
ఫొటోలు లేని రేషన్‌కార్డులు
కర్నూలు, మద్దికెర: హడావుడిగా జరిపిన ఐదో విడత జన్మభూమి కార్యక్రమంలో ఓ వింత చోటు చేసుకుంది. రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పుకునేందుకు అధికారులు నానా హంగామా చేసి చివరికి లబ్ధిదారులకు ఆవేదన మిగిల్చారు. మండలంలో గతంలో దరఖాస్తు చేసుకున్న వాటిల్లో 123 రేషన్ కార్డులు మంజూరయ్యాయి. వాటిని 5వ విడతలో పంపిణీ చేయాలని సిద్ధం చేశారు. తీరా కార్డుల్లో లబ్ధిదారుల ఫొటోలు లేకపోవడంతో అధికారులు నాలుక కరుచుకొని తూతూ మంత్రంగా ప్రతి పంచాయతీలో నలుగురికి చొప్పున పంపిణీ చేసి మిగతావి అలాగే ఉంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment