public fight
-
దివాకర్ ట్రావెల్స్‌పై ప్రజా పోరాటం!
‘ప్రైవేటు బస్సు మాఫియాపై పోరాట సమితి’ పేరిట వేదిక ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: కనీస ప్రమాణాలు లేకుండా, జాగ్ర త్తలు చేపట్టకుండా బస్సులను తిప్పుతున్న దివాకర్ ట్రావెల్స్ వంటి ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు, వాటికి అండగా నిలుస్తున్న ఏపీ సర్కారు తీరును ఎండగట్టేం దుకు ప్రజా పోరాటం మొదలవుతోంది. మూడున్నరేళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా పాలెం శివారులో దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు దగ్ధమై 45 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. తాజాగా అదే ట్రావెల్స్ కు చెందిన బస్సు కాలువలో పడిపోయి 11 మంది దుర్మరణం పాలయ్యారు. ఇలాంటి ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు, వాటికి అండగా నిలుస్తున్న ప్రభుత్వాలపై పోరాటం కోసం కొందరు బాధితులు, మరికొందరు కలసి ‘ప్రైవేటు బస్సు మాఫియాపై పోరాట సమితి’ పేరిట ఓ వేదికను ఏర్పాటు చేశారు. నిర్లక్ష్యంతో అమాయకులను బలితీసుకుంటున్న ట్రావెల్స్‌ను మూసివేయించడమే లక్ష్యంగా నిర్ణయించినట్టు ఈ వేదిక అధ్య క్షురాలు రేఖ పేర్కొంటున్నారు. పాలెం ఘటన బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా కృషి చేసిన సుధాకర్ ఈ వేదికకు గౌరవాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. -
నిరసనల సెగ
అధికార పార్టీ ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్న జనం జన్మభూమిభల్లో సమస్యలపై నిలదీత పోలీసు బందోబస్తుతోనే హాజరవుతున్న టీడీపీ నేతలు జన్మభూమి మా ఊరు గ్రామసభల్లో అధికార టీడీపీ ప్రజాప్రతినిధులకు సమస్యల కాక తగులుతోంది. రెండున్నరేళ్లుగా ప్రజాసమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు.. ఇప్పుడు జన్మభూమి పేరుతో ‘సమస్యలు చెప్పండి.. పరిష్కరిస్తామ’ని చెబుతూ కొత్త నాటకానికి తెర తీస్తున్నారంటూ ప్రజలు ఎక్కడికక్కడ ఆగ్రహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలపై తిరుగుబాటు చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : జన్మభూమి – మా ఊరు గ్రామసభల్లో రెండో రోజైన మంగళవారం కూడా ప్రజలు టీడీపీ ప్రజాప్రతిని ధులను తమ సమస్యలపై నిలదీశారు. కొన్నిచోట్ల ప్రజాగ్రహానికి భయపడిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాకే సభలకు వెళ్లడం కనిపించింది. ఖాకీ కవచంలో.. ∙అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లిలో చుక్కెదురైంది. సన్నవిల్లికి మంజూరైన పశుమిత్ర పోస్టును జన్మభూమి కమిటీ అక్రమాలకు పాల్పడి నంగవరానికి తరలించడంపై పార్టీలకతీతంగా ఏకమైన స్థానికులు మూకుమ్మడిగా గ్రామసభను అడ్డుకున్నారు. కనీసం షామియానాలు కూడా వేయనివ్వకుండా ఆగ్రహం వ్యక్తం చేశారు. నచ్చచెప్పేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిం చినా వారు ససేమిరా అన్నారు. చివరకు పోలీసు బందోబస్తు నడుమ ‘మమ’ అనిపించారు. ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సొంత మండలం ఉప్పలగుప్తంలో ఈ పరిస్థితి ఎదురవడం విశేషం. ∙ప్రత్తిపాడు మండలం రాచపల్లిలో కూడా పోలీసు బందోబస్తు మధ్య జన్మభూమి నిర్వహించారు. గతంలో జనచైతన్య యాత్రలో టీడీపీకి చెందిన దివంగత పర్వత చిట్టిబాబు వర్గీయులు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పనితీరుపై నిరసన తెలిపారు. జన్మభూమి కమిటీలను కూడా మార్చారు. దీనిపై టీడీపీలోని ఆయన వైరివర్గం ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకుని జన్మభూమి నిర్వహించారు. ఆదిరెడ్డిపై మహిళల ఆగ్రహం రాజమహేంద్రవరం 14వ డివిజ¯ŒSలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మహిళల ఆగ్రహాన్ని చవి చూశారు. మహిళా సంక్షేమ పథకాల అమలులో వివక్షపై ఆదిరెడ్డిని కార్పొరేటర్ ఈతకోట బాపనసుధారాణి తీవ్రస్థాయిలో నిలదీశారు. అటువంటప్పుడు జన్మభూమి గ్రామసభలు నిర్వహించి, సమస్యలు అడిగి తెలుసుకోవడం దేనికని మహిళలు ప్రశ్నించడంతో ఎమ్మెల్సీ బిత్తరపోయారు. మన్యంలో బహిష్కరణల పర్వం ∙మారేడుమిల్లి మండలం సున్నంపాడులో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆధ్వర్యాన స్థానికులు జన్మభూమి గ్రామసభను బహిష్కరించారు. నూరుపూడి గ్రామానికి వంతెన, రామన్నవలసకు రహదారి నిర్మించాలంటూ మూడో విడత జన్మభూమిలో స్థానికులు విన్నవించారు. దీంతో ఈ సమస్యను పరిష్కరిస్తామని అప్పట్లో అధికారులు లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ పరిష్కారం లభించకపోవడంతో ఆగ్రహించిన గిరిజనులు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గ్రామసభను బహిష్కరించారు. ∙రాజవొమ్మంగి మండలం మారేడుబాక పంచాయతీలో గురువారం జరగాల్సిన గ్రామసభను జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు కోసం ఉర్లాకులపాడులో మంగళవారమే నిర్వహించేశారు. అది కూడా పంచాయతీ కార్యాలయంలో కాకుండా జెడ్పీటీసీ ఇంటి దగ్గర్లో పెట్టారు. దీనిని నిరసిస్తూ గ్రామసభను గిరిజనులంతా బహిష్కరించారు. ∙పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారంపై స్పష్టత ఇవ్వాలని వీఆర్ పురం మండలం రేఖపల్లి, పెదమట్టపల్లి గ్రామసభల్లో గిరిజనులు నిలదీశారు. ఎటపాక మండలం నందిగామలో అధికార పార్టీవారికే పింఛన్లు, రేష¯ŒSకార్డులు ఇస్తున్నారని నిలదీశారు. చింతూరు మండలం తుమ్మలలో జరిగిన గ్రామసభలో ఆహార భద్రత అంటూ ప్రతి ఇంటిలో ఒకరిద్దరికి రేష¯ŒS నిలిపివేస్తున్నా పట్టించుకున్న నాథుడే కరవయ్యాడని సర్పంచ్ సోడే దుర్గారావుతోపాటు గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతూరు, తుమ్మాల గ్రామసభల్లో గత హామీలపై అధికారులను నిలదీశారు. రెండున్నరేళ్లలో ఈ రెండు గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసిన దాఖలాల్లేవని, గూడూరులో తాగునీరు, పోడు భూములకు పట్టాలు, తునికాకుకు బోనస్, ఎత్తిపోతల పథకాలకు నిధులు ఇవ్వలేదని చెబుతూ గిరిజనులు అధికారులపై మండిపడ్డారు. నందిగామలో అ«ధికార పార్టీవారికే రేష¯ŒSకార్డులు, పింఛన్లు ఇస్తున్నారని, గౌరీదేవిపట్నంలో గత జన్మభూమి సమస్యల పరిష్కారంపై సమాధానం చెప్పేవరకూ సభ నిర్వహించరాదని అడ్డుకున్నారు. మరిన్నిచోట్ల నిలదీతలు ∙తమ ఆరోగ్యాలను దెబ్బతీస్తున్న దుమ్ముల ఫ్యాక్టరీని వెంటనే తొలగించాలని జగ్గంపేట మండలం రాజపూడి గ్రామస్తులు జన్మభూమిని అడ్డుకున్నారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుర్గంధం భరించలేకపోతున్నామని, ఇందుకు ‘మీ వైçఫల్యమే కారణమ’ని తహసీల్దార్ శివమ్మను నిలదీశారు. సుమారు అరగంటపాటు కార్యక్రమాన్ని నిలిపివేశారు. జలసిరి ప«థకంలో వేస్తున్న బోర్లను ఎమ్మెల్యే చెప్పినవారికే ఇస్తామని డ్వామా పీడీ నాగేశ్వరరావు ప్రకటించడంపై స్థానికులు మండిపడ్డారు. ఆయన ప్రసంగం టీడీపీ కార్యకర్త మాదిరిగా సాగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ∙గడచిన మూడు జన్మభూమి సభల్లోనూ కబేళా సమస్య గురించి చెప్పుకున్నా ఇప్పటికీ పరిష్కరించలేదని గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. -
జన్మభూమిలో జనాగ్రహం
రెండున్నరేళ్లయినా ఇంతేనా? ∙సమస్యలు పరిష్కరించేదెప్పుడు? ∙‘సంక్షేమం’లో ఏమిటీ ‘పచ్చ’పాతం? ∙అడుగడుగునా నిలదీసిన జనం ∙ప్రజల్లో గూడు కట్టుకున్న అసంతృప్తికి అద్దం పట్టిన గ్రామసభలు ∙పలుచోట్ల పలుచగా హాజరైన ప్రజానీకం రెండున్నరేళ్లుగా సమస్యలు పరిష్కారం కాకపోవడం.. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం చూపిస్తున్న ‘పచ్చ’పాతంపై జనాగ్రహం వెల్లువెత్తింది. నాలుగో విడత జన్మభూమి గ్రామసభలు సాక్షిగా.. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు తమ సమస్యలపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులను.. అధికారులను నిలదీశారు. తమ కష్టాలను గట్టెక్కించని జన్మభూమి గ్రామసభలు దేనికంటూ ప్రశ్నించారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై పెదవి విరుపులు.. నిలదీతలు.. బైఠాయింపులు.. బహిష్కరణలు.. ఇలా సోమవారం ప్రారంభమైన నాలుగో విడత జన్మభూమి సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇవే దృశ్యాలు కనిపించాయి. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చాక మూడు విడతల జన్మభూమి సభలు పెట్టారు. అప్పుడిచ్చిన దరఖాస్తులకే ఇంతవరకూ దిక్కూమొక్కూ లేదు. మరోసారి జన్మభూమి పెట్టి వాటినైనా పరిష్కరిస్తున్నారా అంటే అదీ లేదు. దీంతో ఈ గ్రామసభలు దరఖాస్తులు తీసుకోవడానికేనా అని జనం ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఆసక్తి చూపని జనం పింఛన్లు, రేష¯ŒSకార్డులు, ఇళ్ల రుణాలు ఇస్తామని ప్రభుత్వం ఊదరగొట్టినా ఈసారి జన్మభూమిపై జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. పరిష్కారం లభిస్తుందనే నమ్మకం లేనందువల్ల నే ప్రజల హాజరు పలుచబడింది. దీనిని కప్పిపుచ్చుకునేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు అప్పటికప్పుడు నానాతంటాలూ పడటం కనిపించింది. కోరుకొండ, జగ్గంపేట మండలం గొల్లగుంట జన్మభూమి సభలు జనం లేక వెలవెలబోయాయి. వచ్చినవారు కూడా పింఛన్లకోసమే వచ్చినట్టు ఉందంటూ గొల్లగుంటలో స్వయంగా అధికారులే అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. కోరుకొండ జన్మభూమికి ఆశించిన స్థాయిలో జనం రాలేదు. గత్యంతరం లేక అప్పటికప్పుడు విద్యార్థులను తీసుకువచ్చి మమ అనిపించేశారు. జిల్లాలోని పలు ఇతర ప్రాంతాల్లో జరిగిన గ్రామసభల్లో కూడా జనం పెద్దగా లేకపోవడం కనిపించింది. అడవిబిడ్డల ఆగ్రహం ∙‘‘మూడు జన్మభూమి కార్యక్రమాల్లో పింఛన్లు, రేష¯ŒSకార్డులు, పోడుభూమి పట్టాల కోసం తిరుగుతున్నాం. మంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేనప్పుడు నాలుగో విడత జన్మభూమి ఎందుకు’’ అంటూ ప్రజల తరఫున చింతూరు మండలం తులసిపాకలులో ఎంపీపీ చిచ్చడి మురళి అధికారులను నిలదీశారు. వచ్చే జన్మభూమినాటికైనా పరిష్కరించకుంటే ఊరి పొలిమేర్లకు కూడా రానివ్వబోమని హెచ్చరించారంటే విలీన మండలాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ∙ఎటపాక మండలం గుండాలలో గత జన్మభూమి సందర్భంగా ఇచ్చిన విజ్ఞాపనలు ఏమయ్యాయో చెప్పాలని గిరిజనులు అధికారులను ప్రశ్నించారు. అర్హులకు కూడా పింఛన్లు రద్దు చేయడమేమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ∙గత జన్మభూమిలో చెప్పిన సమస్యలు ఇంతవరకూ పరిష్కరించలేదని చింతూరు మండలం చిడుమూరులో ప్రజలు ఐటీడీఏ పీవో గుగ్గిలి చినబాబును ప్రశ్నించారు. ∙రాజవొమ్మంగి మండలం లోతట్టు గ్రామం వాతంగిలో కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందుల పాలే్జస్తున్న అధికారుల తీరుతో విసుగెత్తిపోయిన వాల్మీకి గిరిజనులు విద్యార్థులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. తహసీల్దార్‌ను ఘెరావ్ చేశారు. ఇంకా.. ∙గత జన్మభూమిలో పింఛన్లు, రేష¯ŒSకార్డుల కోసం ఇచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయని, వాటి సంగతి తేల్చకుండా, మరోసారి జన్మభూమి ఎందుకంటూ కోటనందూరు మండలం ఎస్ఆర్ పేట గ్రామసభలో అధికారులను, ప్రజాప్రతినిధులను స్థానికులు నిలదీశారు. ∙రామచంద్రపురం మండలం భీమక్రోసుపాలెంలో అర్హులైనవారికి ఇళ్లస్థలాలు ఇవ్వడంలేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ∙కరప మండలం అరట్లకట్ట జన్మభూమిలో 100 రోజుల పనిదినాలు కల్పనగానే మిగిలిందని నినదించిన కూలీల గొంతును పోలీసు బలంతో నొక్కేశారు. పబ్లిక్‌గా బయటపడిన ‘పచ్చ’పాతం ∙కోనసీమ ముఖద్వారం రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు జన్మభూమి గ్రామసభ వేదికగా అధికార పార్టీ ‘పచ్చ’పాతం పబ్లిక్‌గా బయటపడింది. ఆ మండలంలో పింఛన్ల కోసం 900 మంది దరఖాస్తు చేసుకుంటే 500 మంజూరయ్యాయి. అందులో జన్మభూమి జరుగుతున్న ముమ్మిడివరప్పాడులో 16 మంది దరఖాస్తు చేసుకుంటే తొమ్మిది మంజూరయ్యాయి. వీటిల్లో ఐదు మాత్రమే ఖరారు చేసినట్టు సభలో అధికారులు ప్రకటించారు. ఆ ఐదూ కూడా తెలుగు తమ్ముళ్లు సభ్యులుగా ఉన్న జన్మభూమి కమిటీలు చెప్పిన టీడీపీవారికే కట్టబెట్టారు. అర్హులు ఎంతోమంది ఉంటే ‘తమ్ముళ్ల’కే కట్టబెట్టడమేమిటంటూ వేదికపై ఉన్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మండిపడ్డారు. ∙రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం మండల స్త్రీశక్తి భవనంలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మరో అడుగు ముందుకేశారు. కొత్తగా మంజూరు చేస్తున్న పింఛన్లను తనకు, టీడీపీకి వ్యతిరేకంగా పని చేసినవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరాదని సూచించారు. డిప్యూటీ సీఎం సాక్షిగా ప్రొటోకాల్ ఉల్లంఘన పెద్దాపురం మండలం వడ్లమూరులో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సమక్షంలోనే మహిళా ప్రజాప్రతినిధులకు అవమానం జరిగింది. ఇక్కడ సంక్షేమ పథకాల పంపిణీలో స్థానిక సర్పంచ్ పాలచర్ల రమాదేవికి బదులు ఆమె భర్త ఉమామహేశ్వరరావు (బుజ్జి), ఎంపీటీసీ సభ్యురాలు చల్లా జయంతికి బదులు ఆమె భర్త చల్లా శ్రీనివాస్‌లు డిప్యూటీ సీఎంతోపాటు పాల్గొనడం చర్చనీయాంశమైంది. -
దివీస్‌పై...జన గర్జన
కాలుష్య విషం వద్దంటూ ఆందోళన సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎం.ఎల్.) లిబరేష¯ŒS తదితర నేతల అరెస్ట్ ఆందోళనపై పోలీసుల ఉక్కుపాదం ప్రతిఘటించిన బాధితులు తోపులాటలో సొమ్మసిల్లిన మహిళలు ఉలిక్కిపడిన కోన ప్రాంతం నాగుల చవితి పండుగకూ అడ్డంకులే... భవితను కాటేసే కాలుష్యకారకాలు మాకొద్దంటూ దివీస్ పరిశ్రమ ఏర్పాటుకు నిరసనగా ఉద్యమ గళం మరోసారి గర్జించింది. పోలీసుల పదఘట్టనలను ప్రతిఘటించి ఉక్కు పిడికిలి బిగించింది. అరెస్టులు ... లాఠీ ఛార్జీలు అడ్డుకోవాలేవంటూ వందలాదిమంది రోడ్డెక్కారు ... ప్రదర్శనలు చేశారు ... స్వచ్ఛంద అరెస్టులకు సిద్ధపడ్డారు. తొండంగి : కాలుష్య కారక పరిశ్రమ కోసం తమ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటే నేల తల్లిని నమ్ముకున్న తాము పొట్ట చేతపట్టుకుని ఎక్కడికి పోయేందంటూ దీవీస్ బాధిత గ్రామాల ప్రజలు గురువారం మరోసారి గర్జించారు. దీవీస్కు వ్యతిరేకంగా ఆది నుంచీ వేలాది మంది కోన ప్రాంత ప్రజలు చేస్తున్న ఉద్యమాన్ని అడుగడుగునా అణగతొక్కేందుకు ప్రభుత్వం ఖాకీల సాయంతో విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. నిబంధలనలకు వ్యతిరేకంగా తీరంలో జరుగుతున్న భూసేకరణను అడ్డుకుంటుంటే అక్రమ కేసులు, అణిచివేతలతో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారంటూ గురువారం దానవాయిపేటలో సీపీఎం, సీపీఐ, ఇతర వామపక్ష పార్టీలు బహిరంగ సభ నిర్వహించేందుకు పిలుపునిచ్చాయి. ఈ నేపధ్యంలో బుధవారం నుంచే పోలీసులు అప్రమత్తమై బాధిత గ్రామాలైన పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం, నర్శిపేట తదితర గ్రామాల్లో భారీగా పోలీసులను మోహరించారు. గురువారం ఉదయం నుంచి తీరప్రాంత గ్రామాల్లో పోలీసులు వాహనాల రాకపోకలు, సైరన్లతో హోరెత్తించారు. నాగుల చవితి పండుగను చేసుకోడానికి కూడా స్థానికులు బయటకు రాలేకపోయారు. ఒక్కసారిగా వేడిక్కిన సభాప్రాంతం మధ్యాహ్నం వరకూ ప్రశాంతంగా ఉన్న దానవాయిపేట శివారు నర్శిపేటలో మత్స్యకార కమ్యూనిటీ ప్రాంగణం దివీస్‌ను రద్దు చేయాలంటూ నిరసనలతో ఒక్కసారిగా వేడెక్కింది. సీపీఐ (ఎం.ఎల్) లిబరేష¯ŒS జిల్లా కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు, ఆ పార్టీ నాయకులు మానుకొండ లచ్చబాబు, కె.జనార్ధ¯ŒS తదితర నాయకులు నర్శిపేట రామాయలం వద్ద ఆందోళన మొదలెట్టారు. వీరికి మద్ధతుగా బాధిత గ్రామాల ప్రజలు ఒక్కసారిగా వీధుల్లోంచి సుమారు నాలుగొందల మంది వరకూ దశలవారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్ధితి నెలకొంది. నేతల అరెస్టు పోలీసుల యత్నం, అడ్డుకున్న బాధిత ప్రజలు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర నాయకుడు రాజుల వెంకయ్య, జిల్లా కార్యదర్శి శేషుబాబ్జి తదితరులు సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. డీఎస్పీ రాజశేఖర్, తునిరూరల్ సీఐ చెన్నకేశవరావు, తుని పట్టణ సీఐ అప్పారావు, ఎస్సై బి.కృష్ణమాచారి ఇతర పోలీసులు సిబ్బంది అక్కడకు చేరుకుని 144 సెక్ష¯ŒS అమలులో ఉందని, సభకు ఎటువంటి అనుమతి లేదంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో చర్చలు జరిపారు. ్రçఅదుపులోకి తీసకునేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ వెంటనే జనం మధును తమ మధ్యలోకి జనం తీసుకెళ్లిపోయారు. డీఎస్పీ రాజశేఖర్ ఇతర సిబ్బంది మధును అదుపులోకి తీసుకుని బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వాహనంలోకి ఎత్తిపడేశారు. పోలీసుల లాఠీల దెబ్బలకు పంపాదిపేటకు చెందిన మట్ల సుబ్బలక్షి్మకి గాయాలవడంతోపాటు సొమ్మసిల్లిపడిపోయింది.. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారావుతోపాటు దివీస్ వ్యతిరేక న్యాయ పోరాట కమిటి నాయకులు మట్ల ముసలయ్య, గంపల దండు, మాజీ జెడ్పీటీసీ అంగుళూరి అరుణ్‌కుమార్, అంగుళూరి శ్రీనివాస్, యనమల నాగేశ్వరరావు, అంబుజాలపు నాగ కృష్ణవేణి, అంగుళూరి చిన్నారి, అంగుళూరి బేబి తదితరులతోపాటు సుమారు 1500 మంది వరకూ రోడ్డుపై నిరసన ప్రదర్శన చేశారు. మహిళలు, యువత బీచ్‌రోడ్డుపై నర్శిపేట నుంచి తాటియాకులపాలెం మీదుగా ఒంటిమామిడి వరకూ పాదయాత్ర చేశారు. అనంతరం ఒంటిమామిడి సెంటర్ వద్ద నరసింహారావుతోపాటు ఇతర నాయకులను అరెస్టుచేసి వ్యాన్‌లో ఎక్కించి అన్నవరం, ప్రత్తిపాడు, తుని రూరల్, తునిపట్టణ పోలీస్‌స్టేçÙన్లకు తరలించారు. అడుగడుగునా పోలీసు వాహనాలను ముందుకుపోకుండా ఆందోళనకారులు అవరోధాలు సృష్టించారు నర్శిపేట, ఒంటిమామిడిలలో అరెస్టైన నేతలు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి. నరసింహారావు, సీపీఐ రాష్ట్ర నాయకుడు రాజుల వెంకయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.వేణుగోపాల్, వ్యవసాయకార్మీక సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, రైతుసంఘం జిల్లా కార్యదర్శి జి.అప్పారెడ్డి, ఐద్వా నాయకురాలు అంబుజాలపు కృష్ణవేణి అంగుళూరి , సీపీఎం పిఠాపురం ఏరియా కార్యదర్శి సింహాచలం, సీపీఐ తుని ఏరియా కార్యదర్శి శివకోటి రాజు, ప్రజానాట్యమండలి రాష్ట్రనాయకులు డి.క్రాంతి కుమార్, ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి, డివైఎఫ్ఐ పెద్దాపురం కన్వీనర్. వై.రమేష్ పి.రాజా, దివీస్ వ్యతిరేక న్యాయపోరాట కమిటీ నాయకులు, మహిళలు, రైతులు అరెస్టైన వారిలో ఉన్నారు. ఉద్యమాలతో వేడెక్కుతున్న తీర గ్రామాలు... పంపాదిపేట, తాటియాకులపాలెం, కొత్తపాకలు గ్రామాల చేపట్టిన ఉద్యమాలతో క్రమంగా వేడెక్కుతుంది. తొలుత 505 ఎకరాలుగా ప్రకటించిన ప్రభుత్వం మరో 170 ఎకరాల వరకూ విస్తరిస్తుందని తెలియడంతో బాధిత గ్రామాల ప్రజలకు తోడుగా శృంగవృక్షంపేట, వాకదారిపేట గ్రామాల ప్రజలు కూడా ఉద్యమానికి బాసటగా నిలుస్తున్నారు. ప్రభుత్వం ఆటవిక పాలన సాగిస్తోంది సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపణ కోటనందూరు : రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆటవిక పాలన సాగిస్తున్నదని సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి కె.మధు ఆరోపించారు.అరెస్టు చేసిన సందర్భం గా విలేకరుల సమావేశంలో మధు మాట్లాడుతూ సభ నిర్వహణకు వారం రోజుల ముందే పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని. అప్పుడు అనుమ తించిన అధికారులు బుధవారం ఫో¯ŒSలో సభకు అనుమతి లేదన్నారని, గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సభ ఏర్పాట్లలో ఉన్న తమపై సీఐ చెన్నకేశవరావు అప్రజాస్వామికంగా వ్యవహరించారన్నారు. నాపై చేయి చేసుకున్న సీఐపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. ఈ నెల 28న ఢిల్లీ నుంచి జాతీయ స్థాయి నాయకులను తీసుకొచ్చి దివీస్ ప్రాంతంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రావుల వెంకయ్య మాట్లాడుతూ పేదల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తుందని అందుకు పోలీసులను పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ దివీస్ ఏర్పాటుకు 650 ఎకరాల భూమి అవసరమని తీర్మానించారని, పేదవారైన ఆప్రాంత ప్రజలు ఒకొక్కరి దగ్గర ఎకరం, ఎకరన్నర భూమి మాత్రమే ఉందన్నారు. ప్రస్తుతం ఎకరం ఖరీదు రూ. 35 నుండి 40 లక్షలు పలుకుతుంటే ప్రభుత్వం కేవలం రూ. 5 లక్షలు ఇచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు. రూ. 400 కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ. 25 కోట్లకు దక్కించుకొని తమ బందువులకు ధారాదత్తం చేసే ప్రయత్నం పాలకులు చేస్తున్నారని ఆరోపించారు. -
ఆయన ‘తోట’లోనే నిరసన సెగలు
∙ఎమ్మెల్యే త్రిమూర్తుల స్వగ్రామంలో తిరుగుబాటు ∙శిరోముండనం కేసులో బిగుస్తున్న ఉచ్చు ∙అసహనంతో అనుచిత వ్యాఖ్యలు వెంకటాయపాలెం(రామచంద్రపురం రూరల్) : రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు సొంత గ్రామం వెంకటాయపాలెంలోనే నిరసనల సెగ గట్టిగా తగులుతోంది. శిరోముండనం కేసు తుది విచారణ దగ్గర పడుతున్న నేప«థ్యంలో ఎమ్మెల్యేలో అసహనం పెరిగిపోతోందని ఆయన అనుచరులే గుసగుసలాడుకుంటున్నారు. ఇటీవల నీటి పారుదల సలహా సంఘ సమావేశంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్పై విరుచుకుపడిన తీరు ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.దీంతోపాటు ఇటీవల కాలంలో నియోజకవర్గంలో కూడా పలువురిపై ఇదే విధంగా చిందులు తొక్కడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనికి తోడు ఆయనకు వ్యతిరేకంగా తన నియోజకవర్గంలోనే నిరసన సెగలు చెలరేగడంతో మరింత ఒత్తిడికి గురవుతున్నట్టుగా కనిపిస్తోంది. దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు...: శిరోముండనం కేసు వ్యవహారంలో ప్రభుత్వ ప్రమేయంతో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఆయన సొంత గ్రామమైన వెంకటాయపాలెంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించగా శుక్రవారం రెండో రోజూ దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగింది. ఈ శిబిరంలో గ్రామస్తులు బత్తుల బాలయ్య, నందికోళ్ల సత్తియ్య, కాకర విష్ణుమూర్తి, బొడ్డువారి పేట గ్రామస్తులు బొడ్డు శ్రీను, బొడ్డు కామరాజు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కార్యదర్శి వెంటపల్లి భీమశంకరం, పీవైఎల్ డివిజ¯ŒS కార్యదర్శి మల్లవరపు రాజు, ఏఐకేఎంఎస్ నాయకుడు ఎం.రాముడు, జై భీం దళిత సేవా సంఘం నాయకుడు చెట్లర్ కర్ణ దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షా శిబిరాన్ని కె.గంగవరం ఎంపీపీ, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెట్టా శ్రీనివాసరావు, దళిత స్త్రీ శక్తి రాష్ట్ర కోఆర్డినేటర్ కొంకి రాజామణి, నాయకురాలు ఎస్. నాగమణిలు సందర్శించి మద్ధతు పలికారు. శిరోముండనం కేసులో ముద్దాయిలకు శిక్ష పడేవరకు పోరాటం ఆపేది లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ దళిత సేవా సంఘం కార్యదర్శి దడాల వెంకటరమణ, దళిత ఐక్య పోరాట వేదిక కన్వీనర్ నీలం మధుసూదనరావు, పీవైఎల్ నాయకులు గుత్తుల వెంకటరమణ, ఏఐకేఎంఎస్ నాయకుడు గెద్దాడ సూరిబాబు, పీవైఎల్ నాయకుడు అంబటి కృష్ణ, వెంకటాయపాలెం ఎంపీటీసీ దడాల వెంకటరమణలు పాల్గొన్నారు. మహిళల ఆధ్వర్యంలో నిరశనలే...: వెంకటాయపాలెంలోని చిన్నంపేటలో అప్పటి ఎమ్మెల్యే పిల్లి అప్పారావు దాతల నుంచి సేకరించిన స్థలంలో కీ.శే. మల్లిపూడి పల్లంరాజు పేరుతో కమ్యూనిటీ హాలు, ఆడిటోరియం నిర్మించారు. ప్రస్తుతం ఇదే స్థలంలో 33/11 కేవీ సబ్ స్టేష¯ŒS నిర్మించాలని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నిర్ణయించారు. దీంతో గ్రామంలో ప్రజలకు తెలియకుండానే పంచాయతీ తీర్మానం కూడా జరిగిపోయింది. దీనిపై గ్రామస్తులు వ్యతిరేకించి సబ్‌స్టేçÙ¯ŒS అక్కడ వద్దని పోరాటం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు బుధవారం సాయంత్రం విద్యుత్ శాఖ అధికారులతో కలిసి మార్కింగ్ చేయాలని ప్రయత్నం చేయగా ‘ ఇక్కడ సబ్ స్టేష¯ŒS వద్దని విజ్ఞప్తి చేయగా’ ‘మీరు చెబితే నేను ఆగడం ఏమిటి? ఎవరు అడ్డు వచ్చినా ఇక్కడ సబ్‌స్టేçÙ¯ŒS నిర్మాణం ఆగదు’ అనడంతో మహిళల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఇళ్ల మధ్యలో సబ్ స్టేష¯ŒS నిర్మాణానికి తాము ఎంతమాత్రం ఒప్పుకునేది లేదని, అవసరమైతే ఒంటిపై కిరోసి¯ŒS పోసుకుని ఆత్మాహుతికైనా సిద్ధపడతామని’ హెచ్చరించారు. సర్ధిచెప్పాల్సిన ఎమ్మెల్యే ‘పది మంది చచ్చినంత మాత్రాన నష్టం లేదని’ నిర్లక్ష్యంగా అనడాన్ని స్థానికులు తప్పుపడుతున్నారు. ఆయన వ్యాఖ్యలపై గురువారం సమావేశమై శుక్రవారం నుంచి రిలే నిరాహా దీక్షలు చేయడానికి కూర్చున్నామని, సబ్ స్టేష¯ŒS నిర్మాణం ఆలోచన విడిచిపెట్టేవరకు తమ దీక్ష కొనసాగిస్తామని తెలిపారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యవర్గ సభ్యుడు వాసంశెట్టి శ్రీనివాసకుమార్(శ్యాం) నిరాహార దీక్ష శిభిరాన్ని ప్రారంభించారు. కె.గంగవరం ఎంపీపీ, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెట్టా శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి శ్రీనివాసరామారావు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శి ఇసుకపట్ల శ్యామల, గ్రామ మాజీ సర్పంచ్ పిల్లి రాంబాబు, మందపల్లి మోషే, పిల్లి చంద్రరావులు మహిళల నిరసన దీక్షకు మద్దతు పలికారు.