సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): ఏంరా... రాజు ఎటు పోతున్నవ్ అసలే కనిపిత్తలేవ్... ఏంలేదు నర్సన్న రోజు ఎలచ్చన్‌ల పెచారంకు బోతున్న గందుకే నీకు కనిపిత్తలేను... గట్లనా మరి గదే రోజు పొద్దుగాల్ల కసీర్‌కాడ ఉన్న హోటల్‌కు అచ్చి చాయి తాగుతుంటివి.. మూడు నాలుగు రోజుల నుంచి సూత్తున్న కనిపిత్తలేవని అడుగుతున్న. అవు నర్సన్న మస్కట్ బోయేటందుకు విజాకు అప్లికేషన్ పెట్టిన గని ఇంకా మస్తు టైం ఉంది. గందుకే ఉట్టిగా ఇంటికాడ ఉంటే యాష్ట అత్తది. పెచారంకు బోతే పైసలత్తున్నయి. ఇంత బిర్యాని బువ్వ బెడుతుండ్రు... గందుకే పెచారంకు బోతున్న. అగో రోజు మస్తు మజా సేత్తున్నవ్ అన్నట్లు గదరా రాజు.. అవు నర్సన్న మరేంజేస్తం... ఎలచ్చన్లు అయిపోయేదాంకా పెచారంల తిరుగుతున్న.. అవు మల్ల మరి ఏ పార్టీల్లోకు పెచారంకు బోతున్నవ్ రాజు. ఏం లేదు నర్సన్న ఓల్లు ఒక రోజు ముందు సెబితే ఆల్లకు పెచారంకు బోతున్న. అగో గట్ల గిదేం తరీకర బై రాజు..
ఇగో నర్సన్న ఓల్లయిన గంతే పైసలిత్తుండ్రు. అందరి లెక్కనే బిర్యాని బువ్వ బెడుతుండ్రు. గందుకే ముందు ఓల్లు సెబితే ఆల్లకు పెచారంకు బోతున్నం. గట్ల గాదురా రాజు. ఏదన్న ఒక పార్టీకే పెచారంకు బోవాల గాని ఓల్లు సెబితే ఆల్లకు పోవుడు ఏమన్నా మంచిదావురా. ఇగో నర్సన్న.. గిప్పుడు గిట్లనే సెయ్యాలే.. ఏంటికంటే.. ఓల్లయిన ఉట్టిగనే తోల్కపోతలే. అందరు పైసలు, బిర్యాని బువ్వ పెట్టుడు కామన్ జేసిండ్రు. గందుకే ఒక రోజు ముందు సెప్పినోల్లకు పెచారంకు బోతున్నం. మల్ల పొద్దుమీక్కి మా ఇంటికచ్చి పెచారంకు రమ్మని సెప్పినోల్లకు తెల్లారి ఆల్లకు బోతున్నం. ఇగో రాజు నేను అన్నది నీకర్థం గాలే.. నేను సెప్పిదే ఏంటిదంటే ఏదన్న ఒక పార్టీకి పెచారంకు బోవాల గాని ఓల్లు సెబితే ఆల్లకు పోవుడు ఏం మంచిగలేదు. ఏదన్న ఒక పార్టీతోనే ఉండాలే అని సెప్పుతున్న.
గది కరెక్టె గని నర్సన్న. మనకు ఎప్పుడు ఓల్లతోని పని బడ్తదో తెల్వదాయే. గందుకే ఏ పార్టీవోల్లు సెప్పినా పెచారంకు బోయి అత్తున్న. అంటే ఒక పాల్టీలనే తిరగవ్ అన్నట్లు గదరా రాజు. అవ్‌మల్ల. నర్సన్న ఒక పార్టీలనే దిరిగితే మిగిలిన పార్టీలోల్లతోని లొల్లి. గందుకే ఓల్లను కూడా నారాజ్ సేయకుండా అన్ని పార్టీవోల్లకు బోయి పెచారం సేసి అత్తున్నం. గట్లనే ఏ పార్టీవోల్లతోని బోతే ఆల్ల కండువ గప్పుకుంటున్నం నర్సన్న. అవ్‌రా రాజు నువ్వు సెప్పింది మస్తుగున్నది. నీ లెక్కనే రాజకీయం చెయ్యాల. మంచి పిలాన్ సేసినవ్. ఓల్లు కూడా నారాజ్ కాకుండా అందరి తాన్కి బోతున్నవ్. ఓల్లు పైసలిత్తే ఆల్లయి తీసుకుంటున్నవ్. మంచి పని జేసినవ్. పోతరా మస్తు లేట్ అయ్యింది పని బాగుంది అని ఆడికెల్లి ఇద్దరు ఎల్లిపోయిండ్రు..
Comments
Please login to add a commentAdd a comment