచప్పగా సాగింది. ముఖ్యమంత్రి కిరణ్ సభా ప్రాంగణానికి ఉదయం 11.45గంటలకు చేరుకున్నారు. మధ్యాహ్నం 1గంటకు రచ్చబండను ముగించారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడుపుతున్నామని, విపత్కర పరిస్థితుల నుంచి బయటపడ్డామని కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పుకున్నా ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభించలేదు. సీఎం కిరణ్ తన ప్రసంగం మొదలుపెడుతునే ఎమ్మెల్యే వీరశివాను సీనియర్ మంత్రివర్యులు వీరశివారెడ్డి అని సంబోధించారు. ప్రభుత్వ కార్యక్రమమైనప్పటికీ కాంగ్రెస్‌పార్టీ బహిరంగసభలాగ కొనసాగింది. తాను మీ పొరుగు నియోజకవర్గ వాసినని, మీ ప్రాంతంలో తమ ఆడబిడ్డలు ఉన్నారని చెప్పుకున్నా సభికుల నుంచి ఉత్సాహం కనిపించలేదు.
 
 వైఎస్‌ఆర్ పేరు చెప్పగానే
 హర్షధ్వానాలు  :
 రచ్చబండ రూపకర్త, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఎవరు ఉచ్చరించినా సభలో హర్షధ్వానాలు వెల్లివిరిశాయి. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మొదలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు వైఎస్ పేరు ఎత్తగానే ఈలలు, కేకలు వేస్తూ ఆనందోత్సాహాలను ప్రదర్శించారు. రచ్చబండ బ్యానర్‌పై రాజశేఖరరెడ్డి ఫొటో లేకపోవడం, సమైక్యాంధ్ర కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ నేతల మద్దతు కూడగడుతున్న విషయాన్ని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తెలియజెప్పిన సందర్భంలో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.
 
 మంత్రి సీఆర్‌సీ సుతిమెత్తని విమర్శలు :
 ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమంలో క్రికెటర్ సచిన్ టెండూల్కర్ లాగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు రాంప్రసాద్‌రెడ్డి నుంచి తులసిరెడ్డి వరకు పొగడ్తలతో ముంచెత్తారు. అయితే దేవాదాయ శాఖా మంత్రి సి.రామచంద్రయ్య తన ప్రసంగంలో క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రిటైర్డ్ అయ్యారని కిరణ్‌కుమార్‌రెడ్డి అలా రిటైర్డ్ కారాదన్నారు. సమైక్యాంధ్ర కోసం కెప్టెన్‌గా వ్యవహరించాలని, అందరినీ కలుపుకొనిపోవాలన్నారు.
 
 శ్రీకాంత్‌రెడ్డి మొదలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు వైఎస్ పేరు ఎత్తగానే ఈలలు, కేకలు వేస్తూ ఆనందోత్సాహాలను ప్రదర్శించారు. రచ్చబండ బ్యానర్‌పై రాజశేఖరరెడ్డి ఫొటో లేకపోవడం, సమైక్యాంధ్ర కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ నేతల మద్దతు కూడగడుతున్న విషయాన్ని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తెలియజెప్పిన సందర్భంలో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.
 
 మంత్రి సీఆర్‌సీ సుతిమెత్తని విమర్శలు :
 ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమంలో క్రికెటర్ సచిన్ టెండూల్కర్ లాగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు రాంప్రసాద్‌రెడ్డి నుంచి తులసిరెడ్డి వరకు పొగడ్తలతో ముంచెత్తారు. అయితే దేవాదాయ శాఖా మంత్రి సి.రామచంద్రయ్య తన ప్రసంగంలో క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రిటైర్డ్ అయ్యారని కిరణ్‌కుమార్‌రెడ్డి అలా రిటైర్డ్ కారాదన్నారు. సమైక్యాంధ్ర కోసం కెప్టెన్‌గా వ్యవహరించాలని, అందరినీ కలుపుకొనిపోవాలన్నారు.
 
 పొగడ్తలతో ముంచెత్తిన తులసీ :
 రాయచోటి రచ్చబండలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని పొగిడేందుకే కాంగ్రెస్ నేతలు ప్రాధాన్యత ఇచ్చారు. 20సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ తులసీరెడ్డి ముఖ్యమంత్రి మూడేళ్ల కాలాన్ని తన ప్రసంగంతో ఆకట్టుకునే యత్నాన్ని చేశారు. సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తున్న యోధుడిగా కిరణ్‌కుమార్‌రెడ్డిని వర్ణించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement