ఆయన ‘తోట’లోనే నిరసన సెగలు | mla thota siromundanam issue..public fight | Sakshi
Sakshi News home page

ఆయన ‘తోట’లోనే నిరసన సెగలు

Published Sat, Oct 29 2016 12:07 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM

mla thota siromundanam issue..public fight

  • ∙ఎమ్మెల్యే త్రిమూర్తుల స్వగ్రామంలో  తిరుగుబాటు
  • ∙శిరోముండనం కేసులో బిగుస్తున్న ఉచ్చు
  • ∙అసహనంతో అనుచిత వ్యాఖ్యలు
  • వెంకటాయపాలెం(రామచంద్రపురం రూరల్‌) :
    రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు సొంత గ్రామం వెంకటాయపాలెంలోనే నిరసనల సెగ గట్టిగా తగులుతోంది. శిరోముండనం కేసు తుది విచారణ దగ్గర పడుతున్న నేప«థ్యంలో ఎమ్మెల్యేలో అసహనం పెరిగిపోతోందని ఆయన అనుచరులే గుసగుసలాడుకుంటున్నారు. ఇటీవల నీటి పారుదల సలహా సంఘ సమావేశంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌పై విరుచుకుపడిన తీరు ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.దీంతోపాటు ఇటీవల కాలంలో నియోజకవర్గంలో కూడా పలువురిపై ఇదే విధంగా చిందులు తొక్కడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనికి తోడు ఆయనకు  వ్యతిరేకంగా తన నియోజకవర్గంలోనే నిరసన సెగలు చెలరేగడంతో మరింత ఒత్తిడికి గురవుతున్నట్టుగా కనిపిస్తోంది. 
     
    దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు...:
    శిరోముండనం కేసు వ్యవహారంలో ప్రభుత్వ ప్రమేయంతో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఆయన సొంత గ్రామమైన వెంకటాయపాలెంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద గురువారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించగా శుక్రవారం రెండో రోజూ దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగింది. ఈ శిబిరంలో గ్రామస్తులు బత్తుల బాలయ్య, నందికోళ్ల సత్తియ్య, కాకర విష్ణుమూర్తి, బొడ్డువారి పేట గ్రామస్తులు బొడ్డు శ్రీను, బొడ్డు కామరాజు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కార్యదర్శి వెంటపల్లి భీమశంకరం, పీవైఎల్‌ డివిజ¯ŒS కార్యదర్శి మల్లవరపు రాజు, ఏఐకేఎంఎస్‌ నాయకుడు ఎం.రాముడు, జై భీం దళిత సేవా సంఘం నాయకుడు చెట్లర్‌ కర్ణ దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షా శిబిరాన్ని కె.గంగవరం ఎంపీపీ, వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పెట్టా శ్రీనివాసరావు, దళిత స్త్రీ శక్తి రాష్ట్ర కోఆర్డినేటర్‌ కొంకి రాజామణి, నాయకురాలు ఎస్‌. నాగమణిలు సందర్శించి మద్ధతు పలికారు. శిరోముండనం కేసులో ముద్దాయిలకు శిక్ష పడేవరకు పోరాటం ఆపేది లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జై భీమ్‌ దళిత సేవా సంఘం కార్యదర్శి దడాల వెంకటరమణ, దళిత ఐక్య పోరాట వేదిక కన్వీనర్‌ నీలం మధుసూదనరావు, పీవైఎల్‌ నాయకులు గుత్తుల వెంకటరమణ, ఏఐకేఎంఎస్‌ నాయకుడు గెద్దాడ సూరిబాబు, పీవైఎల్‌ నాయకుడు అంబటి కృష్ణ, వెంకటాయపాలెం ఎంపీటీసీ దడాల వెంకటరమణలు పాల్గొన్నారు.
     
    మహిళల ఆధ్వర్యంలో నిరశనలే...:
    వెంకటాయపాలెంలోని చిన్నంపేటలో అప్పటి ఎమ్మెల్యే పిల్లి అప్పారావు దాతల నుంచి సేకరించిన స్థలంలో కీ.శే. మల్లిపూడి పల్లంరాజు పేరుతో కమ్యూనిటీ హాలు, ఆడిటోరియం నిర్మించారు. ప్రస్తుతం ఇదే స్థలంలో 33/11 కేవీ సబ్‌ స్టేష¯ŒS నిర్మించాలని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నిర్ణయించారు. దీంతో గ్రామంలో ప్రజలకు తెలియకుండానే పంచాయతీ తీర్మానం కూడా జరిగిపోయింది. దీనిపై గ్రామస్తులు వ్యతిరేకించి సబ్‌స్టేçÙ¯ŒS అక్కడ వద్దని పోరాటం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు బుధవారం సాయంత్రం విద్యుత్‌ శాఖ అధికారులతో కలిసి  మార్కింగ్‌ చేయాలని ప్రయత్నం చేయగా ‘ ఇక్కడ సబ్‌ స్టేష¯ŒS వద్దని విజ్ఞప్తి చేయగా’ ‘మీరు చెబితే నేను ఆగడం ఏమిటి? ఎవరు అడ్డు వచ్చినా ఇక్కడ సబ్‌స్టేçÙ¯ŒS నిర్మాణం ఆగదు’ అనడంతో మహిళల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఇళ్ల మధ్యలో సబ్‌ స్టేష¯ŒS నిర్మాణానికి తాము ఎంతమాత్రం ఒప్పుకునేది లేదని, అవసరమైతే ఒంటిపై కిరోసి¯ŒS పోసుకుని ఆత్మాహుతికైనా సిద్ధపడతామని’ హెచ్చరించారు. సర్ధిచెప్పాల్సిన ఎమ్మెల్యే ‘పది మంది చచ్చినంత మాత్రాన నష్టం లేదని’ నిర్లక్ష్యంగా అనడాన్ని స్థానికులు తప్పుపడుతున్నారు. ఆయన వ్యాఖ్యలపై గురువారం సమావేశమై శుక్రవారం నుంచి రిలే నిరాహా దీక్షలు చేయడానికి కూర్చున్నామని, సబ్‌ స్టేష¯ŒS నిర్మాణం ఆలోచన విడిచిపెట్టేవరకు తమ దీక్ష కొనసాగిస్తామని తెలిపారు. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర బీసీ సెల్‌ కార్యవర్గ సభ్యుడు వాసంశెట్టి శ్రీనివాసకుమార్‌(శ్యాం) నిరాహార దీక్ష శిభిరాన్ని ప్రారంభించారు. కె.గంగవరం ఎంపీపీ, వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పెట్టా శ్రీనివాసరావు, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి శ్రీనివాసరామారావు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ సంయుక్త కార్యదర్శి ఇసుకపట్ల శ్యామల, గ్రామ మాజీ సర్పంచ్‌ పిల్లి రాంబాబు, మందపల్లి మోషే, పిల్లి చంద్రరావులు మహిళల నిరసన దీక్షకు మద్దతు పలికారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement