11 నుంచి 26 వరకూ రచ్చబండలో పంపిణీ
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: రెండేళ్లుగా రేషన్‌కార్డులు, పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలు నెరవేరనున్నాయి. ఈ నెల 11 నుంచి జరగనున్న రచ్చబండలో కొత్త కార్డులు ఇస్తారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దరఖాస్తుదారులకు ముందుగా తాత్కాలిక రేషన్‌కార్డుతో పాటు ఏడు నెలలకు సరిపడ రేషన్ కూపన్లు ఇస్తారు. వీరికి డిసెంబర్ నెల నుంచి చౌక దుకాణాల ద్వారా సరుకులు సరఫరా చేస్తారు.
అనంతరం తాత్కాలి కార్డుదారులు తమ కుటుంబ సభ్యుల ఫొటోను పౌర సరఫరా అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని ఆన్‌లైన్‌లో అపలోడ్ చేశాక కొద్ది రోజులకు శాశ్వత రేషన్‌కార్డులు వస్తాయి. అయితే ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. కాగా 2010లో నిర్వహించిన రచ్చబండలో రేషన్‌కార్డులు, పెన్షన్లు, ఇళ్ల కోసం వేలాదిమంది దరఖాస్తులు చేసుకున్నారు. వారితో పాటు ప్రజావాణి, ఇతరత్రా కార్యక్రమాల్లో వచ్చిన దరఖాస్తులను కూడా క్రోడీకరించి లబ్ధిదారుల జాబితాలను అధికారులు సిద్ధం చేశారు.
దీని ప్రకారం జిల్లాలో 1,37,201 మందికి రేషన్‌కార్డులు, 31,841 మందికి పెన్షన్లు, 37,228 మందికి ఇళ్లు రానున్నాయి. వీటన్నింటినీ ఈ నెల 11 నుంచి 26వ తేదీ వరకు జరిగే రచ్చబండ కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల సమక్షంలో అందజేయనున్నారు. అలాగే డిసెంబర్ నెల నుంచే కొత్త పెన్షన్ లబ్ధిదారులకు చెల్లింపులుంటాయి. ప్రస్తుతం హౌసింగ్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి జీవో రావాల్సి ఉంది. ఇది వచ్చిన వెంటనే ఇళ్ల పట్టాలు కూడా అందించనున్నారు.
ఇదిగో కూపన్.. వచ్చే నెలలో రేషన్
Published Sat, Nov 9 2013 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM
Advertisement
Advertisement