- జనావాసాల మధ్య సబ్‌స్టేçÙ¯ŒSను వ్యతిరేకిస్తూ
- 20 రోజులుగా రిలే దీక్షలు
- శిబిరాన్ని ఖాళీ చేయాలని పోలీసుల హుకుం
- వేరే ప్రాంతంలో దీక్ష కొనసాగింపు
స్వగ్రామంలో ఎమ్మెల్యే తోటకు చుక్కెదురు
Published Wed, Nov 16 2016 11:39 PM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM
వెంకటాయపాలెం (రామచంద్రపురం రూరల్):
స్వగ్రామం వెంకటాయపాలెంలో జనావాసాల మధ్య విద్యుత్ సబ్ స్టేç షన్ నిర్మించాలనే ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు యత్నానికి గ్రామస్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 20 రోజులుగా గ్రామస్తులు రిలే దీక్షలు చేస్తున్నారు. ఆ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం ద్రాక్షారామ ఎస్సై ఫజులు రహ్మాన్, పోలీసులతో వచ్చి మార్గానికి ఇబ్బందిగా ఉందని, దీక్షా శిబిరాన్ని మార్చాలని ఆందోళనకారులను కోరారు. దాంతో దీక్షలో ఉన్న మహిళలు 20 ఇరవై రోజులుగా అడ్డుగా లేనిది ఇప్పుడు అడ్డు వచ్చిందా అంటూ దీక్షలో ఉన్న మహిళలు నిలదీయడంతో వారు వెళ్లిపోయారు. కొంత సేపటికి తిరిగి వచ్చిన పోలీసులు శిబిరాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. దాంతో గ్రామస్తులు టెంట్‌ను ఖాళీచేసి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో దీక్షలు కొనసాగించారు.
స్వగ్రామంలో సమస్యలు వదిలి జనచైతన్య యాత్రలా?
ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు స్వగ్రామం వెంకటాయపాలెంలో రెండు నిరాహార దీక్షా శిబిరాలు జరుగుతున్నాయి. వాటిలో ఒకటి జనావాసాల మధ్య విద్యుత్ సబ్‌స్టేçÙన్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నది. మరొకటి వెంకటాయపాలెం దళితులు శిరోముండనం కేసులో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తున్నది. వీటిని పట్టించుకోకుండా జన చైతన్య యాత్రలంటూ నియోజకవర్గంలో తిరగడానికి సిగ్గు లేదా అని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులును వైఎస్సార్ సీపీ బీసీ సెల్ కార్యవర్గ సభ్యుడు వాసంశెట్టి శ్రీనివాసకుమార్ (శ్యామ్) దుయ్యబట్టారు. బుధవారం నాటి దీక్షల్లో వాసంశెట్టి శ్రీనివాసకుమార్ (శ్యామ్), పిల్లి శ్రీనివాస రామారావు, అనుసూరి వెంకటరమణ, వాసంశెట్టి సత్యనారాయణ, దార్ల పాపారావు, పిల్లి రాంబాబు, దార్ల సత్యనారాయణ, వాసంశెట్టి ఏడుకొండలు, విత్తనాల కాంతమ్మ, ఈతకోట భవాని, కడలి లక్ష్మిసుకన్య, వాసంశెట్టి సత్తెమ్మ, మందపల్లి జ్యోతి, మందపల్లి రాణి, కుడుపూడి హైమావతి, పిల్లి చంద్రరావు కూర్చున్నారు.
Advertisement