విశాఖ రూరల్, న్యూస్‌లైన్: రేషన్‌కార్డులు ఇచ్చేస్తామన్నారు..పెన్షన్లు మంజూరు చేశామన్నారు.. దరఖాస్తులు స్వీకరించి 16 నెలలయింది. లబ్ధిదారుల కళ్లు కాయలు కాయలవుతున్నా సర్కారు మనసు కరగడం లేదు. రాజకీయ లబ్ధి కోసం రచ్చబండలో వీటిని పంపిణీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోంది. వాస్తవానికి ఆగస్టులో రచ్చబండ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినా సమైక్యాంధ్ర ఉద్యమంతో నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ నెలలో నిర్వహించాలనుకున్నా ఉద్యమం మరింత ఉధృతం కావడంతో ఆ పరిస్థితి కనిపించలేదు. దీంతో దరఖాస్తుదారులు ఇబ్బందు లు పడుతున్నారు. ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన రచ్చబండ-2లో జిల్లాలో లక్షల మంది నుంచి రేషన్‌కార్డులకు, వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్ల మంజూరుకు దరఖాస్తులు తీసుకుంది. వీటిని పరిశీలించిన అధికార యంత్రాంగం లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వానికి పంపినా ఇప్పటి వరకు రేషన్‌కార్డులు గాని, పెన్షన్లు గాని మంజూరు చేయలేదు.
లబ్ధిదారుల ఎదురుతెన్నులు
రచ్చబండ-2లో జిల్లాలో 1.10లక్షల మంది తెల్ల రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఆగస్టు 8న రచ్చబండ నిర్వహించి రేషన్‌కూపన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు జూలై 31లోగా లబ్ధిదారుల జాబితాను సమర్పిస్తే కూపన్లు ముద్రించి జిల్లాకు పంపిస్తామని తెలిపింది. ఆ మేరకు పౌరసరఫరా అధికారులు లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్ ద్వారా ఆ శాఖ కమిషనర్‌కు పంపించారు. అయితే ఇప్పటికీ కూపన్ల ముద్రణ జరగలేదు. ఈ పరిస్థితుల్లో ఈ నెలలో రేషన్‌కార్డులు వచ్చే అవకాశాలు లేనట్లే. అలాగే పింఛన్ల కోసం సుమారుగా 34,292 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరి జాబితాను కూడా అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. వీటన్నింటినీ ఈ నెలలోనే పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ సమైక్యాంధ్ర ఉద్యమాల నెపంతో మరోసారి వాయిదా వేసింది. మున్సిపల్, పురపాలక ఎన్నికలు లేదా సాధారణ ఎన్నికలకు ముందు మాత్రమే రేషన్‌కార్డులు, పెన్ష న్లు లబ్ధిదారులకు అందే అవకాశమున్నట్టు తెలిసింది. ప్రస్తు తం ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవడంతో వీరు ఇప్పట్లో వీటి కోసం ఇంకా ఎదురుచూపులు తప్పని పరిస్థితే ఉంది
ఎదురుచూపులే మిగిలాయి..
Published Sun, Oct 6 2013 4:44 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement