ఏపీ విప్‌ నోట బూతు.. బూతు.. బూతు..! | ap whip chintamaneni prabhakar abuses officials | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 9 2018 6:45 PM | Last Updated on Fri, Aug 10 2018 8:34 PM

ap whip chintamaneni prabhakar abuses officials - Sakshi

సాక్షి, ఏలూరు: దుందుడుకు చర్యలతో ఎప్పుడూ వివాదాల్లో ఉండే టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ మరోసారి అధికారులపై చిందులు తొక్కారు. జన్మభూమి కార్యక్రమంలో బాహాటంగానే అధికారులను ఉద్దేశించి బూతులు మాట్లాడారు. ఆయన బూతులు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా విజయరాయిలో జన్మభూమి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విప్‌ చింతమనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైక్‌ సరిగ్గా పనిచేయకపోవడంతో చింతమనేని తీవ్ర అసహనానికి లోనయ్యారు. గ్రామాధికారి నరసింహారావుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బహిరంగ కార్యక్రమం అన్న విషయాన్ని కూడా మరిచిపోయి.. ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారు.  ఆయన తనదైన శైలిలో దుర్భాషలాడటంతో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న వారు నివ్వెరపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement