స్వగృహానందం
పెందుర్తి, న్యూస్‌లైన్ :కూడు.. గూడు.. గుడ్డ.. ఇలాంటి ఎన్ని‘కలలు’ నిజమవుతాయనుకోలేదెవరూ.. అవి అధికార పార్టీ అనుయాయులకే దక్కుతాయన్నది అందరి అభిప్రాయం. నేనున్నానంటూ పాదయాత్ర చేసి జనం కష్టసుఖాలు తెలుసుకున్న మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సామాన్యుల గుం డెల్లో ఆశలు నింపారు.
అవి నిజమయ్యేసరికి అందరిలో అంతులేని ఆనందం. ఇందిరమ్మ పథకంలో రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సొంత ఇళ్లు సమకూరాయి. జిల్లాలో ఈ పథకానికి పెందుర్తి మండలం పినగాడిలో 2006లో శ్రీకారం చుట్టారు వైఎస్సార్. పక్కా గృహాలతోపాటు ఇంటి స్థలాలు, ఇతర సౌకర్యాలు కల్పించి జిల్లా ప్రజల హృదయాల్లో ‘గూడు’ కట్టుకున్నారు.
అయిన వారికే ఇచ్చిన బాబు..
మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాక ముం దు జిల్లాలో పరిస్థితి ఘోరంగా ఉంది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ప్రభుత్వ పథకంలో ఇళ్లు మంజూరు కావడం గగనంగా ఉండేది. అర్హులైన వేలాది మంది ప్రజలు చేసుకున్న దరఖాస్తులు బుట్టదాఖలయ్యే వి. అప్పట్లో ఇచ్చిన కొద్దిపాటి ఇళ్లు కూడా తమ పార్టీకి చెం దిన వారికే కేటాయించేవారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో జిల్లా వ్యాప్తంగా కేవలం 50 వేల ఇళ్లు మాత్రమే మంజూరు చేశారు. అందులో చాలా వరకు పూర్తి కాలేదు.
అందరూ నా వారే...
2004 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన వైఎస్సార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. 2006లో పినగాడి వేదికగా జిల్లావ్యాప్తంగా తొలి విడత ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించి ఒకేసారి 1,09,912 ఇళ్లు ప్రకటించారు. రెండేళ్ల తరువాత ఇందిరమ్మ-2లో జిల్లాకు 1,14,721 ఇళ్లు కేటాయించారు. ఇవి కాకుండా వరదలు, ఇతర కారణాల వలన ఇళ్లు కోల్పోయిన వారికి అదనంగా మరో 25 వేల వరకు ఇళ్లు మంజూరు చేసి ఆదుకున్నారు. దాదాపు అన్ని ఇళ్ళకు బిల్లులు మంజూరు అయ్యేలా చూసి పేదల జీవీతాల్లో వెలుగులు నింపారు.
తరువాత షరా మామూలే..
మహానేత ఆకస్మిక మరణం ఇందిరమ్మ పథకంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల నేతృత్వంలోని కాంగ్రెస్ పాలన మళ్లీ చంద్రబాబు చీకటి రోజు లను తలపించింది. రచ్చబండ కార్యక్రమాలు మొక్కుబడి గా పెట్టి ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ఉత్తుత్తి ప్రకటనలు చేశారు. అన్ని రచ్చబండల్లో కలిపి దాదాపు 20 వేల ఇళ్లు మంజూరు చేసిన ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల్లో నిర్లక్ష్యం వహించింది. చాలా ఇళ్లు నిర్మాణ దశలో నిలిచిపోయాయి.