ప్రజలతో మమేకం | ysrcp leaders conduct pallenidra and rachabanda | Sakshi
Sakshi News home page

ప్రజలతో మమేకం

Published Mon, Nov 20 2017 11:49 AM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

ysrcp leaders conduct pallenidra and rachabanda - Sakshi

సాక్షి, తిరుపతి: జిల్లాలోని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుం టూ ముందుకు సాగుతున్నారు. ఆదివారం మదనపల్లె, పూతలపట్టు, చిత్తూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు, గంగాధరనెల్లూరు నియోజకర్గాల్లో రచ్చబండ, పల్లెనిద్ర చేపట్టారు. మదనపల్లె మండలం కోటవారిపల్లెలో ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌తిప్పారెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు పరిధిలోని గుడిపాల మండలం చీలాపల్లె పం చాయతీ రాసనిపల్లెలో పార్లమెంటరీ ఇన్‌చార్జ్‌ జంగాలపల్లె శ్రీనివాసులు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.

శ్రీకాళహస్తి పరిధిలోని తొట్టంబేడు మండలం పొయ్యిగ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. గంగాధరనెల్లూరు పరిధిలోని పాతగుంటలో ఎమ్మెల్యే నారాయణస్వామి రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పూతలపట్టు నియోజక వర్గం బంగారుపాళెం మండలం జంబుగానిపల్లెలో ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించా రు. సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెం మండలంలో ఎంజీనగర్, అరుంధతివాడ, సిద్ధాపురం, అంబికాపురం గ్రామాల్లో రచ్చబం డ నిర్వహించారు. ఎంజీనగర్‌ గిరిజన కాలనీ లో కోనేటి ఆదిమూలం పల్లెనిద్ర చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement