Published
Tue, Nov 19 2013 4:20 AM
| Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
ఉట్నూర్, న్యూస్‌లైన్ :
ఉట్నూర్‌లో సోమవారం నిర్వహించిన మూడో విడత రచ్చబండ కార్యక్రమానికి నిరసనల సెగ తగి లింది. తెలంగాణవాదుల నిరసనలతో సభ రచ్చరచ్చ గా మారింది. స్థానిక స్టార్ ఫంక్షన్ హాల్‌లో రచ్చబండ కార్యక్రమం ప్రారంభమైంది. సమైక్యవాదిగా వ్యవహరి స్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్లెక్సీ తొలగించాలని టీజేఏసీ మండల కన్వీనర్ మర్సకోల తిరుపతి, టీఆర్‌ఏస్వీ నియోజకవర్గ ఇన్‌చార్జి ధరణి రాజేశ్, జిల్లా కార్యదర్శి కందుకూరి రమేశ్, నాయకులు కాటం రమేశ్, సెడ్మాకీ సీతారాం, సీపతి లింగాగౌడ్ డిమాండ్ చేస్తూ సభను అడ్డుకున్నారు. సీఎం ఫ్లెక్సీపై తెల్లబట్ట కప్పారు. కార్యక్రమానికి హాజరైన ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్ సీఎం ఫ్లెక్సీకి వేసిన ముసుగు తొలగించాలని అధికారులను ఆదేశించారు. వారు తొలగించేందుకు యత్నించగా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పీవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేదిక ముందు బైఠారుుంచారు. కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని హెచ్చరించారు. దీంతో పోలీసులు, నాయకులకు మధ్య తోపులాట జరిగింది. చివరికి నాయకులను పోలీసులు బయటకు పంపించడంతో అధికారులు ఫ్లెక్సీకి వేసిన ముసుగు తొలగించి కార్యక్రమం ప్రారంభించారు.
తప్పులు సరిచేస్తున్నం..
రేషన్‌కార్డుల్లో వయసు తక్కువగాపడడంతో చాలామంది అర్హులు పింఛన్లకు దూరం అవుతున్నారని, వయసు నిర్ధారణకు ఐటీడీఏ ద్వారా శిబిరాలు నిర్వహించామని పీవో జనార్దన్ నివాస్ పేర్కొన్నారు. సుమారు ఆరు వేల మంది శిబిరాలకు హాజరవగా వెరుు్య కార్డుల్లో వయసు వివరాలు సరి చేశామని తెలిపారు. ఇకపై అలాంటి పొరపాట్లను మీ సేవ కేంద్రాల ద్వారా సరి చేసుకోవాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని మారుమూల పల్లెల్లో రోడ్ల సౌకర్యానికి గిరిజన ఉప ప్రణాళిక ద్వారా కృషి చేస్తామని చెప్పారు. పీవో మాట్లాడుతుండగా టీఆర్‌ఎస్ నాయకులు సీఎం ఫ్లెక్సీ తొలగించాలని నినాదాలు చేశారు. ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ మాట్లాడుతూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడాలన్నారు. సమైక్యవాదిగా వ్యవహరిస్తూ ఇరు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ముఖ్యమంత్రి యత్నిస్తున్నారని ఆరోపించారు.
రేషన్‌కార్డులు.. పింఛన్లు..
మండలంలో 130 మందికి బంగారు తల్లి ప్రోత్సాహక బాండ్లు, 1360 మందికి రేషన్‌కార్డులు, 258 మందికి పింఛన్లు, 497 మందికి ఇందిరమ్మ గృహ మంజూరు పత్రాలు అందించారు. ఎస్సీ, ఎస్టీల్లో 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్న వారికి బిల్లుల మాఫీలో భాగంగా 1004 ఎస్సీ, 1370 ఎస్టీ కుటుంబాలకు బిల్లులు మాఫీ చేసిన పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రామచంద్రయ్య, జిల్లా అదనపు వైద్యాధికారి ప్రభాకర్‌రెడ్డి, డీఎంవో అల్హం రవి, మండల ప్రత్యేకాధికారి అక్రముల్లాఖాన్, ఈజీఎస్ ఏపీడీ అనిల్ చౌహాన్, ట్రాన్స్‌కో ఏఈ రవి, హౌసింగ్ ఏఈ విశాల్, తహశీల్దార్ చిత్రు, ఇన్‌చార్జి ఏంపీడీవో రమాకాంత్‌రావు, రచ్చబండ కమిటీ సభ్యులు భరత్ చౌహాన్, ఇక్బాల్, జాడి మల్లయ్య, సర్పంచులు బోంత ఆశారెడ్డి, అశోక్, మాణిక్‌రావు, హరినాయక్ విమలాబాయి, భాగీర్తా, అంకవ్వ, నాయకులు నారాయణరెడ్డి, కాలం రవీందర్, లింగమ్మ పాల్గొన్నారు.