లేట‘రైట్ అనలేదని’ కక్ష సాధిస్తారా..
జన్మభూమి సభలో సరుగుడు సర్పంచ్ ఆవేదన
నాతవరం : తాను చేసిన తప్పు ఏమిటో బహిరంగ విచారణ చేపట్టాక చెక్‌పవర్ రద్దుతోపాటు ఏ శిక్ష విధించినా సిద్ధమేనని సరుగుడు సర్పంచ్ సాగిన లక్ష్మణమూర్తి అన్నారు. శుక్రవారం సరుగుడులో నిర్వహించిన జన్మభూమి సభలో ఆయన మాట్లాడారు. మంత్రి అయ్యన్నపాత్రుడు తనయుడు చింతకాయల విజయ్ లాటరైట్ నిక్షేపాలు అనుమతికి అనుకూలంగా తీర్మానం ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. నిబంధనల మేరకు మాత్రమే చేయగలనని తాను చెప్పడంతో రాజకీయ కక్షసాధింపునకు పాల్పడ్డారన్నారు. పంచాయతీకి సంబంధించి తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. వైఎస్సార్‌సీపీ చెందిన వ్యక్తిని కావడంతో తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మంత్రి తనయుడు తన చెక్ పవర్‌ను రద్దు చేయించారన్నారు. అసలు ఏకారణంతో రద్దు చేశారో అధికారులు సభలో చెప్పాలని డిమాండ్ చేశారు. నోటీసు కూడా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. కనీసం గిరిజనుడనని కూడా కనికరంగా లేకుండా వ్యవహరించారని అవేదన వ్యక్తం చేశారు. తాను తప్పు చేసి ఉంటే ముందుగా దండోరా వేయించి గ్రామస్తుల సమక్షంలో విచారణ చేపట్టి ఎటువంటి శిక్ష విధించినా తాను సిద్ధమేనని అన్నారు. అంతే గానీ మంత్రి తనయుడు చెప్పాడని తనకు అన్యాయం చేయడం దారుణమన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానన్నారు.
లేటరైట్ తవ్వకందారులను అరెస్టు చేయాలి
నర్సీపట్నం: లేటరైట్ తవ్వకాలను నిలిపివేసి, సంబంధిత వ్యక్తులను అరెస్టు చేయాలని సీపీఎం డివిజన్ కమిటి సభ్యుడు ఎ.రాజు డిమాండ్ చేశారు. నాతవరం మండలం సరుగుడు శివారు అసనగిరి అటవీ ప్రాంతంలో 35.84 హెక్టార్లల్లో ఇచ్చిన అనుమతులను రద్దు చేసినందున తవ్వకాలను తక్షణమే నిలిపి వేయాలన్నారు. సింగం భవాని చట్ట విరుద్ధంగా అనుమతులు పొంది వన్యప్రాణులకు, గిరిజనుల జీవనానికి తీవ్ర నష్టం కలిగించారన్నారు. జిల్లా కలెక్టర్ జారీ చేసిన అదేశాల మేరకు తవ్వకాలు జరుపుతున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
చెక్ పవర్ రద్దు చేస్తారా?
Published Fri, Jan 8 2016 11:18 PM | Last Updated on Sun, Sep 3 2017 3:19 PM
Advertisement