mla thota
-
మా కాలనీకి మీరేం చేశారు?
కె.గంగవరం : తమ కాలనీకి ఏం చేశారో చెప్పాలం టూ రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులను ప్రజలు నిలదీశారు. సమస్యలు పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే స్థానికులపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేకు వెన్నుదన్నుగా నిలిచిన సొంత సామాజిక వర్గంవారే ఆయనను నిలదీయడం కొస మెరుపు. జనచైతన్య యాత్రలో భాగంగా ఎమ్మెల్యే త్రిమూర్తులు బుధవారం కె.గంగవరం, రైల్వే కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. డ్రెయినేజీ వ్యవస్థ ఆధ్వానంగా ఉందని, చుక్క తాగునీరు కూడా ఉండడం లేదని కాలనీ వాసులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. వారు అక్కడితో ఊరుకోకుండా తమ సమస్యలను కనీసం స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్యే త్రిమూర్తులను నిలదీశారు. తాము ఫిర్యాదు చేస్తున్నా స్థానిక ప్రజాప్రతినిధులను మీరెందుకు అడగటం లేదని వారు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తు ఎన్నికల్లో డబ్బులు తీసుకుని ఓటేశారని, నేను మీకేం చేయాలంటూ ధ్వజమెత్తారు. దీంతో మండిపడ్డ స్థానికులు తామెవరం డబ్బులు తీసుకుని ఓటేయలేదని ఘాటుగానే బదులిచ్చారు. దీంతో ఖంగుతిన్న ఎమ్మెల్యే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు సమస్యను వివరించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
స్వగ్రామంలో ఎమ్మెల్యే తోటకు చుక్కెదురు
జనావాసాల మధ్య సబ్‌స్టేçÙ¯ŒSను వ్యతిరేకిస్తూ 20 రోజులుగా రిలే దీక్షలు శిబిరాన్ని ఖాళీ చేయాలని పోలీసుల హుకుం వేరే ప్రాంతంలో దీక్ష కొనసాగింపు వెంకటాయపాలెం (రామచంద్రపురం రూరల్): స్వగ్రామం వెంకటాయపాలెంలో జనావాసాల మధ్య విద్యుత్ సబ్ స్టేç షన్ నిర్మించాలనే ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు యత్నానికి గ్రామస్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 20 రోజులుగా గ్రామస్తులు రిలే దీక్షలు చేస్తున్నారు. ఆ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం ద్రాక్షారామ ఎస్సై ఫజులు రహ్మాన్, పోలీసులతో వచ్చి మార్గానికి ఇబ్బందిగా ఉందని, దీక్షా శిబిరాన్ని మార్చాలని ఆందోళనకారులను కోరారు. దాంతో దీక్షలో ఉన్న మహిళలు 20 ఇరవై రోజులుగా అడ్డుగా లేనిది ఇప్పుడు అడ్డు వచ్చిందా అంటూ దీక్షలో ఉన్న మహిళలు నిలదీయడంతో వారు వెళ్లిపోయారు. కొంత సేపటికి తిరిగి వచ్చిన పోలీసులు శిబిరాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. దాంతో గ్రామస్తులు టెంట్‌ను ఖాళీచేసి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో దీక్షలు కొనసాగించారు. స్వగ్రామంలో సమస్యలు వదిలి జనచైతన్య యాత్రలా? ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు స్వగ్రామం వెంకటాయపాలెంలో రెండు నిరాహార దీక్షా శిబిరాలు జరుగుతున్నాయి. వాటిలో ఒకటి జనావాసాల మధ్య విద్యుత్ సబ్‌స్టేçÙన్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నది. మరొకటి వెంకటాయపాలెం దళితులు శిరోముండనం కేసులో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తున్నది. వీటిని పట్టించుకోకుండా జన చైతన్య యాత్రలంటూ నియోజకవర్గంలో తిరగడానికి సిగ్గు లేదా అని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులును వైఎస్సార్ సీపీ బీసీ సెల్ కార్యవర్గ సభ్యుడు వాసంశెట్టి శ్రీనివాసకుమార్ (శ్యామ్) దుయ్యబట్టారు. బుధవారం నాటి దీక్షల్లో వాసంశెట్టి శ్రీనివాసకుమార్ (శ్యామ్), పిల్లి శ్రీనివాస రామారావు, అనుసూరి వెంకటరమణ, వాసంశెట్టి సత్యనారాయణ, దార్ల పాపారావు, పిల్లి రాంబాబు, దార్ల సత్యనారాయణ, వాసంశెట్టి ఏడుకొండలు, విత్తనాల కాంతమ్మ, ఈతకోట భవాని, కడలి లక్ష్మిసుకన్య, వాసంశెట్టి సత్తెమ్మ, మందపల్లి జ్యోతి, మందపల్లి రాణి, కుడుపూడి హైమావతి, పిల్లి చంద్రరావు కూర్చున్నారు. -
ఆయన ‘తోట’లోనే నిరసన సెగలు
∙ఎమ్మెల్యే త్రిమూర్తుల స్వగ్రామంలో తిరుగుబాటు ∙శిరోముండనం కేసులో బిగుస్తున్న ఉచ్చు ∙అసహనంతో అనుచిత వ్యాఖ్యలు వెంకటాయపాలెం(రామచంద్రపురం రూరల్) : రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు సొంత గ్రామం వెంకటాయపాలెంలోనే నిరసనల సెగ గట్టిగా తగులుతోంది. శిరోముండనం కేసు తుది విచారణ దగ్గర పడుతున్న నేప«థ్యంలో ఎమ్మెల్యేలో అసహనం పెరిగిపోతోందని ఆయన అనుచరులే గుసగుసలాడుకుంటున్నారు. ఇటీవల నీటి పారుదల సలహా సంఘ సమావేశంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్పై విరుచుకుపడిన తీరు ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.దీంతోపాటు ఇటీవల కాలంలో నియోజకవర్గంలో కూడా పలువురిపై ఇదే విధంగా చిందులు తొక్కడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనికి తోడు ఆయనకు వ్యతిరేకంగా తన నియోజకవర్గంలోనే నిరసన సెగలు చెలరేగడంతో మరింత ఒత్తిడికి గురవుతున్నట్టుగా కనిపిస్తోంది. దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు...: శిరోముండనం కేసు వ్యవహారంలో ప్రభుత్వ ప్రమేయంతో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఆయన సొంత గ్రామమైన వెంకటాయపాలెంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించగా శుక్రవారం రెండో రోజూ దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగింది. ఈ శిబిరంలో గ్రామస్తులు బత్తుల బాలయ్య, నందికోళ్ల సత్తియ్య, కాకర విష్ణుమూర్తి, బొడ్డువారి పేట గ్రామస్తులు బొడ్డు శ్రీను, బొడ్డు కామరాజు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కార్యదర్శి వెంటపల్లి భీమశంకరం, పీవైఎల్ డివిజ¯ŒS కార్యదర్శి మల్లవరపు రాజు, ఏఐకేఎంఎస్ నాయకుడు ఎం.రాముడు, జై భీం దళిత సేవా సంఘం నాయకుడు చెట్లర్ కర్ణ దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షా శిబిరాన్ని కె.గంగవరం ఎంపీపీ, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెట్టా శ్రీనివాసరావు, దళిత స్త్రీ శక్తి రాష్ట్ర కోఆర్డినేటర్ కొంకి రాజామణి, నాయకురాలు ఎస్. నాగమణిలు సందర్శించి మద్ధతు పలికారు. శిరోముండనం కేసులో ముద్దాయిలకు శిక్ష పడేవరకు పోరాటం ఆపేది లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ దళిత సేవా సంఘం కార్యదర్శి దడాల వెంకటరమణ, దళిత ఐక్య పోరాట వేదిక కన్వీనర్ నీలం మధుసూదనరావు, పీవైఎల్ నాయకులు గుత్తుల వెంకటరమణ, ఏఐకేఎంఎస్ నాయకుడు గెద్దాడ సూరిబాబు, పీవైఎల్ నాయకుడు అంబటి కృష్ణ, వెంకటాయపాలెం ఎంపీటీసీ దడాల వెంకటరమణలు పాల్గొన్నారు. మహిళల ఆధ్వర్యంలో నిరశనలే...: వెంకటాయపాలెంలోని చిన్నంపేటలో అప్పటి ఎమ్మెల్యే పిల్లి అప్పారావు దాతల నుంచి సేకరించిన స్థలంలో కీ.శే. మల్లిపూడి పల్లంరాజు పేరుతో కమ్యూనిటీ హాలు, ఆడిటోరియం నిర్మించారు. ప్రస్తుతం ఇదే స్థలంలో 33/11 కేవీ సబ్ స్టేష¯ŒS నిర్మించాలని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నిర్ణయించారు. దీంతో గ్రామంలో ప్రజలకు తెలియకుండానే పంచాయతీ తీర్మానం కూడా జరిగిపోయింది. దీనిపై గ్రామస్తులు వ్యతిరేకించి సబ్‌స్టేçÙ¯ŒS అక్కడ వద్దని పోరాటం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు బుధవారం సాయంత్రం విద్యుత్ శాఖ అధికారులతో కలిసి మార్కింగ్ చేయాలని ప్రయత్నం చేయగా ‘ ఇక్కడ సబ్ స్టేష¯ŒS వద్దని విజ్ఞప్తి చేయగా’ ‘మీరు చెబితే నేను ఆగడం ఏమిటి? ఎవరు అడ్డు వచ్చినా ఇక్కడ సబ్‌స్టేçÙ¯ŒS నిర్మాణం ఆగదు’ అనడంతో మహిళల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఇళ్ల మధ్యలో సబ్ స్టేష¯ŒS నిర్మాణానికి తాము ఎంతమాత్రం ఒప్పుకునేది లేదని, అవసరమైతే ఒంటిపై కిరోసి¯ŒS పోసుకుని ఆత్మాహుతికైనా సిద్ధపడతామని’ హెచ్చరించారు. సర్ధిచెప్పాల్సిన ఎమ్మెల్యే ‘పది మంది చచ్చినంత మాత్రాన నష్టం లేదని’ నిర్లక్ష్యంగా అనడాన్ని స్థానికులు తప్పుపడుతున్నారు. ఆయన వ్యాఖ్యలపై గురువారం సమావేశమై శుక్రవారం నుంచి రిలే నిరాహా దీక్షలు చేయడానికి కూర్చున్నామని, సబ్ స్టేష¯ŒS నిర్మాణం ఆలోచన విడిచిపెట్టేవరకు తమ దీక్ష కొనసాగిస్తామని తెలిపారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యవర్గ సభ్యుడు వాసంశెట్టి శ్రీనివాసకుమార్(శ్యాం) నిరాహార దీక్ష శిభిరాన్ని ప్రారంభించారు. కె.గంగవరం ఎంపీపీ, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెట్టా శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి శ్రీనివాసరామారావు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శి ఇసుకపట్ల శ్యామల, గ్రామ మాజీ సర్పంచ్ పిల్లి రాంబాబు, మందపల్లి మోషే, పిల్లి చంద్రరావులు మహిళల నిరసన దీక్షకు మద్దతు పలికారు. -
టీడీపీ ఎమ్మెల్యే ప్రభుత్వ వ్యతిరేక కరపత్రం విడుదల
రామచంద్రపురం : అవకాశం దొరికిన ప్రతిసారీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసే ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న కరపత్రాన్ని ఆవిష్కరించారు. అందులో ఆయన ఆంతర్యమేమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు. ’ప్రభుత్వంపై మాదిగల తిరుగుబాటు మహాసభ’ కరపత్రాన్ని వెంకటాయపాలెంలోని తన సృగృహంలో శుక్రవారం ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాదిగల సత్తా, మాదిగల గూటం దెబ్బ ఎలా ఉంటుందో బాగా తెలుసని, రిజర్వేషన్లపై స్పందించకపోతే మాదిగల సత్తా చూపి రాబోవు ఎన్నికల్లో ఏ విధంగా బుద్ధి చెప్పాలో యావత్ మాదిగ జాతి, మేధావులు విజ్ఞతతో ఆలోచించాలి’ అని కరపత్రంలో పేర్కొన్నారు.