- అధికార పార్టీ ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్న జనం
- జన్మభూమిభల్లో సమస్యలపై నిలదీత
- పోలీసు బందోబస్తుతోనే హాజరవుతున్న టీడీపీ నేతలు
నిరసనల సెగ
Published Tue, Jan 3 2017 11:36 PM | Last Updated on Tue, Aug 21 2018 7:19 PM
జన్మభూమి మా ఊరు గ్రామసభల్లో అధికార టీడీపీ ప్రజాప్రతినిధులకు సమస్యల కాక తగులుతోంది. రెండున్నరేళ్లుగా ప్రజాసమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు.. ఇప్పుడు జన్మభూమి పేరుతో ‘సమస్యలు చెప్పండి.. పరిష్కరిస్తామ’ని చెబుతూ కొత్త నాటకానికి తెర తీస్తున్నారంటూ ప్రజలు ఎక్కడికక్కడ ఆగ్రహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలపై తిరుగుబాటు చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
జన్మభూమి – మా ఊరు గ్రామసభల్లో రెండో రోజైన మంగళవారం కూడా ప్రజలు టీడీపీ ప్రజాప్రతిని ధులను తమ సమస్యలపై నిలదీశారు. కొన్నిచోట్ల ప్రజాగ్రహానికి భయపడిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాకే సభలకు వెళ్లడం కనిపించింది.
ఖాకీ కవచంలో..
∙అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లిలో చుక్కెదురైంది. సన్నవిల్లికి మంజూరైన పశుమిత్ర పోస్టును జన్మభూమి కమిటీ అక్రమాలకు పాల్పడి నంగవరానికి తరలించడంపై పార్టీలకతీతంగా ఏకమైన స్థానికులు మూకుమ్మడిగా గ్రామసభను అడ్డుకున్నారు. కనీసం షామియానాలు కూడా వేయనివ్వకుండా ఆగ్రహం వ్యక్తం చేశారు. నచ్చచెప్పేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిం చినా వారు ససేమిరా అన్నారు. చివరకు పోలీసు బందోబస్తు నడుమ ‘మమ’ అనిపించారు. ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సొంత మండలం ఉప్పలగుప్తంలో ఈ పరిస్థితి ఎదురవడం విశేషం.
∙ప్రత్తిపాడు మండలం రాచపల్లిలో కూడా పోలీసు బందోబస్తు మధ్య జన్మభూమి నిర్వహించారు. గతంలో జనచైతన్య యాత్రలో టీడీపీకి చెందిన దివంగత పర్వత చిట్టిబాబు వర్గీయులు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పనితీరుపై నిరసన తెలిపారు. జన్మభూమి కమిటీలను కూడా మార్చారు. దీనిపై టీడీపీలోని ఆయన వైరివర్గం ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకుని జన్మభూమి నిర్వహించారు.
ఆదిరెడ్డిపై మహిళల ఆగ్రహం
రాజమహేంద్రవరం 14వ డివిజ¯ŒSలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మహిళల ఆగ్రహాన్ని చవి చూశారు. మహిళా సంక్షేమ పథకాల అమలులో వివక్షపై ఆదిరెడ్డిని కార్పొరేటర్ ఈతకోట బాపనసుధారాణి తీవ్రస్థాయిలో నిలదీశారు. అటువంటప్పుడు జన్మభూమి గ్రామసభలు నిర్వహించి, సమస్యలు అడిగి తెలుసుకోవడం దేనికని మహిళలు ప్రశ్నించడంతో ఎమ్మెల్సీ బిత్తరపోయారు.
మన్యంలో బహిష్కరణల పర్వం
∙మారేడుమిల్లి మండలం సున్నంపాడులో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆధ్వర్యాన స్థానికులు జన్మభూమి గ్రామసభను బహిష్కరించారు. నూరుపూడి గ్రామానికి వంతెన, రామన్నవలసకు రహదారి నిర్మించాలంటూ మూడో విడత జన్మభూమిలో స్థానికులు విన్నవించారు. దీంతో ఈ సమస్యను పరిష్కరిస్తామని అప్పట్లో అధికారులు లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ పరిష్కారం లభించకపోవడంతో ఆగ్రహించిన గిరిజనులు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గ్రామసభను బహిష్కరించారు.
∙రాజవొమ్మంగి మండలం మారేడుబాక పంచాయతీలో గురువారం జరగాల్సిన గ్రామసభను జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు కోసం ఉర్లాకులపాడులో మంగళవారమే నిర్వహించేశారు. అది కూడా పంచాయతీ కార్యాలయంలో కాకుండా జెడ్పీటీసీ ఇంటి దగ్గర్లో పెట్టారు. దీనిని నిరసిస్తూ గ్రామసభను గిరిజనులంతా బహిష్కరించారు.
∙పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారంపై స్పష్టత ఇవ్వాలని వీఆర్ పురం మండలం రేఖపల్లి, పెదమట్టపల్లి గ్రామసభల్లో గిరిజనులు నిలదీశారు. ఎటపాక మండలం నందిగామలో అధికార పార్టీవారికే పింఛన్లు, రేష¯ŒSకార్డులు ఇస్తున్నారని నిలదీశారు. చింతూరు మండలం తుమ్మలలో జరిగిన గ్రామసభలో ఆహార భద్రత అంటూ ప్రతి ఇంటిలో ఒకరిద్దరికి రేష¯ŒS నిలిపివేస్తున్నా పట్టించుకున్న నాథుడే కరవయ్యాడని సర్పంచ్ సోడే దుర్గారావుతోపాటు గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతూరు, తుమ్మాల గ్రామసభల్లో గత హామీలపై అధికారులను నిలదీశారు. రెండున్నరేళ్లలో ఈ రెండు గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసిన దాఖలాల్లేవని, గూడూరులో తాగునీరు, పోడు భూములకు పట్టాలు, తునికాకుకు బోనస్, ఎత్తిపోతల పథకాలకు నిధులు ఇవ్వలేదని చెబుతూ గిరిజనులు అధికారులపై మండిపడ్డారు. నందిగామలో అ«ధికార పార్టీవారికే రేష¯ŒSకార్డులు, పింఛన్లు ఇస్తున్నారని, గౌరీదేవిపట్నంలో గత జన్మభూమి సమస్యల పరిష్కారంపై సమాధానం చెప్పేవరకూ సభ నిర్వహించరాదని అడ్డుకున్నారు.
మరిన్నిచోట్ల నిలదీతలు
∙తమ ఆరోగ్యాలను దెబ్బతీస్తున్న దుమ్ముల ఫ్యాక్టరీని వెంటనే తొలగించాలని జగ్గంపేట మండలం రాజపూడి గ్రామస్తులు జన్మభూమిని అడ్డుకున్నారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుర్గంధం భరించలేకపోతున్నామని, ఇందుకు ‘మీ వైçఫల్యమే కారణమ’ని తహసీల్దార్ శివమ్మను నిలదీశారు. సుమారు అరగంటపాటు కార్యక్రమాన్ని నిలిపివేశారు. జలసిరి ప«థకంలో వేస్తున్న బోర్లను ఎమ్మెల్యే చెప్పినవారికే ఇస్తామని డ్వామా పీడీ నాగేశ్వరరావు ప్రకటించడంపై స్థానికులు మండిపడ్డారు. ఆయన ప్రసంగం టీడీపీ కార్యకర్త మాదిరిగా సాగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
∙గడచిన మూడు జన్మభూమి సభల్లోనూ కబేళా సమస్య గురించి చెప్పుకున్నా ఇప్పటికీ పరిష్కరించలేదని గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు.
Advertisement
Advertisement