Own homes
-
పండగ వేళ.. స్వగృహానందం
సంక్రాంతి పండగవేళ పేదల్లో స్వగృహానందం నెలకొంది. సొంతిళ్లులేని వీరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 17,111 ఇళ్లను మంజూరు చేయగా వీటిలో 986 మంది నిర్మాణాలు పూర్తి చేశారు. నూతన గృహాల్లో సంక్రాంతి పండగను ఆనందంగా జరుపుకుంటున్నారు. మిగతా లబి్ధదారులు కూడా సొంతింటి కళను సాకారం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. సాక్షి, పాడేరు: జిల్లాలో ఇళ్లు లేని పేదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుజేస్తున్న పీఎంఏవై–వైఎస్సార్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం వరంలా మారింది. గతేడాది జిల్లాలోని 22 మండలాల్లో ప్రభుత్వం 17,111 పక్కా గృహాలను మంజూరు చేసింది. వీరిలో 1328 మంది గిరిజనులు వివిధ కారణాలతో ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. మిగతా 15,783 మందిలో 986 మంది పూర్తి చేశారు. మిగతా 14,791 మంది చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని ఈ ఏడాది మార్చి లోగా పూర్తి చేసే లక్ష్యంతో గృహ నిర్మాణశాఖ అధికారులు ఉన్నారు. ఈ బాధ్యతలను గ్రామసచివాలయాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు అప్పగించారు. ఒక్కొక్క ఇంటికి రూ.1.80 లక్షలు ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వాలు రూ.1.80 లక్షలు మంజూరు చేశాయి. ఇందులో రూ.1.50 లక్షలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయి. ఎన్ఆర్ఈజీఎస్లో కూలీ పనుల రూపంలో రూ.12 వేలు, బాత్రూం నిర్మాణానికి రూ.18 వేలు చెల్లిస్తున్నాయి. ఇంటి నిర్మాణం స్థాయినిబట్టి బిల్లుల మంజూరు ప్రక్రియ పారదర్శకంగా చేస్తున్నారు. పనులు మరింత వేగవంతానికి కలెక్టర్ సుమిత్‌కుమార్ తరచూ గృహ నిర్మాణశాఖ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు అదనంగా మరికొంత జోడించి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. సకాలంలో బిల్లుల చెల్లింపులు జిల్లా వ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేశాం. గ్రామ సచివాలయాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్లు పనుల్లో పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలాఖరుకల్లా ఎలాగైనా నిర్మాణ పనులు పూర్తి చేస్తాం. బిల్లులు కూడా నిర్మాణ స్థాయిని బట్టి సకాలంలో మంజూరు చేస్తున్నాం. – బాబునాయక్, ఇన్చార్జి పీడీ, గృహ నిర్మాణశాఖ, పాడేరు -
Covid-19 : 'అద్దె ఇంట్లో ఉండలేం బాబోయ్..సొంతిల్లే కొనుక్కుంటాం'
కరోనాకి ముందు సొంత ఇళ్లను కొనుగోలు చేసే సాహసం చేయలేదు.కానీ ఈ మహమ్మారి దెబ్బకు యువతరం మునుపెన్నడూ లేనంతగా సొంత ఇంటి కొనుగోలువైపు మొగ్గుచూపుతున్నారు. సొంత ఇల్లు కొనే స్థోమత లేక అద్దె ఇంట్లో కాలం వెళ్లదీస్తున్న చాలామంది సొంతంగా ఇల్లు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ అనరోక్ వెల్లడించింది. ఆ సంస్థ విడుదల చేసిన నివేదిక ఆధారంగా.. 2018 కంటే 2019 మొదటి మూడు త్రైమాసికాలలో 7నగరాల్లో దాదాపు 2.02లక్షల యూనిట్ల ఇళ్లు అమ్మకాలు జరిగి, దీంతో ఇళ్ల అమ్మకాలు 13% పెరిగాయి. 2016 లో ఇది 2.07లక్షల యూనిట్లుగా ఉందని అనరోక్ తన నివేదికలో పేర్కొంది. కరోనా కారణంగా అన్ని వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కానీ అనూహ్యంగా రియల్ ఎస్టేట్ రంగం నెలల్లోనే పుంజుకుందని, మొదటి అన్ లాక్ చేసిన కొద్ది నెలల్లోనే అమ్మకాలు సాధారణ స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. మహమ్మారి విజృంభించినా 2020 సెప్టెంబరులో భారత గృహనిర్మాణ రంగం 65% నుంచి 79% వరకు పుంజుకుందని అనరోక్ ప్రతినిధులు వెల్లడించారు. "కరోనావైరస్ మహమ్మారి అమ్మకాలు కేవలం 12,730 యూనిట్లకు తగ్గిందని, అయితే ఇది మునుపటి త్రైమాసికంతో పోలిస్తే అమ్మకాలు గణనీయంగా పెరిగాయని తెలిపింది. కరోనా కారణంగా అద్దె ఇంట్లో నివసించేవారు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారని, దీంతో అద్దె ఇల్లు కంటే సొంత ఇల్లే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు అనరోక్ నివేదికలో తేల్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే మహమ్మారి దేశాన్ని వణికిస్తున్నా పెద్ద ఇళ్లకు, 3 బీహెచ్ కే ఇళ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. కరోనా వల్ల ఎక్కువ మందికి ఇండ్లకే పరిమితం అవుతున్నారు. ఆఫీస్ వర్క్, లేదంటే కుటుంబసభ్యులతో గడపడం, వ్యాయామాలు ఇలా ఇతరాత్ర కారణాల వల్ల పెద్ద ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. మరో ప్రాపర్టీ సంస్థ ప్రాప్‌టైగర్ డేటా ల్యాబ్స్ ప్రకారం.. 2020 మొదటి త్రైమాసికంలో 3 బీహెచ్ కే కేటగిరీలోని 15,998 యూనిట్లు అమ్ముడు కాగా ఆ సంఖ్య కాస్త పెరిగి 2021 మొదటి త్రైమాసికంలో 17,200 యూనిట్లకు అమ్ముడైనట్లు ప్రాప్ టైగర్ డేటా ల్యాబ్స్ నివేదికలో తేలింది. చదవండి : రియల్టీ @ లక్ష కోట్ల డాలర్లు -
సొంతిల్లు మీ లక్ష్యమా?
సాక్షి, హైదరాబాద్: సొంతిల్లు కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. కాకపోతే కొందరే తక్కువ ధరలో ఇంటిని సొంతం చేసుకుంటారు. వీలైనంత తక్కువ ధరకు ఇంటిని కొనాలంటే.. మార్కెట్ పరిస్థితులను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసికొని తక్షణమే నిర్ణయం తీసుకోవాలి. ఇతర నగరాలకు చెందిన నిర్మాణ సంస్థలు నగరంలోకి అడుగుపెట్టి కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ రేటు కంటే అధిక ధరను నిర్ణయించాయి. దీంతో అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మాణాన్ని చేపట్టే స్థానిక డెవలపర్లు తప్పనిసరి పరిస్థితుల్లో ధరలను పెంచేశారు. ఈ కారణంగా గత రెండు మూడు నెలల నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో రేట్లు పెరిగాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముంది కాబట్టి సొంతింటి ఎంపికకు ఆలస్యం చేయకపోవటమే మంచిది. ముఖ్యంగా మొదటిసారి సొంతిల్లు కొనాలని భావించేవారికిదే సరైన సమయమని చెప్పొచ్చు. ఆకాశాన్నంటిని నిర్మాణ సామగ్రి ధరలు ఈ ఏడాది స్వల్పంగా తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గృహ రుణాలపై వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయని అంచనా. దీంతో రియల్టీ మార్కెట్ పుంజుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదే నిజమైతే కొనుగోలుదారుల సంఖ్య పెరుగుతుంది. ఫలితంగా పెట్టుబడులు పెట్టేవారు ఈ రంగంలోకి అగుడుపెట్టి కృత్రిమ డిమాండ్‌ను సృష్టిస్తారు కాబట్టి గృహ కొనుగోలు నిర్ణయానికి ఇదే సరైన సమయం. -
వీడిన గ్రహణం
ఎట్టకేలకు తేలిన హౌసింగ్‌బోర్డు ఇళ్ల పంచాయితీ అగ్రిమెంట్ నాటి రేటుతోనే కొత్త డిజైన్‌తో ఇళ్లు కట్టించి ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం దాదాపు 150 మంది లబ్ధిదారులకు రూ.6.5కోట్ల మేర ఊరట హౌసింగ్‌బోర్డు అధికారులతో హైదరాబాద్‌లో మంత్రులు జగదీశ్, ఇంద్రకరణ్ సమావేశం నల్లగొండ : సొంత ఇంటి కోసం అడ్వాన్సులు చెల్లించి నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న వారికి ఊరట లభించింది. జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీ పంచాయితీ ఎట్టకేలకు తేలింది. పాత అగ్రిమెంట్ ప్రకారం హౌసింగ్‌బోర్డు రూపొందించిన కొత్త డిజైన్‌తో ఇళ్లు కట్టించి ఇవ్వాలని జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిల సమక్షంలో సోమవారం హైదరాబాద్‌లో సంబంధిత అధికారులతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. హెచ్ఐజీ గృహాల ధరను రూ.16.34 లక్షలు, ఎంఐజీ గృహాలను రూ.13.40 లక్షలకు కట్టించి ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో దాదాపు 150 మంది లబ్ధిదారులకు రూ.6.5 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. వాస్తవానికి జిల్లా కేంద్రంలో హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో గృహాలు నిర్మించి ఇచ్చేందుకు 2011లో నిర్ణయం తీసుకున్నారు. ఈ దేవరకొండ రోడ్డులో కతాల్‌గూడ వద్ద మొత్తం 334 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. అందులో 152 హెచ్ఐజీ కాగా, 182 ఎంఐజీ ఇళ్లు. హెచ్ఐజీ ఇళ్లకు రూ.16.34 లక్షలు, ఎంఐజీ ఇళ్లకు రూ.13.40 లక్షలకు నిర్మించాలని 2011లోనే అగ్రిమెంట్లు కూడా కుదుర్చుకున్నారు. దీంతో లబ్ధిదారులంతా అడ్వాన్సులు చెల్లించారు. చాలామంది ఇళ్లపనులు ప్రారంభించారు. ఆ ఇళ్లలో ఇప్పటివరకు 52 హెచ్ఐజీ, 117ఎంఐజీ ఇళ్లు నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే, అగ్రిమెంట్లో ఉన్న దానికి భిన్నంగా మధ్యలో మార్పులు తెచ్చి హెచ్ఐజీ, ఎంఐజీ ఇళ్లలో బాల్కనీలు ఏర్పాటుకు మరో రూ.3లక్షలు చెల్లించాలని హౌసింగ్ బోర్డు అధికారులు మెలికపెట్టారు. దీంతో భారమవుతుందనే ఆలోచనతో అడ్వాన్సులు చెల్లించిన వారు కూడా నిర్మాణ పనులు నిలిపివేశారు. ఇందులో రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు అడ్వాన్సులు చెల్లించిన వారున్నారు. దీంతో అధికారులు వారి అగ్రిమెంట్లను రద్దు చేస్తున్నామని, అడ్వాన్సుగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించేది లేదని లబ్ధిదారులకు నోటీసులు కూడా పంపారు. దీంతో ఈ హౌసింగ్‌బోర్డు ఇళ్ల నిర్మాణం పెండింగ్‌లో పడింది. ఇప్పుడేం జరిగిందంటే.. లబ్ధిదారులు ఈ సమస్యను నల్లగొండ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జ్ దుబ్బాక నర్సింహారెడ్డి చొరవతో రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తమ సమస్యను పరిష్కరించాలని, ఆర్థికంగా భారం పడకుండా పాత అగ్రిమెంట్ వరకు ఇళ్లు కట్టించి ఇచ్చేలా హౌసింగ్ బోర్డు అధికారులకు ఆదేశాలివ్వాలని కోరారు. దీంతో సోమవారం సచివాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి హౌసింగ్‌బోర్డు అధికారులు, లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేయించారు. అందులో గృహనిర్మాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాత రేటుకే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, అది కూడా కొత్త డిజైన్‌తో కట్టించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు వెంటనే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ సమావేశంలో మరో అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఈ గృహాలను కట్టించి ఇచ్చిన చోట మరో 25 ఓపెన్ ప్లాట్లను అక్రమంగా అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చిన ఒక హౌసింగ్‌బోర్డు అధికారిపై మంత్రులు ఆగ్ర హం వ్యక్తం చేసినట్టు సమాచారం. -
స్వగృహానందం
పెందుర్తి, న్యూస్‌లైన్ :కూడు.. గూడు.. గుడ్డ.. ఇలాంటి ఎన్ని‘కలలు’ నిజమవుతాయనుకోలేదెవరూ.. అవి అధికార పార్టీ అనుయాయులకే దక్కుతాయన్నది అందరి అభిప్రాయం. నేనున్నానంటూ పాదయాత్ర చేసి జనం కష్టసుఖాలు తెలుసుకున్న మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సామాన్యుల గుం డెల్లో ఆశలు నింపారు. అవి నిజమయ్యేసరికి అందరిలో అంతులేని ఆనందం. ఇందిరమ్మ పథకంలో రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సొంత ఇళ్లు సమకూరాయి. జిల్లాలో ఈ పథకానికి పెందుర్తి మండలం పినగాడిలో 2006లో శ్రీకారం చుట్టారు వైఎస్సార్. పక్కా గృహాలతోపాటు ఇంటి స్థలాలు, ఇతర సౌకర్యాలు కల్పించి జిల్లా ప్రజల హృదయాల్లో ‘గూడు’ కట్టుకున్నారు. అయిన వారికే ఇచ్చిన బాబు.. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాక ముం దు జిల్లాలో పరిస్థితి ఘోరంగా ఉంది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ప్రభుత్వ పథకంలో ఇళ్లు మంజూరు కావడం గగనంగా ఉండేది. అర్హులైన వేలాది మంది ప్రజలు చేసుకున్న దరఖాస్తులు బుట్టదాఖలయ్యే వి. అప్పట్లో ఇచ్చిన కొద్దిపాటి ఇళ్లు కూడా తమ పార్టీకి చెం దిన వారికే కేటాయించేవారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో జిల్లా వ్యాప్తంగా కేవలం 50 వేల ఇళ్లు మాత్రమే మంజూరు చేశారు. అందులో చాలా వరకు పూర్తి కాలేదు. అందరూ నా వారే... 2004 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన వైఎస్సార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. 2006లో పినగాడి వేదికగా జిల్లావ్యాప్తంగా తొలి విడత ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించి ఒకేసారి 1,09,912 ఇళ్లు ప్రకటించారు. రెండేళ్ల తరువాత ఇందిరమ్మ-2లో జిల్లాకు 1,14,721 ఇళ్లు కేటాయించారు. ఇవి కాకుండా వరదలు, ఇతర కారణాల వలన ఇళ్లు కోల్పోయిన వారికి అదనంగా మరో 25 వేల వరకు ఇళ్లు మంజూరు చేసి ఆదుకున్నారు. దాదాపు అన్ని ఇళ్ళకు బిల్లులు మంజూరు అయ్యేలా చూసి పేదల జీవీతాల్లో వెలుగులు నింపారు. తరువాత షరా మామూలే.. మహానేత ఆకస్మిక మరణం ఇందిరమ్మ పథకంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల నేతృత్వంలోని కాంగ్రెస్ పాలన మళ్లీ చంద్రబాబు చీకటి రోజు లను తలపించింది. రచ్చబండ కార్యక్రమాలు మొక్కుబడి గా పెట్టి ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ఉత్తుత్తి ప్రకటనలు చేశారు. అన్ని రచ్చబండల్లో కలిపి దాదాపు 20 వేల ఇళ్లు మంజూరు చేసిన ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల్లో నిర్లక్ష్యం వహించింది. చాలా ఇళ్లు నిర్మాణ దశలో నిలిచిపోయాయి.