చిత్తూరు, సాక్షి: ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ జిల్లాలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆయా గ్రామాల్లో ప్రజలు పడుతున్న బాధలు, ఎదుర్కొంటున్న సమస్యలను నాయకులే స్వయంగా పరిశీలిస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకుపోతున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని నాయకులు ప్రజలకు తెలియజేస్తున్నారు.
పీలేరు నియోజకవర్గం కేవీపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీలోని శిబ్బాలవారిపల్లెలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సోమవారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటామని, ఏ కష్టమొచ్చినా ప్రజలు నేరుగా వచ్చి మా దృష్టికి తెస్తే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని కంచన పుత్తూరు గ్రామంలోని ఎస్సీ, ఎస్టీకాలనీలో సోమవారం నియోజకవర్గ సమన్వయ కర్త ఆదిమూలం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో రోడ్లు, తాగునీటి సరఫరా అధ్వానంగా ఉన్నాయని నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. పక్కాగృహాలన్నీ టీడీపీ సానుభూతిపరులకే ఇస్తున్నారని ప్రజలు వాపోయారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయ్తు కార్యదర్శి విద్యానాథ్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
∙పుంగనూరు పట్టణంలోని భగత్‌సింగ్‌కాలనీలో ఆదివారం రాత్రి వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్రకార్యదర్శి ఎన్ రెడ్డెప్ప, జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బాలు ఆధ్వర్యంలో పల్లె నిద్ర చేశారు.
Comments
Please login to add a commentAdd a comment