ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి గురువారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నాలుగో విడత ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం.. తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమంగా జరిపి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఈ జన్మభూమి కార్యక్రమం మొత్తం ఖర్చును తెలుగుదేశం పార్టీ నుంచి ప్రభుత్వ ఖజానాకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరారు.