‘ఏయ్ నువ్వు ఏం చేస్తున్నావ్.. ఏం తమాషాగా ఉందా? ఇదేం అడ్మినిస్ట్రేషన్? ఇక్కడ రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు? ఏయ్ జేసీ చంద్రుడు.. నువ్వు ఏం చేస్తున్నావ్? నేను ఎవరినీ వదిలిపెట్టను’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ అధికారులపై విరుచుకుపడ్డారు. వీఆర్‌ఓ మొదలుకొని జాయింట్ కలెక్టర్ వరకు రెవెన్యూ అధికారులను జన్మభూమి బహిరంగ సభ వేదికపైకి పిలిచి మరీ తనదైన శైలిలో తీవ్ర స్వరంతో మందలించారు. సీఎం వైఖరి పట్ల అధికారులు నొచ్చుకున్నారు.