కొనసాగిన నిరసనల పర్వం
- ఆదోని మండలం పెద్దతుంబలంలో అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. గతంలో ఇచ్చిన దరఖాస్తులకు దిక్కేలేదని, ఇపుడు కార్యక్రమం నిర్వహించి ఏం లాభంమంటూ నిలదీశారు. ఆదోని ఆర్డీఓ ఓబులేసు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఓ ఆదేశాల మేరకు ప్రశ్నించిన ఆరుగురు గ్రామస్తులపై కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.
- ఆలూరు మండలం పెద్దహోతూరులో రేషన్‌కార్డులు మంజూరుకాకపోవడంపై దరఖాస్తుదారులు అధికారులను నిలదీశారు.
- కోడుమూరు మండలం గోరంట్లలో సమస్యలపై ప్రశ్నించిన వారిని పోలీసులు బయటకు పంపారు. సమస్యలను పరిష్కరించకపోగా ప్రశ్నించిన వారిని బయటకు పంపడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అధికారులు విద్యార్థుల చేత కార్యక్రమంపై డ్యాన్స్ ఏర్పాటు చేశారు. గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరకేత రావడంతో అర్ధంతరంగా ఆపేశారు.
- నంద్యాల మండలం పాండురంగాపురంఽలో ప్రజాసమస్యలపై గ్రామస్థులు అధికారులను నిలదీశారు. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో జరిగే గ్రామసభలు జనాలు లేక వెలవెలబోయాయి.